Afghan Journalists: అఫ్ఘాన్‌లో 24 గంటల్లోనే ఎంత మార్పు.? జర్నలిస్టులు బుర్ఖాల్లో

తాలిబాన్లు ఆక్రమించిన అఫ్ఘానిస్తాన్‌లో 24 గంటల్లోనే ఎంత మార్పు..? మీడియా ప్రతినిధులు సైతం బుర్ఖాలు వేయడం మొదలు పెట్టారు.

Afghan Journalists: అఫ్ఘాన్‌లో 24 గంటల్లోనే ఎంత మార్పు.? జర్నలిస్టులు బుర్ఖాల్లో

Afghan Taliban Journalists

Afghan Journalists: తాలిబాన్లు ఆక్రమించిన అఫ్ఘానిస్తాన్‌లో 24 గంటల్లోనే ఎంత మార్పు..? మీడియా ప్రతినిధులు సైతం బుర్ఖాలు వేయడం మొదలు పెట్టారు. వ్యక్తులెవరైనా సరే.. ఒకటే రూల్ అనే చందంగా విచ్ఛలవిడిగా చెలరేగుతున్న ఆగడాల నుంచి మీడియా ప్రతినిధులు సైతం జాగ్రత్తపడుతున్నారు. ఈ క్రమంలో బుర్ఖాలు ధరించి రిపోర్టింగ్ కంటిన్యూ చేస్తున్నారు.

ఈ మేరకు జర్నలిస్టులను ప్రొటెక్ట్ చేయడం కోసం ఏర్పాటు చేసిన కమిటీ జర్నలిస్టులు తాలిబాన్ల దాడి నుంచి తప్పించుకోవాలంటే బుర్ఖాలు తప్పనిసరిగా ధరించాలని చెప్పింది. ఆదివారం కాబుల్ లోకి ప్రవేశించిన తాలిబాన్లు మొత్తం ఆధీనంలోకి తెచ్చుకోవడంతో దేశాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న అష్రఫ్ ఘనీ దేశం వదలిపారిపోయారు.

గతవారం అనుమానస్పద అఫ్ఘన్ రేడియో స్టేషన్ మేనేజర్ ను కూడా తాలిబాన్ ఫైటర్లు హత్య చేశారు. జర్నలిస్ట్ కమ్యూనిటీలో భయం పుట్టించాలనే ఇలా చేసినట్లు సమాచారం.

జర్నలిస్టుల విషయంలో.. ప్రత్యేకించి మహిళలపై ప్రత్యేక ఆంక్షలు ఉన్నాయి. సీఎన్ఎన్ చీఫ్ ఇంటర్నేషనల్ కరస్పాండెంట్ క్లారిస్సా వార్డ్ మాట్లాడుతూ.. చాలా సంవత్సరాలుగా బోల్డ్ గా స్వతంత్ర్యంగా రిపోర్టింగ్ చేయగలిగాం. ఇప్పుడు భయపడాల్సి వస్తుంది. ఇకపై పనిచేస్తామా అనే అనుమానం కూడా ఉందని చెప్పారు.

ఈ సంవత్సరం కనీసం ముగ్గురు మహిళా జర్నలిస్టుల హత్య జరిగింది. వారిలో ఒకరి గన్‌మన్ ను స్పాట్ లో కాల్చేసి హత్య చేశారు. సొసైటీలో జరిగే ప్రతి విషయాన్ని ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశ్యంతో బయటికొచ్చే జర్నలిస్టులు అనుక్షణం భయపడుతూ.. బుర్ఖాలు ధరించే రిపోర్టింగ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే, కాబుల్ పరిసరాల్లో గతంలో లేనంతగా బుర్ఖాలు అమ్ముడుపోతున్నాయట.

మహిళల పట్ల కఠిన ఆంక్షలతో వ్యవహరిస్తున్న తాలిబాన్లు యుక్త వయస్సు వచ్చిన మహిళలు, రెండెంకల వయస్సు వచ్చిన బాలికలపై బోలెడు నిబంధనలు ఉండాలంటున్నారు. తాము ప్రజలను సురక్షితంగా ఉంచుతామని చెప్పినప్పటికీ, వారి వైఖరి పట్ల అఫ్ఘానిస్తానీయులు భయపడుతూనే ఉన్నారు.

చాలా మందిలో తాలిబాన్లు మళ్లీ ఆఫ్ఘనిస్తాన్ ను 20ఏళ్లు వెనక్కి తీసుకెళ్లిపోతారనే భయం కనిపిస్తుంది. కాబుల్ నుంచి ఢిల్లీకి వచ్చిన ఒక మహిళ మాట్లాడుతూ ఆఫ్ఘనిస్తాన్‌కు ప్రపంచం మద్దతుగా నిలుస్తుందనే నమ్మకం తనకు లేదన్నారు. తన స్నేహితురాలు తాలిబన్ చేతిలో హతమైందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు అఫ్ఘానిస్తాన్ లో ఎటువంటి అధికారాలు లేవంటూ వాపోయారు.