Kabul Blast : క్రికెట్ స్టేడియంలో బాంబు పేలుడు.. భయంతో జనం పరుగులు

కాబూల్ లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో బాంబు పేలుడు సంభవించింది. టీ20 క్రికెట్ లీగ్ మ్యాచ్ లో ఆత్మాహుతి దాడి జరిగింది. దీంతో స్టేడియంలో ఉన్న ప్రజలంతా భయంతో బయటకు పరుగులు తీశారు.

Kabul Blast : క్రికెట్ స్టేడియంలో బాంబు పేలుడు.. భయంతో జనం పరుగులు

Kabul Blast

Kabul Blast : కాబూల్ లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో బాంబు పేలుడు సంభవించింది. టీ20 క్రికెట్ లీగ్ మ్యాచ్ లో ఆత్మాహుతి దాడి జరిగింది. దీంతో స్టేడియంలో ఉన్న ప్రజలంతా భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ పేలుడులో పలువురు గాయపడ్డారు. కాబూల్‌లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో పేలుడు జరిగినట్లు అప్ఘానిస్తాన్ క్రికెట్ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నాసిబ్ ఖాన్ జద్రాన్ ధృవీకరించారు. కాగా.. ఆటగాళ్లకు, విదేశీ పౌరులకు ఎలాంటి హాని జరగలేదని జద్రాన్ తెలిపారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

పేలుడు అనంతరం ప్రజలు భయాందోళనకు గురయ్యారు. బంకర్‌లోకి పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Kabul Bomb Blast : కాబూల్‌లో స్కూళ్లే లక్ష్యంగా బాంబు పేలుళ్లు.. భారీ సంఖ్యలో విద్యార్థులు మృతి?

అఫ్ఘానిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రతి సంవత్సరం నిర్వహించే టీ20 క్రికెట్ టోర్నమెంట్ ష్పగీజా క్రికెట్ లీగ్. బ్యాండ్-ఎ-అమీర్ డ్రాగన్స్ వర్సెస్ పామిర్ జల్మీ మ్యాచ్ లో ఈ పేలుడు చోటు చేసుకుంది.