India-Pakistan: అణు యుద్ధం చేస్తామంటూ భారత్‌కు పాకిస్థాన్ మంత్రి బెదిరింపు

పాకిస్థాన్ వద్ద అణు బాంబు ఉందని, తామూ అణు యుద్ధం చేయగలమంటూ ఆ దేశ మంత్రి షాజియా మర్రీ హెచ్చరించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీని ‘గుజరాత్ కసాయి’ అని పేర్కొంటూ పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావర్ భుట్టో చేసిన వ్యాఖ్యలపై భారత్ కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే. అలాగే, భారత్ వ్యాప్తంగా బీజేపీ నిరసన ప్రదర్శనలు నిర్వహించింది. ఇప్పుడు పాక్ కు చెందిన మరో మంత్రి అణు బాంబులను ప్రస్తావిస్తూ, భారత్ పై విషం చిమ్ముతూ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

India-Pakistan: అణు యుద్ధం చేస్తామంటూ భారత్‌కు పాకిస్థాన్ మంత్రి బెదిరింపు

India-Pakistan

India-Pakistan: పాకిస్థాన్ వద్ద అణు బాంబు ఉందని, తామూ అణు యుద్ధం చేయగలమంటూ ఆ దేశ మంత్రి షాజియా మర్రీ హెచ్చరించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీని ‘గుజరాత్ కసాయి’ అని పేర్కొంటూ పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావర్ భుట్టో చేసిన వ్యాఖ్యలపై భారత్ కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే. అలాగే, భారత్ వ్యాప్తంగా బీజేపీ నిరసన ప్రదర్శనలు నిర్వహించింది. ఇప్పుడు పాక్ కు చెందిన మరో మంత్రి అణు బాంబులను ప్రస్తావిస్తూ, భారత్ పై విషం చిమ్ముతూ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

తాజాగా, షాజియా మర్రీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ… ‘‘పాకిస్థాన్ వద్ద అణు బాంబు ఉందన్న విషయాన్ని భారత్ మర్చిపోవద్దు. అణ్వస్త్ర దేశంగా మా ఉన్న హోదాతో మేము సరిపెట్టుకోం. అవసరం వచ్చినప్పుడు అణు బాంబును వాడడంలో వెనకాడబోం’’ అని చెప్పుకొచ్చారు. ఒకవేళ మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తే, ఆయనకు తగిన సమాధానం వస్తుందని అన్నారు. పాకిస్థాన్ పై పదే పదే ఆరోపణలు చేస్తే వాటిని వింటూ తమ దేశం ఊరుకోబోదని చెప్పారు.

కాగా, పాక్ విదేశాంగ మంత్రి బిలావర్ భుట్టో అమెరికాలో ఇటీవల మాట్లాడుతూ మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఒసామా బిన్ లాడెన్ మృతి చెందాడని, కానీ, గుజరాత్ కసాయి ఇంకా బతికే ఉన్నారని అన్నారు. ఇండియాకు ప్రధాని కూడా అయ్యారని వ్యాఖ్యానించారు. మోదీ భారత దేశ ప్రధాని అయ్యే వరకు అమెరికాలోకి రాకుండా నిషేధం ఉండేదని చెప్పారు. దీనిపై భారత్ అభ్యంతరాలు తెలిపింది. పాకిస్థాన్ విదేశాంగ మంత్రి చేసిన వ్యాఖ్యలు అనాగరికంగా ఉన్నాయని పేర్కొంది.

Penis-headed statue of Putin: ఇంగ్లాండులో రష్యా అధ్యక్షుడు పుతిన్ అశ్లీల విగ్రహం.. గుడ్లు విసురుతున్న బాటసారులు