Travel Ban From South Africa : దక్షిణాఫ్రికా నుంచి వచ్చే ప్రయాణికులపై యూరప్ దేశాలు నిషేధం

దక్షిణాఫ్రికాలో తాజాగా బయటపడ్డ కోవిడ్ కొత్త వేరియంట్ బి.1.1.529 ఇప్పుడు ప్రపంచదేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. దక్షిణాఫ్రికాలో మొదటిసారిగా గుర్తించబడిన పెద్ద సంఖ్యలో ఉత్పరివర్తనాలతో

Travel Ban From South Africa : దక్షిణాఫ్రికా నుంచి వచ్చే ప్రయాణికులపై యూరప్ దేశాలు నిషేధం

Travel

Travel Ban From South Africa   దక్షిణాఫ్రికాలో తాజాగా బయటపడ్డ కోవిడ్ కొత్త వేరియంట్ బి.1.1.529 ఇప్పుడు ప్రపంచదేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. దక్షిణాఫ్రికాలో మొదటిసారిగా గుర్తించబడిన పెద్ద సంఖ్యలో ఉత్పరివర్తనాలతో కూడిన బి.1.1.529 వేరియంట్ తమ దేశాల్లోకి ప్రవేశించకుండా కట్టడి చేసుందుకు పలు దేశాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా యూకే, జర్మనీ మరియు ఇటలీ దేశాలు దక్షిణాఫ్రికా నుండి ప్రయాణికులెవరూ తమ దేశంలోకి రాకుండా నిషేధం విధించాయి.

కొత్త COVID-19 వేరియంట్ వ్యాప్తిని కట్టడి చేయడం కోసం దక్షిణ ఆఫ్రికా నుండి విమాన ప్రయాణాన్ని నిలిపివేయాలనుకుంటున్నట్లు యూరోపియన్ యూనియన్ ఎగ్జిక్యూటివ్ కూడా చెప్పారు. ఈయూ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్ ఒక ప్రకటనలో… “సభ్య దేశాలతో సన్నిహిత సమన్వయంతో, దక్షిణ ఆఫ్రికా ప్రాంతం నుండి విమాన ప్రయాణాలను ఆపడానికి ప్రతిపాదిస్తున్నట్లు” తెలిపారు.

ఇప్పటికే కోవిడ్ ఫోర్త్ వేవ్ తో యూరప్ దేశాలు అల్లాడుతున్న విషయం తెలిసింది. వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి పలు యూరప్ దేశాల ప్రభుత్వాలు ఆంక్షలను కఠినతరం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో గురువారం బ్రిటన్‌.. విమానాల నిషేధ ప్రతిపాదనతో ముందుకొచ్చింది. దక్షిణాఫ్రికాతో పాటు మరో ఐదు ఆఫ్రికా దేశాల నుండి విమానాలను నిషేధిస్తున్నట్లు బ్రిటన్ గురువారం ప్రకటించగా..శుక్రవారం మధ్యాహ్నం నుండి నిషేధం అమల్లోకి వచ్చింది. ఇక, ఆ దేశాల నుండి ఇటీవల దేశంలోకి వచ్చిన ఎవరైనా కరోనావైరస్ పరీక్ష చేయించుకోవాల్సిందేనని బ్రిటన్ సృష్టం చేసింది.

కోవిడ్ కొత్త వేరియంట్‌ నేపథ్యంలో ఆఫ్రికా దేశాలైన బోట్స్వానా, ఎస్వాటిని, లెసోతో, మొజాంబిక్, నమీబియా, దక్షిణాఫ్రికా మరియు జింబాబ్వేలను..గురువారం సాయంత్రం “రెడ్ లిస్ట్”లో చేర్చింది ఇజ్రాయెల్. ఈ దేశాల నుంచి విమాన రాకపోకలను నిలిపివేసింది.

ఇక,పలు దేశాలతో పాటు భారత్ కూడా కోవిడ్ కొత్త వేరియంట్ దేశంలోకి ప్రవేశించకుండా చర్యలు చేపడుతోంది. కొత్త వేరియంట్ పై ఇప్పటికే రాష్ట్రాలను కేంద్రం హెచ్చరించింది. కొత్త వేరియంట్‌ ప్రజారోగ్యానికి సవాలు విసిరే ప్రమాదం ఉందని, అందువల్ల దక్షిణాఫ్రికాతో పాటు హాంకాంగ్‌, బోత్స్​వానా నుంచి వచ్చే ప్రయాణికులందరినీ ముప్పు ఉన్నవారిగానే పరిగణించి వారికి కఠినమైన స్క్రీనింగ్‌ జరిపి, పరీక్షలు నిర్వహించాలని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు గురువారం రాసిన లేఖలో కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ సూచించారు. పరీక్షల్లో పాజిటివ్‌గా తేలిన వారి నమూనాలను జన్యు పరిణామక్రమ విశ్లేషణ కోసం పంపాలని సూచించారు.

ALSO READ Covid New Variant : ఇజ్రాయెల్ లో కోవిడ్ కొత్త వేరియంట్ కేసులు