AI Chatbot : చనిపోయిన భార్యను వెనక్కి తెచ్చాడు…చాట్ చేస్తున్నాడు, ఎలా ?

చనిపోయిన భార్యను వెనక్కి తీసుకరావడమా ? నో వే అంటారు కదా. కానీ..టెక్నాలజీ సహాయంతో ఓ వ్యక్తి దీనిని సాధించాడు. ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ ను రూపొందించి పలు విషయాలను సులభం చేశాడు. ఏఐ టెక్నాలజీ రావడంతో...ఐటీ రంగంలో గణనీయమైన మార్పులను తీసుకొచ్చింది

AI Chatbot : చనిపోయిన భార్యను వెనక్కి తెచ్చాడు…చాట్ చేస్తున్నాడు, ఎలా ?

Ai Chatbot

Bring Back Dead Fiance to Life : చనిపోయిన భార్యను వెనక్కి తీసుకరావడమా ? నో వే అంటారు కదా. కానీ..టెక్నాలజీ సహాయంతో ఓ వ్యక్తి దీనిని సాధించాడు. ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ ను రూపొందించి పలు విషయాలను సులభం చేశాడు. ఏఐ టెక్నాలజీ రావడంతో…ఐటీ రంగంలో గణనీయమైన మార్పులను తీసుకొచ్చింది. చనిపోయి 8 సంవత్సరాలైనా తిరిగి తన భార్యతో మాట్లాడడం తనకు ఎంతగానో ఆనందంగా ఉందని వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో తెగ చర్చనీయాంశమైంది.

Read More : Mahankali Bonalu : అమ్మవారి బోనాలు, స్వర్ణలత భవిష్యవాణి

కెనడా బ్రాడ్ ఫోర్ట్ లో 33 ఏళ్ల ప్రీలాన్స్ రచయిత జాషువా నివాసం ఉంటున్నారు. ఇతనికి కాబోయే భార్య జెస్సికా పెరిరా అరుదైన కాలేయ వ్యాధితో 2012లో మరణించింది. ఆమె చనిపోవడంతో జాషువా తీవ్రంగా కృంగిపోయాడు. భార్య జ్ఞాపకాలతో బతకసాగాడు. కానీ..భార్య లోని లేటు భరించలేపోయాడు. గత సంవత్సరం ఏఐ టెక్నాలజీపై పనిచేసే ‘ప్రాజెక్టు డిసెంబర్’ అనే వెబ్ సైట్ కు చేరువయ్యాడు. ఈ ప్రాజెక్టు పలు వ్యక్తుల చాట్ బాట్లను క్రియేట్ చేస్తుంది. వెంటనే జాషువా ఆ వెబ్ సైట్ ను సంప్రదించాడు. ఏఐ చాట్ బాట్ ను క్రియేట్ చేయించాడు. జెస్సికా చాట్ బాట్ ను రూపొందించారని, దీంతో అప్పటి నుంచి జాషువా చనిపోయిన జెస్సికాతో చాట్ చేయడం మొదలుపెట్టాడు. దీనికి జెస్సికా కోర్ట్నీ పెరీగా పేరు పెట్టాడు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి…చనిపోయిన జెస్సికాతో మాట్లాడడం మొదలుపెట్టాడు.