Air pollution : థాయ్‌లాండ్‌లో వాయు కాలుష్యం..13లక్షల మందికి అస్వస్థత..ఒక్క వారంలోనే అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన 2లక్షలమంది

థాయ్‌లాండ్ లో తీవ్ర వాయు కాలుష్యంతో 13లక్షల మందికి అస్వస్థతతకు గురి అయ్యారు. ఈ కాలుష్యం ఎంత తీవ్రంగా ఉందంటే ..ఒక్క వారంలోనే అనారోగ్యంతో 2లక్షలమంది ఆస్పత్రిలో చేరారు.

Air pollution : థాయ్‌లాండ్‌లో వాయు కాలుష్యం..13లక్షల మందికి అస్వస్థత..ఒక్క వారంలోనే అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన 2లక్షలమంది

Air pollution In Thailand

Air pollution In Thailand : వాయు కాలుష్యం (air pollution). మనుషులను రోగాలపాలు చేయటమే కాదు ప్రాణాలు తీసేస్తోంది. ఊపిరి పీల్చటమే పాపంగా మారి మనుషుల ఉసురు తీస్తోంది. ఊపిరి పీల్చందే ఏ జీవి బతకలేదు. కానీ ఈ ఊపిరి తీసుకోవటమే ప్రాణాలు తీసేస్తుంటే ఇక జీవించేది ఎలా? అనే ఆందోళన నెలకొంటోంది. వాయి కాలుష్యానికి లక్షలాదిమంది ప్రాణాలు కోల్పోతున్నారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అయినా అభివృద్ధి పేరుతో పెరుగుతున్న వాయు కాలుష్యం నియంత్రణా చర్యలు శూన్యమనే చెప్పాలి. అటువంటి వాయు కాలుష్యం థాయ్ లాండ్ (Thailand)లో నియంత్రణ కోల్పోయింది. మితిమీరిన వాయుకాలుష్యంతో థాయ్ లాండ్ లో ఏకంగా 13లక్షల మంది ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురి అయ్యారు. రెండు లక్షలమంది తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో చేరారు.

వాహనాల నుంచి వెలువడే కాలుష్యం, పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యంతో గాలి కలుషితం అయిపోయింది. ఆ గాలి పీల్చటం వల్ల థాయ్ లాండ్ లో 13లక్షల మంది తీవ్ర అవస్థలు పడుతున్నారు. పలు రకాల అనారోగ్య సమస్యలతో అల్లాడుతున్నారు. ఏకంగా రెండు లక్షలమంది తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. థాయ్ లాండ్ దేశ వ్యాప్తంగా గాలి నాణ్యత స్థాయిలు గణనీయంగా పడిపోయాయి. మాస్కులు ధరించినా వాయు కాలుష్యం బారిన పడక తప్పటంలేదు.

ఇటువంటి పరిస్థితుల్లో థాయ్ లాండ్ రాజధాని బ్యాంకాక్ (Bangkok)ఉద్గార పొగమంచు (emission haze)తో కప్పబడిపోయింది. ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రాంతమైన బ్యాంకాక్ ఇలా కాలుష్య కోరల్లో చిక్కుకోవటం ఆందోళనకరంగా మారింది. పొలాల్లో పంట వ్యర్ధాలను దగ్థం చేయటం వల్ల ఇలా బ్యాంకాక్ అంతా వాయు కాలుష్యానికి గురి అవుతోందని స్థానిక మీడియా చెబుతోంది.

బ్యాంకాక్‌లోని 50 జిల్లాల వరకు ఈ కాలుష్య కోరాల్లో చిక్కుకుని అల్లాడుతోంది. ఈ 50 జిల్లాలోను గాలి నాణ్యంత ప్రమాదకరంగా మారిందని 2.5 పీఎం స్థాయికి గాలి నాణ్యత క్షీణించిపోయింది. ఈ పరిస్థితి ఏకంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తున్న గాలి కాలుష్య స్థాయిని మించిపోవటం ఆందోళన కలిగిస్తోంది. ఈ స్థాయిలో గాలి కణాలు ఊపిరి పీల్చటం ద్వారా శరీరంలోకి చేరిపోయి రక్తంలో కలిసిపోయి అవయవాలను దెబ్బతీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

థాయ్ లాండ్ ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాకాల ప్రకారం..వాయు కారుణ్యం కారణంగా ఈఏడాది దేశంలో 1.3 మిలియన్లకు పైగా ప్రజలు అనారోగ్యానికి గురి అయ్యారని వెల్లడించింది. ఈ వారంలోనే దాదాపు రెండు లక్షల మంది తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిపాలయ్యారని తెలిపింది. ఇటువంటి పరిస్థితుల్లో చిన్నపిల్లలు, గర్భిణిలు బయటకు రావద్దని సూచించింది. అలాగే బయటకు వచ్చే ప్రజలు N95 మాస్కులు ధరించాలని సూచించింది.