హార్ట్ ఎటాక్ వచ్చిన యజమానికి పునర్జన్మనిచ్చిన కుక్క

హార్ట్ ఎటాక్ వచ్చిన యజమానికి పునర్జన్మనిచ్చిన కుక్క

German shepherd saves owner life : కడుపు నిండా  పెడితే కుక్కలు మనుషుల్ని ప్రాణంకంటే ఎక్కువగా కాపాడతాయి. ఎన్నో సందర్భాల్లో కుక్కల విశ్వాసం గురించి విన్నాం. కుక్కలు తమ యజమానులపై అంతులేని ప్రేమను పెంచుకుంటాయి. వాళ్లకు కష్టం వచ్చిదంటే వాటి ప్రాణాలు కూడా పణ్ణంగా పెడతాయి. సాటి మనుషులకు లేని విశ్వాసం ప్రేమ కుక్కలకు ఉంటాయి. అటువంటి ఓ కుక్క తన యజమానికి హార్ట్ ఎటాక్ వచ్చి ప్రాణాపాయంలో ఉంటే అచ్చం మనిషిలాగా తెలివితేటల్ని ఉపయోగించి అతని ప్రాణాలు కాపాడింది.

అమెరికాకు చెందిన బ్రియాన్‌ మైయర్స్‌ అనే వ్యక్తి ‘రమపో బెర్గెన్‌ యానిమల్‌ రెప్యూజీ’ అనే జంతు సంరక్షణా కేంద్రం నుంచి ఓ జర్మన్‌ షెపర్డ్‌ జాతికి చెందిన కుక్కను దత్తత తీసుకున్నారు. దానికి ‘శాడీ’ అని పేరు పెట్టుకుని ప్రేమగా పెంచుకుంటున్నారు. శాడీ తెలివితేటలు చూసిన బ్రియాన్ ఆశ్చర్యపోయేవారు. చెప్పిన పని ఠక్కుమని చేసే దాని చురుకుదనం చూసి ముచ్చటపడేవారు. అనుక్షణం యజమానికి శాడీ వదిలిపెట్టేది కాదు. బ్రియాన్‌ వెంటే ఉండేది. దాంతో శాడీ అంటే బ్రియాన్ కు అంతులేని ప్రేమ ఏర్పడిపోయింది. అతను కుక్క ఇద్దరూ ప్రాణంగా ఉండేవారు. శాడీని కన్నబిడ్డలాగా చూసుకునేవారు బ్రియాన్.

ఈక్రమంలో గత వారం రోజుల క్రితం ఇంట్లో ఎవరూ లేని టైమ్ లో బ్రియాన్‌కు హార్ట్ ఎటాక్ వచ్చింది. అక్కడి కక్కడే బ్రియాన్ కుప్పకూలిపోయారు. నేలపై పడి నొప్పితో గిలగిల్లాడసాగారు. యజమాని పరిస్థితిని గమనించిన శాడీ ఆయన దగ్గరకు వెళ్లింది. స్ప్రహ కోల్పోకుండా కళ్లను నాకటం ప్రారంభించింది.

ఆ తరువాత దానికి ఏం తోచిందో గానీ బ్రియాన్ షర్టును నోట కరచుకుని సెల్‌ఫోన్‌ దగ్గరకు లాక్కెళ్లింది. దాంతో బ్రియాన్ లేని సత్తువ తెచ్చుకుని ఎలాగోలా అంబులెన్స్‌కు ఫోన్‌ చేయటంతో వెంటనే వచ్చిన అంబులెన్స్ సిబ్బంది బ్రియాన్‌ను హుటాహుటీన ఆస్పత్రికి తరలించటం..డాక్టర్లు వెంటనే ట్రీట్ మెంట్ చేయటంచకచకా జరిగిపోయాయి.

దీంతో బ్రియాన్‌ ప్రాణాలతో బయటపడ్డాడు. తనకు పునర్జన్మనిచ్చిన తన శాడీని కౌగలించుకుని మై సన్ అంటూ ప్రేమగా నిమిరారు బ్రియాన్. నా శాడీ నాకు సెకండ్ లైఫ్‌ ఇచ్చాడని తెగ మురిసిపోయారు. 6 సంవత్సరాల నా శాడీ నాకు ఆరోప్రాణం అని..ఇది మాటలకందని అనుభూతి అని బ్రియాన్ తన శాడీని గుండెలకు హత్తుకున్నారు.