Food crisis in Shanghai: ఆహారం కోసం అలమటిస్తున్న చైనా వాసులు: లాక్ డౌన్ లోనే షాంఘై నగరం

నిల్వ ఉన్న కాస్త ఆహార పదార్ధాలు సైతం నిండుకోవడంతో షాంఘై నగరంలో తీవ్ర ఆహార కొరత ఏర్పడింది. ఆహారం కోసం ప్రజలు ఆర్తనాదాలు పెడుతున్న దృశ్యాలు ఇటీవల అంతర్జాతీయ మీడియాకు చిక్కాయి

Food crisis in Shanghai: ఆహారం కోసం అలమటిస్తున్న చైనా వాసులు: లాక్ డౌన్ లోనే షాంఘై నగరం

Shanghai

Food crisis in Shanghai: కరోనా మహమ్మారి మరోమారు చైనాను వొణికిస్తుంది. కోవిడ్ -19 మొదటి దశ కంటే..ప్రస్తుతం చైనాలో కేసుల సంఖ్య ఎక్కువగా నమోదు అవుతున్నాయి. 2022 ఫిబ్రవరి చివరి వారంలో చైనాలో నాలుగో దశ కరోనా వ్యాప్తి మొదలవగా..నేటికీ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రధానంగా చైనా తూర్పు ప్రాంతంలో కరోనా విలయ తాండవం చేస్తుంది. ఇక చైనా ఆర్ధిక రాజధాని షాంఘైలో కరోనా పాజిటివ్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. దీంతో సుమారు రెండున్నర కోట్ల మందికి పైగా జనాభా ఉన్న ఈ నగరంలో కఠిన లాక్ డౌన్ విధించారు అక్కడి అధికారులు. గత నెల రోజులుగా షాంఘై నగరంలో లాక్ డౌన్ కొనసాగుతూనే ఉంది. వేగంగా వ్యాప్తి చెందుతున్న ఓమిక్రాన్ వేరియంట్ కారణంగా షాంఘై నగరంలో మార్చి నెల నుంచి ఇప్పటి వరకు 3 లక్షల 90 వేల మంది మహమ్మారి భారిన పడ్డారు.

Also read:Elephant: అతిపెద్ద ఎనుగును హతమార్చిన వేటగాళ్లు.. బోట్స్‌వానా ప్రజల ఆగ్రహం.. ఎందుకంటే..

వైరస్ వ్యాప్తి ఎంతకూ నియంత్రణలోకి రాకపోవడంతో అధికారులు నగరం మొత్తాన్ని నిర్బంధించారు. గత 40 రోజులుగా ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. సూపర్ మార్కెట్లు, ఆహార కేంద్రాలు సైతం మూసివేయడంతో నిత్యావసరాల కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజల ఇబ్బందులపై అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. నిల్వ ఉన్న కాస్త ఆహార పదార్ధాలు సైతం నిండుకోవడంతో షాంఘై నగరంలో తీవ్ర ఆహార కొరత ఏర్పడింది. ఆహారం కోసం ప్రజలు ఆర్తనాదాలు పెడుతున్న దృశ్యాలు ఇటీవల అంతర్జాతీయ మీడియాకు చిక్కాయి.

Also read:Drugs in Gujarat: గుజరాత్ పోర్టులో రూ.1300 కోట్లు విలువైన డ్రగ్స్ స్వాధీనం

పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రజలు ప్రభుత్వంపై తిరుగుబాటుకు దిగే అవకాశం ఉందని భావించిన అధికారులు..ముందు జాగ్రత్త చర్యలకు దిగారు. రానున్న నెల రోజుల్లో దశల వారీగా షాంఘై నగరంలో లాక్ డౌన్ ఎత్తివేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. అయితే ఈలోగా నగర జనాభా మొత్తానికి కరోనా పరీక్షలు నిర్వహించి, క్రమంగా క్వారంటైన్ కేంద్రాలను ఎత్తివేయనున్నారు. షాంఘై మహానగరం సహా చైనా తూర్పు ప్రాంతంలో మహమ్మారి ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తున్న సంకేతాలు అందుతున్నాయని శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో చైనా ఆరోగ్యశాఖ పేర్కొంది.

Also Read:Boris Johnson India: నేడు ప్రధాని మోదీతో బ్రిటన్ ప్రధాని భేటీ: రష్యా – యుక్రెయిన్ యుద్ధం, వాణిజ్య అంశాలపై చర్చ