Drugs in Gujarat: గుజరాత్ పోర్టులో రూ.1300 కోట్లు విలువైన డ్రగ్స్ స్వాధీనం

గురువారం గుజరాత్​లోని కండ్లా పోర్టుకు సమీపంలోని కంటైనర్ నిలిపివుంచే ప్రాంతంలో ఈ డ్రగ్స్ ని పట్టుకున్నారు అధికారులు

Drugs in Gujarat: గుజరాత్ పోర్టులో రూ.1300 కోట్లు విలువైన డ్రగ్స్ స్వాధీనం

Drugs

Drugs in Gujarat: దేశంలోకి డ్రగ్స్ అక్రమ సరఫరా కొనసాగుతుంది. పోలీసులు, రెవిన్యూ అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా, ఎంత నిఘా ఉంచినా డ్రగ్స్ దందా మాత్రం కొనసాగుతూనే ఉంది. తాజాగా గుజరాత్ లోని ఓ పోర్టులో రూ.1300 కోట్లు విలువైన 260 కిలోల హెరాయిన్​ ను డీఆర్​ఐ అధికారులు పట్టుకున్నారు. గురువారం గుజరాత్​లోని కండ్లా పోర్టుకు సమీపంలోని కంటైనర్ నిలిపివుంచే ప్రాంతంలో ఈ డ్రగ్స్ ని పట్టుకున్నారు అధికారులు. పూర్తి వివరాల్లోకి వెళితే.. కచ్​ జిల్లాలోని కండ్లా పోర్టుకు సమీపంలో ఉన్న కంటెయినర్​ స్టేషన్​లో డ్రగ్స్ ఉన్నాయంటూ గుజరాత్​ యాంటీ టెర్రరిస్ట్​ స్క్వాడ్​(ఏటీఎస్​)కు విశ్వసనీయవర్గాల నుంచి సమాచారం అందింది.

Also read: Bhopal Lovers : ప్రియుడితో బైకుపై చెల్లి చెట్టాపట్టాల్.. సినీ ఫక్కీలో అన్న చేజింగ్.. వీడియో వైరల్!

దీంతో డైరెక్టరేట్​ ఆఫ్​ రెవెన్యూ ఇంటెలిజెన్స్​(డీఆర్​ఐ) కలిసి రంగంలోకి దిగిన ఏటీఎస్ అధికారులు కండ్లా పోర్ట్​లోని కంటెయినర్​ స్టేషన్​లో తనిఖీలు చేపట్టారు. అధికారులు తనిఖీలు చేస్తున్న సమయంలోనే కంటెయినర్​ లోపల భారీగా హెరాయిన్ దాచి తరలిస్తుండగా పట్టుకున్నారు. కంటైనర్ తెరిచి చూడగా అందులో 260 కిలోల హెరాయిన్​ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీని విలువ రూ.1300 కోట్లుగా ఉంటుందని డీఆర్​ఐ అధికారులు వెల్లడించారు. గతంలో ముంద్రా పోర్టులో రెండు కంటెయినర్లలో రూ.21 వేల కోట్ల విలువైన 2,988 కిలోల హెరాయిన్ ను అధికారులు పట్టుకున్నారు. 2021 సెప్టెంబర్​లోనూ డ్రగ్స్​ సీజ్​ చేశారు.

Also Read:Drugs Case : బంజారాహిల్స్ డ్రగ్స్ కేసు-బెయిల్ పిటీషన్ కొట్టివేత