శ్రీలంక, నేపాల్‌లోనూ బీజేపీ ప్రభుత్వం

శ్రీలంక, నేపాల్‌లోనూ బీజేపీ ప్రభుత్వం

భారత్‌లో తిరుగులేని పార్టీగా రెండు సార్లు అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ.. దేశానికే పరిమితం కాకుండా.. విదేశాల్లోనూ పాగా వేయనుందా? శ్రీలంక, నేపాల్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని భావిస్తోందా? అవుననే అంటున్నాయి బీజేపీ వర్గాలు.. ఈ విషయం చెప్పింది కూడా ఎవరో కాదు.. త్రిపుర సీఎం విప్లవ్‌ దేవ్.

బీజేపీ లక్ష్యం దేశానికే పరిమిత కాకుండా.. పొరుగు దేశాల్లోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అనుకుంటుందట. కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా నేపాల్, శ్రీలంకలోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చూస్తున్నారని త్రిపుర సీఎం విప్లవ్ దేవ్ ప్రకటించారు. విప్లవ్‌దేవ్‌ 2018లో త్రిపుర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అమిత్‌ షాతో భేటి అయ్యారు. అప్పట్లో బీజేపీ అధ్యక్షునిగా ఉన్న అమిత్ షా భారత్‌లోని అన్ని రాష్ట్రాల్లోనూ విజయం సాధించాక.. విదేశాల్లోనూ గెలిచేందుకు ప్లాన్‌ చేయాలని చెప్పారట.

ఇప్పటికే బీజేపీ చాలా రాష్ట్రాలలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా.. అంతర్జాతీయంగా పార్టీ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు.. బీజేపీ నేత అజయ్‌ జామ్‌వాలా అన్నారు. వెంటనే పార్టీని నేపాల్‌, శ్రీలంకకు విస్తరించాలని, అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అమిత్‌ షా చెప్పినట్లు విప్లవ్‌ దేవ్ తెలిపారు. అమిత్‌ షా నేతృత్వాన్ని పొగిడేసిన విప్లవ్‌ దేవ్-కేరళలో అధికారాన్ని దక్కించుకోవడమే కాకుండా త్వరలో దక్షిణాది రాష్ట్రాలలోనూ బీజేపీ బలపడుతుందని అన్నారు.