Viral Video : ఇంటర్వ్యూ గదిలో చెల్లిపై దాడి చేసిన అక్క..కారణం ఏమిటో తెలుసా ?

ఓ యువతిని ఇంటర్వ్యూ చేస్తున్నారు. అకస్మాత్తుగా మరో యువతి గదిలోకి దూసుకొచ్చి..ఇంటర్వ్యూ ఇస్తున్న యువతిని ఛైర్ నుంచి కిందకు లాగేసి..దాడికి పాల్పడింది. ముష్టిఘాతాలు కురిపించింది.

Viral Video : ఇంటర్వ్యూ గదిలో చెల్లిపై దాడి చేసిన అక్క..కారణం ఏమిటో తెలుసా ?

Dallas

Angry Woman : ఓ కంపెనీలో ఇంటర్వ్యూ జరుగుతోంది. ఉద్యోగం సంపాదించుకోవడానికి కొంతమంది వచ్చారు. వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు కంపెనీ ప్రతినిధులు. ఓ యువతిని ఇంటర్వ్యూ చేస్తున్నారు. అకస్మాత్తుగా మరో యువతి గదిలోకి దూసుకొచ్చి..ఇంటర్వ్యూ ఇస్తున్న యువతిని ఛైర్ నుంచి కిందకు లాగేసి..దాడికి పాల్పడింది. ముష్టిఘాతాలు కురిపించింది. అక్కడున్న వారు ఆపేందుకు సాహసం చేయలేదు.

Read More : Jet Airways : మళ్లీ గాల్లో ఎగరనున్న జెట్ ఎయిర్ వేస్

దాడికి పాల్పడింది…అక్క కాగా..గాయాలపాలైన యువతి..చెల్లి కావడం గమనార్హం. దాడికి సంబంధించిన దృశ్యాలను ఓ వ్యక్తి వీడియో తీసి..సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దాడికి గల కారణం వివరించారు. చెల్లి..ఓ ఇంటర్వ్యూకు వెళ్లిందని తెలుసుకున్న అక్క..అక్కడకు వెళ్లింది. ఛైర్ లో ఇంటర్వ్యూ ఇస్తున్న చెల్లిని అమాంతం కిందకు లాగి పడేసింది. ఇక తన చేతులకు పని చెప్పింది. ముష్టిఘాతాలు కురిపించింది.

Read More : Building Collapse:ఢిల్లీలో కుప్ప‌కూలిన నాలుగు అంతస్తుల భ‌వ‌నం..శిథిలాల కింద ప్రాణాలు..!

ముఖంపై ఇష్టమొచ్చినట్లు గుద్దింది. దాడి నుంచి కాపాడుకొనేందుకు ఆ చెల్లి ప్రయత్నించింది. ఆమె ఆగ్రహం చూసి..కంపెనీ ప్రతినిధులు ఎవరూ ఆపలేకపోయారు. అక్కడనే ఉన్న ఓ వ్యక్తి మాత్రం..ఫోన్ లో రికార్డు చేశారు. Dallas ట్విట్టర్ వేదికగా పోస్టు చేయడంతో తెగ వైరల్ అయ్యింది. తన భర్తతో చెల్లి సంబంధం పెట్టుందని..అందుకే ఆఫీసుకు వచ్చి మరీ దాడి చేసిందని వెల్లడించాడు. నెటిజన్లు కొంతమంది ఫన్నీ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.