Apple : మొబైల్ డిస్‌ప్లే క్లీన్ చేసే ఈ వస్త్రం ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

తాజాగా ఆపిల్ తీసుకొచ్చిన మరో ప్రొడక్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కారణం దాని ధర. అవును, ఎలక్ట్రానిక్ డివైజస్ డిస్ ప్లే క్లీన్ చేసేందుకు ఆపిల్ ఓ పాలిషింగ్ క్లాత్ తీసుకొచ్చింది.

Apple : మొబైల్ డిస్‌ప్లే క్లీన్ చేసే ఈ వస్త్రం ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

Apple Cleaning Cloth

Apple Cloth : ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్ తీసుకొచ్చే ప్రొడక్ట్ లకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే ఆపిల్ నుంచి వచ్చే ప్రొడక్ట్ ఏదైనా చాలా యూనిక్‌గా ఉంటుంది. ఇక ధర కూడా అదే రేంజ్‌లో ఉంటుంది. ధర ఎక్కువైనా ఆపిల్ ప్రొడక్ట్స్ కొనేందుకు జనాలు ఎగబడతారనే విషయం తెలిసిందే. తాజాగా ఆపిల్ తీసుకొచ్చిన మరో ప్రొడక్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కారణం దాని ధర. అవును, ఎలక్ట్రానిక్ డివైజస్ డిస్ ప్లే క్లీన్ చేసేందుకు ఆపిల్ ఓ పాలిషింగ్ క్లాత్ తీసుకొచ్చింది. దాని ధర తెలిసి అంతా నోరెళ్లబెడుతున్నారు. ఇంతకీ దాని ధర ఎంతో చెప్పలేదు కదూ.. జస్ట్ రూ.1900.

ఆపిల్ లాంచ్‌ ఈవెంట్‌లో తన కొత్త మాక్ బుక్ ప్రోస్, ఎమ్1 ప్రో, మ్యాక్స్ చిప్స్, మూడవ తరం ఎయిర్ పాడ్స్‌తో పాటు అదనంగా ఈవెంట్ తర్వాత ఒక పాలిషింగ్ వస్త్రాన్ని విడుదల చేసింది. ఈ వస్త్రంతో ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను క్లీన్ చేసుకోవచ్చు.

Belly Fat : కూరగాయలతో పొట్ట కొవ్వును కరిగించండి..

రాపిడి రహిత మెటీరియల్స్‌తో తయారు చేసిన ఈ ఆపిల్ బ్రాండెడ్ క్లాత్ విడిగా పోర్టల్‌లో కొనుక్కోవచ్చు. దీనిపై ఆపిల్ లోగో స్టాంప్ కూడా ఉంది. సాధారణ మైక్రోఫైబర్ వస్త్రం కంటే ఇది ఏ విధంగా భిన్నం అనేది వాడే వారికి మాత్రమే తెలుస్తుంది. మీ ఆపిల్ ఉత్పత్తులను శుభ్రం చేసేటప్పుడు “మృదువైన లింట్-ఫ్రీ క్లాత్” ఉపయోగించాలని “రాపిడి బట్టలు, టవల్స్, పేపర్ టవల్స్ లేదా ఇలాంటి వస్తువులను”వాడుకూడదని ఆపిల్ సిఫార్సు చేస్తుంది.

ఎలక్ట్రానిక్ పరికరాలు వాడినప్పుడు వాటి డిస్ ప్లే పై దుమ్ము, ధూళి చేరుతుంది. మరకలు పడతాయి. ఇది కామన్. ఈ కారణంగా వాటిని క్రమం తప్పకుండా శుభ్రపరచడం అవసరం. మరి, వాటిని శుభ్రం చేసేందుదు ఏ ఉత్పత్తులు వాడాలి? వాటిని ఎలా సరిగ్గా చూసుకోవాలి? అనే దాని గురించి చాలా మందికి సరైన ఐడియా లేదు. ఈ విషయంలో ఆపిల్ ప్రత్యేక శ్రద్ధ చూపింది. గాడ్జెట్ల డిస్ ప్లేను శుభ్రపరిచే ప్రత్యేక వస్త్రాన్ని మార్కెట్ లోకి తెచ్చింది.

Black Pepper : బరువును తగ్గించే బ్లాక్ పెప్పర్ వాటర్

ఈ క్లాత్ ఫ్యాబ్రిక్ మృదువైన, రాపిడి చేయని మెటీరియల్‌తో తయారు చేయబడింది. “నానో-టెక్చర్డ్ గ్లాస్‌తో సహా ఏదైనా ఆపిల్ డిస్‌ప్లేను సురక్షితంగా మరియు సమర్థవంతంగా శుభ్రపరుస్తుంది” అని కంపెనీ అధికారిక స్టోర్ తెలిపింది. కుపెర్టినో ఆధారిత కంపెనీ ప్రో డిస్‌ప్లే XDR వినియోగదారులను డిస్‌ప్లేను శుభ్రం చేయడానికి మరియు ప్రత్యేక వస్త్రంతో మాత్రమే తుడిచివేయడానికి ఎలాంటి వస్త్రాన్ని ఉపయోగించవద్దని హెచ్చరించింది.

ఈ క్లాత్ తో ఏ పరికరాలు శుభ్రపరచ వచ్చో కూడా ఆపిల్ చెప్పింది. ఐఫోన్ 6, ఐఫోన్ ఎస్ ఈ రెండు జనరేషన్స్ ని ఈ నేప్‌కిన్‌తో శుభ్రం చేయవచ్చు. iPhone 6, iPhone 6 Plus మరియు iPhone SE లను శుభ్రం చేసుకోవచ్చు. ఐఫోన్ 5 ఎస్ వంటి పాత స్మార్ట్‌ఫోన్లు, యాక్సెసరీలకు ఈ క్లాస్ తగినది కాదు.