Black Pepper : బరువును తగ్గించే బ్లాక్ పెప్పర్ వాటర్

బ్లాక్ పెప్పర్ ఆయిల్‌ను తీసుకుని అందులోంచి ఒక చుక్క ఆయిల్‌ను ఒక గ్లాస్ నీటిలో కలిపి నిత్యం ఉదయాన్నే పరగడుపునే తాగినా శరీరంలోని కొవ్వు కరిగి అధిక బరువు తగ్గుతారు.అల్లం రసం, తులసి ఆకులు, దాల్చిన చెక్క పొడి, మిరియాల పొడి వేసి చేసిన గ్రీన్ టీ తాగితే అధిక బరువు త్వరగా తగ్గుతారు.

Black Pepper : బరువును తగ్గించే బ్లాక్ పెప్పర్ వాటర్

Black Pepper

Black Pepper : వంటి గదిలో పోపుల డబ్బాలో ఉండే మిరియాలు ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనాన్ని కలిగిస్తాయి. శరీరంలో రోగనిరోధక వ్యవస్ధను పటిష్టం చేయటంలో మిర్యాలు శక్తివంతగా పనిచేస్తాయి. ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో గ్లాసు గోరువెచ్చని నీళ్లలో చిటికెడు నల్ల మిరియాల పొడి కలిపి రోజూ తాగితే చాలు ఎన్నో ఆనారోగ్య సమస్యలను దూరంగా పెట్టవచ్చు. పెప్పర్ వాటర్‌ని కనీసం ఒక నెలపాటు తాగడం వలన అనేక ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చని ప్రముఖ ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

రోగనిరోధకతను పెంచడంతో పాటుగా బరువును తగ్గించటంలో బ్లాక్‌ పెప్పర్ వాటర్‌ బెస్ట్‌ అనే చెప్పాలి. బరువును అదుపులో ఉంచుతుంది. పూర్వకాలం నుండి నేటివరకు చాలా మంది ఉదయం పరగడుపున చిటికెడు నల్లమిరియాల పొడి కలిపిన నీరు తాగే అలవాటును కొనసాగిస్తున్నారు. దీని వెనుక ఆరోగ్య ప్రయోజనాలు బోలెడున్నాయి. జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా అధిక క్యాలరీలు ఖర్చు అయ్యేలా ప్రేరేపిస్తుంది. తరచుగా ఈ నీళ్లు తాగడం వల్ల కేవలం ఒక నెలరోజుల్లోనే మీ శరీర బరువులో వచ్చే మార్పును స్పష్టంగా తెలియజేస్తుంది.

వేడి నీరు, నల్ల మిరియాల పొడి మిశ్రమం గట్‌ హెల్త్‌కు ఎంతో మేలు చేస్తుంది. ఇది చర్మ కణాల పోషణకు తోడ్పడటం ద్వారా ఎ‍ల్లప్పుడూ హైడ్రేటెడ్‌ గా ఉండటానికి సహాయపడుతుంది. చర్మానికి సహజ మాయిశ్చరైజర్‌గా పనిచేయడమేకాకుండా, రోజు మొత్తం యాక్టివ్‌ గా ఉండేందుకు ఉపకరిస్తుంది. పెప్పర్‌ వాటర్‌ ప్రతిరోజూ ఖాళీ కడుపుతో తాగడం వల్ల జీవక్రియ బలం పుంజుకుని మీ శక్తి రెంట్టింపయ్యేటట్లు చేస్తుంది. అంతేకాకుండా మీ శరీరాన్ని డిటాక్సిఫై చేసి, చర్మం ప్రకాశవంతంగా మెరుస్తుంది.

దీర్ఘకాలికంగా మలబద్దకంతో బాధపడేవారు ఈ నీటిని ప్రతిరోజూ తప్పనిసరిగా తాగాలి. ఇది మీ ప్రేగు కదలికలను మెరుగుపరచి, ఆరోగ్యకరమైన జీర్ణక్రియకు దారితీసేలా చేస్తుంది. క్రమంగా మీ సమస్య తగ్గుముఖం పట్టి, శరీరం నుండి వ్యర్థాలను తొలగించి, కడుపును తేలిక పరుస్తుంది. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం, ఒక టీ స్పూన్ తేనె, ఒక టీస్పూన్ మిరియాల పొడిని కలిపి నిత్యం ఉదయాన్నే పరగడుపునే తాగితే అధిక బరువు తగ్గుతారు.

బ్లాక్ పెప్పర్ ఆయిల్‌ను తీసుకుని అందులోంచి ఒక చుక్క ఆయిల్‌ను ఒక గ్లాస్ నీటిలో కలిపి నిత్యం ఉదయాన్నే పరగడుపునే తాగినా శరీరంలోని కొవ్వు కరిగి అధిక బరువు తగ్గుతారు.అల్లం రసం, తులసి ఆకులు, దాల్చిన చెక్క పొడి, మిరియాల పొడి వేసి చేసిన గ్రీన్ టీ తాగితే అధిక బరువు త్వరగా తగ్గుతారు. అర కప్పు మోతాదులో పుచ్చకాయ, పైనాపిల్ జ్యూస్‌లను తీసుకుని వాటిలో ఒక టీస్పూన్ నిమ్మరసం, అర టీస్పూన్ మిరియాల పొడి, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలిపి ఆ మిశ్రమాన్నిప్రతిరోజు ఉదయాన్నే తాగితే అధిక బరువు తగ్గుతారు.

మిరియాల పొడి శరీర కణాలను పోషించి, వాటి నష్టాన్ని నివారిస్తుంది. ఫ్రీ రాడికల్స్‌ నుంచి, సీజనల్‌ వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది కూడా. పేగుల ఆరోగ్యం పైనే మన పూర్తి శరీర ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. మిరియాలు కలిపిన వేడి నీరు శరీరంలోని వ్యర్థాలను, రసాయనాలను పూర్తిగా బయటకు పంపివేస్తుంది. ఫలితంగా జీర్ణవ్యవస్థను మెరుగుపరచి, కడుపులోని పేగు సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది.