Astrazeneca: అంటార్కిటికాలో తొలిసారిగా కరోనా కేసులు..ఆస్ట్రాజెనెకా కరోనా వ్యాక్సిన్ పంపిన బ్రిటన్ సర్కార్

ఆస్ట్రాజెనెకా కరోనా వ్యాక్సిన్ మంచు ఖండమైన అంటార్కిటికా చేరుకుంది.చిలీకి చెందిన బృందంలో కొన్ని కోవిడ్ కేసులు వెలుగులోకొచ్చాయి. దీంతో బ్రిటన్ ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ను పంపించింది

Astrazeneca: అంటార్కిటికాలో తొలిసారిగా కరోనా కేసులు..ఆస్ట్రాజెనెకా కరోనా వ్యాక్సిన్ పంపిన బ్రిటన్ సర్కార్

Astrazeneca

Astrazeneca: ఆస్ట్రాజెనెకా కరోనా వ్యాక్సిన్ మంచు ఖండమైన అంటార్కిటికా చేరుకుంది. బ్రిటన్ కు చెందిన ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయంతో కలిసి ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన తొమ్మిది నెలల తరువాత ఈ వ్యాక్సిన్ అంటార్కిటికా మంగళవారం (అక్టోబర్ 5,2021) చేరుకుంది. పంచవ్యాప్తంగా వినియోగంలోకి వచ్చిన ఆస్ట్రాజెనెకా కరోనా వ్యాక్సిన్ ఎట్టకేలకు అంటార్కిటికా మంచుఖండానికి చేరింది. అంటార్కిటికాలో బ్రిటన్ కు చెందిన రోథెరా పరిశోధన కేంద్రం ఉంది. ధృవప్రాంతాల్లో శీతాకాలం పొడవునా ఈ పరిశోధన కేంద్రం కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ఇక్కడ నిరంతరం శ్రమిస్తున్న 23 మంది పరిశోధకులు..ఇతర సిబ్బందికి బ్రిటన్ ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్లు పంపించింది.

కాగా..అంటార్కిటికాలో అనేక దేశాలు పరిశోధనలు నిర్వహిస్తున్నాయి. చిలీకి చెందిన బృందంలో కొన్ని కోవిడ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. గతంలో ఇప్పటివరకు అంటార్కిటికా కోవిడ్ రహితంగా ఉంది. కాని కొన్ని రోజుల క్రితం చిలీ బృందంలో కోవిడ్ కేసులు బయటపడటంతో బ్రిజ్ నోర్టన్ నుంచి బ్రిటన్ కు చెందిన రాయల్ ఎయిర్ ఫోర్స్ (ఆర్ఏఎఫ్) వోయేజర్ విమానం 10 వేల మైళ్లు ప్రయాణించి రోథెరా పరిశోధకుల కోసం కరోనా వ్యాక్సిన్ తీసుకువచ్చింది.డోసులు చేరుకున్న వెంటనే అక్కడి పరిశోధకులు, ఇంజినీర్లు, సహాయక సిబ్బంది, ఇతర సిబ్బందికి వైద్యుల పర్యవేక్షణలో వ్యాక్సినేషన్ చేశారు. ఇది తొలి డోసు. మరో నాలుగు వారాల వ్యవధిలో వీరికి రెండో డోసు ఇవ్వనున్నారు.

కాగా..కరోనా మహమ్మారి పట్టి పీడించడం మొదలుపెట్టి దాదాపు రెండేళ్లు కావస్తోంది. వ్యాక్సిన్లు రాకపోతే ప్రజల పరిస్థితి ఎలా ఉండేదో ఊహించడానికే భయమేస్తోంది. ప్రపంచదేశాలకు ఊరట కలిగిస్తున్న ఈ కరోనా వ్యాక్సిన్లలో ఆస్ట్రాజెనెకా రూపొందించిన వ్యాక్సిన్ కూడా ఉంది. దీన్ని బ్రిటన్ కు చెందిన ఆక్స్ ఫర్డ్ వర్శిటీ పరిశోధకులు కలిసి ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్ గత 9 నెలలుగా వినియోగంలో ఉన్న విషయం తెలిసిందే.