Indo-Arab ఒప్పందాలు రద్దు కాబోతున్నాయా.. ప్రభుత్వం భారత ముస్లింలపై వివక్ష చూపిస్తుందా?

  • Published By: chvmurthy ,Published On : April 23, 2020 / 04:10 PM IST
Indo-Arab ఒప్పందాలు రద్దు కాబోతున్నాయా.. ప్రభుత్వం భారత ముస్లింలపై వివక్ష చూపిస్తుందా?

ఉద్దేశ్యపూర్వకంగానే భారత్-అరబ్ దేశాల మధ్య ఒప్పందాలను రద్ద చేయాలని చూస్తున్నారు. భారత్ లో COVID-19 పేరిట ముస్లింలపై వివక్ష చూపిస్తున్నారని గల్ఫ్ లో ఆరోపణలు గుప్పిస్తూ బంధాలను తెంచాలని చూస్తున్నారు. దీనిపై ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (OIC)ఇండియాలో ముస్లింలను టార్గెట్ చేస్తున్నారంటూ ఆరోపించారు. 

వారం క్రితం భారత సరిహద్దుల్లో ఉంటున్న పొరుగుదేశాలు విదేశీ పెట్టుబడులను తప్పకుండా క్లియరెన్స్ ఇవ్వాలని చెప్పింది. ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత భారత్ కు వచ్చే పెట్టుబడులన్నింటినీ చైనా తన వైపుకు మరల్చుకోవాలని ప్లాన్ చేసింది. 

భారత్ తీసుకొచ్చిన కొత్త విధానాన్ని చైనా విమర్శిస్తోంది. ఇది పూర్తిగా వివక్షత చూపించడమేనని పొరుగుదేశం పాలసీని సమీక్షించుకోవాలని కోరినా వెనక్కు తగ్గడం లేదని ఆరోపించింది. బుధవారం ట్రంప్.. అమెరికన్లు ఉద్యోగాల భద్రత కోసం సంతకం చేశారు. కరోనా మహమ్మారి కారణంగా దేశంలో ఏర్పడిన ఆర్థిక సంక్షోభం కారణంగా అక్కడి వారి ఉద్యోగాలు పోవని హామీ ఇచ్చారు. 

భారత్-అరబ్ దేశాల మధ్య సంబంధాలు చాలా పటిష్టమైనవని అవి రద్దు కావని అధికారులు అంటున్నారు. అయితే భారత్ లో విధించిన కొత్త పాలసీ కారణంగా ఎంత మంది భారతీయులపై ఈ ప్రభావం కనిపిస్తుందో స్పష్టత లేదు. అమెరికాలో శాశ్వత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకునే వాళ్లకు ట్రంప్ చేసిన సంతకం పెద్ద సమస్యే.