Beer Yoga : ‘బీర్ యోగా’ కొత్త ట్రెండ్‌పై మండిపడుతున్న భారతీయులు

బీర్ యోగా గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ ట్రెండ్ ప్రపంచ వ్యాప్తంగా జోరందుకుంది. వ్యసనపరులంతా తమ ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఈ రకంగా యోగా చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా భారతీయ సంప్రదాయాన్ని అపహాస్యం చేస్తున్నారంటూ ఇండియన్స్ మండిపడుతున్నారు.

Beer Yoga : ‘బీర్ యోగా’ కొత్త ట్రెండ్‌పై మండిపడుతున్న భారతీయులు

Beer Yoga

Beer Yoga : బీర్ బాటిల్ పట్టుకుని యోగా చేయడం ఏంటి? విచిత్రంగా అనిపిస్తోంది కదా. ప్రపంచంలో చాలాచోట్ల ఈ ట్రెండ్ నడుస్తోంది. 2016 లో ప్రారంభమైన బీర్ యోగా ఇప్పుడు అనేక దేశాలకు పాకింది. యోగా డే సందర్భంగా విదేశాల్లో కొందరు వ్యక్తులు చేస్తున్న బీర్ యోగా చూస్తే షాకవుతారు.

Laughing Yoga : లాఫింగ్ యోగా అంటే ఏమిటి? దీనిని ఎలా చెయ్యాలి?

ప్రపంచ వ్యాప్తంగా యోగాకి ఉన్న ప్రాముఖ్యత అందరికీ తెలిసిందే. మనం ఫిజికల్‌గా ఫిట్‌గా ఉండాలి అంటే మనసు ఉల్లాసంగా ఉండాలి. యోగాతో అన్ని రోగాలు నయమవుతాయని చెబుతారు. అయితే కొంతకాలంగా యోగాలో కొత్త ట్రెండ్ నడుస్తోంది. కొన్ని దేశాలు బీర్ యోగా పేరుతో కొత్త ట్రెండ్‌ని ఫాలో అవుతున్నాయి. ఈ కొత్త ట్రెండ్‌పై భారతీయులు మండిపడుతున్నారు. భారతీయ సంప్రదాయాన్ని అపహాస్యం చేస్తున్నారని అభిప్రాయపడుతున్నారు.

 

బీర్ యోగాను బెర్లిన్‌కి చెందిన ఇద్దరు యోగా శిక్షకులు ఎమిలీ, జూలా 2016 లో ప్రారంభించారట. దీనిని జనం ఇష్టపడటం మొదలు పెట్టారట. అలా మొదలైన బీర్ యోగా జర్మనీ నుంచి ఇతర దేశాలకు వేగంగా పాకింది. యూరప్, ఆసియా, ఆస్ట్రేలియాల నుంచి థాయ్ లాండ్, సింగపూర్, న్యూజిలాండ్ దేశాల్లో ఈ ట్రెండ్ ఊపందుకుంది. యోగా చేయాలంటే మనసు ఏకాగ్రతతో ఉండాలి. బీర్ యోగాకి సంబంధించిన నియమాలు పూర్తి విభిన్నంగా ఉంటాయి. కొత్తగా యోగా ప్రారంభించేవారు.. మైండ్ కంట్రోల్‌లో పెట్టుకోలేని వారు బీర్ యోగా చేయడానికి ఆసక్తి చూపుతారట. రెండు గ్లాసుల బీరు గొంతులోకి పోసుకుని యోగాసనాలు వేస్తారు. ఇలా చేయడం వల్ల శరీరం వేడెక్కడం..కండరాలు వదులుగా మారడం.. ఒత్తిడి తగ్గడం వంటి అనుభూతికి లోనవుతారట. ముఖ్యంగా బీరు వ్యసనపరులు తమ ఒత్తిడిని తగ్గించుకోవడం కోసం ఈ రకంగా యోగా చేస్తారని తెలుస్తోంది.

International Yoga Day 2023: ప్రపంచ ఉద్యమంగా యోగా మారింది..వీడియో ప్రసంగంలో మోదీ వ్యాఖ్యలు

నిజానికి యోగా చేసేటపుడు ఖాళీ కడుపుతో చేస్తారు. మనిషి ఆరోగ్యంగా చురుకుగా ఉండటానికి యోగా చేస్తే బీర్ యోగా మనిషిని డల్ చేస్తుంది. బీర్‌లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం.. విటమిన్ B, కాల్షియం, ఫాస్పేట్లు మరియు ఫైబర్ సరైన మోతాదులో ఉంటాయట. ఇవన్నీ యోగా చేయడంలో మంచి అనుభూతిని కలిగిస్తాయట. బీర్‌లో కరిగే ఫైబర్‌లు కొలెస్ట్రాల్ స్ధాయిని తగ్గించడంలో జీర్ణక్రియను మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయని చెబుతున్నారు. బీర్ యోగా వల్ల ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉండవు.. యోగాను జనాదరణ చేయడానికి ప్రజలను ఆకర్షించడానికి ఇది ఒక మార్కెటింగ్ జిమ్మక్కుగా అందరూ అభిప్రాయపడుతున్నారు.

 

డెన్మార్క్ రాజధాని కోపెన్ హాగన్‌లో రోడ్డు పక్కన కొందరు వ్యక్తులు యోగా చేస్తున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఇక్కడ యోగా చేసే ప్రతి ఒక్కరి చేతిలో బీర్ బాటిల్ ఉంది. ఈ వింత కాన్సెప్ట్ మాత్రం జనాల్ని ఆకర్షించింది. అయితే ఈ యోగాపై భారతీయులు మాత్రం చిరాకు పడుతున్నారు.