Biden Offer Kim : నార్త్ కొరియాకు బైడెన్ ఆఫర్.. కిమ్ నిజాయితీగా ఉంటే కలిసేందుకు రెడీ..!

Biden Offer Kim : ఉత్తర కొరియాలో కరోనావైరస్ విజృంభిస్తోంది. కరోనా కేసులను కట్టడి చేసేందుకు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్ ఉన్‌ కఠిన ఆంక్షలు విధించారు.

Biden Offer Kim : నార్త్ కొరియాకు బైడెన్ ఆఫర్.. కిమ్ నిజాయితీగా ఉంటే కలిసేందుకు రెడీ..!

Biden Offers Vaccines To Pyongyang, Receives No Response; Says Ready To Meet Kim If He’s ‘sincere’

Biden Offer Kim : ఉత్తర కొరియాలో కరోనావైరస్ విజృంభిస్తోంది. కరోనా కేసులను కట్టడి చేసేందుకు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్ ఉన్‌ కఠిన ఆంక్షలు విధించారు. కరోనా కేసులు పెరిగిపోతున్న క్రమంలో నార్త్ కొరియాకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆఫర్ ఇచ్చారు. దేశంలోని ప్యోంగ్యాంగ్‌తోపాటు చైనాకు కరోనా వ్యాక్సిన్‌లు అందజేస్తామని బైడెన్‌ ప్రకటించారు. ఇప్పటికప్పుడే వ్యాక్సిన్‌లు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని బైడెన్ స్పష్టం చేశారు. దీనిపై ఇప్పటివరకూ ఉత్తరకొరియా నుంచి ఎలాంటి స్పందన లేదు.

సియోల్‌లోని దక్షిణ కొరియా అధ్యక్షుడు యున్‌ సుక్‌ యోల్‌తో జరిగిన ఉమ్మడి సమావేశంలో బైడెన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బైడెన్ మాట్లాడుతూ.. ఈ వైరస్‌ని ఎదుర్కొవడంలో ఉత్తరకొరియాకి సాయం చేసేలా అంతర్జాతీయ సంస్థలతో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని బైడెన్ తెలిపారు.

Biden Offers Vaccines To Pyongyang, Receives No Response; Says Ready To Meet Kim If He’s ‘sincere’ (1)

Biden Offers Vaccines To Pyongyang, Receives No Response; Says Ready To Meet Kim If He’s ‘sincere

కిమ్‌ నిజాయితీగా ఉంటే ఆయన్ని కలిసేందుకు సిద్ధమని బైడెన్ స్పష్టం చేశారు. సైనిక విన్యాసాలను ముమ్మరం చేసిన నేపథ్యంలో కిమ్‌ ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. కిమ్, బైడెన్ పెట్టుబడులు పెట్టేందుకు పరస్పర అంగీకారం తెలిపారు. సెమీకండక్టర్, బ్యాటరీల వంటి పరిశ్రమల సరఫరా గొలుసులపై ఒప్పందాలు చేసుకున్నారు.

Read Also : US President Biden : కీవ్‌ నగరంలో పర్యటించనున్న అమెరికా అధ్యక్షుడు బైడెన్‌!?