Brazil: బ్రెజిల్‌లో కొండచరియలు విరిగిపడి ఏడుగురు మృతి

సరదాగా వాటర్ ఫాల్స్‌లో ఎంజాయ్ చేస్తున్న వారిపై కొండచరియలు విరిగిపడ్డాయి. అలా ఏడుగురు ప్రాణాలు కోల్పోగా తొమ్మిది మందికి తీవ్రంగా గాయాలయ్యాయి.

Brazil: బ్రెజిల్‌లో కొండచరియలు విరిగిపడి ఏడుగురు మృతి

Waterfalls

Brazil: సరదాగా వాటర్ ఫాల్స్‌లో ఎంజాయ్ చేస్తున్న వారిపై కొండచరియలు విరిగిపడ్డాయి. అలా ఏడుగురు ప్రాణాలు కోల్పోగా తొమ్మిది మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. మినాస్ గెరైస్ స్టేట్‌లో ఉన్న పాపులర్ డిస్టినేషన్ క్యాపిటోలియో కానియోన్స్ లో ఈ ఘటన జరిగింది.

మోటార్ బోట్ల సాయంతో వాటర్ ఫాల్ దగ్గరకు వెళ్లి వస్తుండగా ఒక్కసారిగా పర్వతంలోని కొంత భాగం నిలువుగా విరిగిపడింది. బోట్ డ్రైవర్ అలర్ట్ అయి ముందుకు కదిలే లోపే వారిపై పర్వతభాగం పడిపోయింది. 16మందిలో ఏడుగురు మృతి చెందారని, మరో తొమ్మిది గాయపడ్డారని తెలిసింది. ఇంకా ముగ్గురి ఆచూకీ తెలియాల్సి ఉంది.

గాయపడ్డ వారిని స్థానిక హాస్పిటల్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. చాలా మందికి ఎముకలు విరిగి హాస్పిటల్ లో సీరియస్ కండిషన్ లో ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. మరో 23మందికి తేలికపాటి గాయాలతో బయటపడ్డారు.

ఇది కూడా చదవండి: జకోవిచ్‌కు గత నెలలో కొవిడ్ వచ్చింది కాబట్టే..

దీనిపై బ్రెజిలియన్ నేవీ ఎంక్వైరీ చేపట్టనుంది. రెండు వారాలుగా వాటర్ ఫాల్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో శిలపై భాగం విరిగిపడింది.