నేనేమి చేశాను నేరం : సముద్రం చూస్తూ బెంచ్ మీద కూర్చున్న మహిళ అరెస్ట్

నేనేమి చేశాను నేరం : సముద్రం చూస్తూ బెంచ్ మీద కూర్చున్న మహిళ అరెస్ట్

Britain police arrested women sitting bench : బ్రిటన్ లో సముద్ర తీరంలో ఓ బెంచీ మీద కూర్చుని ఎగసిపడే కెరటాలను తదేకంగా చూస్తూ కూర్చున్న ఓ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రశాంతంగా కూర్చుని సముద్రాన్ని చూస్తున్న ఆమెను హఠాత్తుగా పోలీసులు అరెస్ట్ చేయటంతో ఆమె బిత్తరపోయింది. తానేమీ నేరం చేయలేదే..ఇలా అరెస్ట్ చేయటమేంటంటూ షాక్ అయ్యింది.

బ్రిటన్‌లో కరోనా స్ట్రెయిన్‌ కేసులు ఉధృతమవుతున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ను అధికారులు కఠినంగా అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో గత బుధవారం (జనవరి6,2021) కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది ప్రభుత్వం. దీంట్లో భాగంగా ఆ నిబంధనల్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. దీంతో పోలీసులు నింబంధనలను ఉల్లంఘించే వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. వినకపోతే ఫైన్‌ వేస్తున్నారు. అక్కడికి వినకపోతే ఏకంగా అరెస్ట్ చేసి లోపలేస్తున్నారు. దీంతో దేశ వ్యాప్తంగా అరెస్ట్ లు మొదలుపెట్టారు పోలీసులు.

ఈక్రమంలో శనివారం (జనవరి 10,2021) బౌర్న్‌మౌత్‌లో సముద్రం దగ్గర బెంచి మీద కూర్చున్న ఓ మహిళను నలుగురు పోలీసులు అరెస్ట్‌ చేశారు. దీంతో ఆమె బిత్తరపోయింది. నన్నెందుకు అరెస్ట్ చేస్తున్నారని ప్రశ్నించింది. ఏదో నేరం చేసినట్లుగా నలుగురు పోలీసులు వచ్చి అరెస్ట్ చేయటమేంటీ అంటూ ప్రశ్నించింది.

అంతేకాకుండా నిబంధనలు ఉల్లంఘించిన ఓ వ్యక్తికి 200 స్టెర్లింగ్‌ పౌండ్ల ఫైన్‌ వేశారు. ప్రీతీ పాటెల్‌ అనే మహిళను హెచ్చరించి ఇంటి దగ్గరకు తీసుకెళ్లి విడిచిపెట్టారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.