Japan interplanetary travel : ‘బుల్లెట్‌ ట్రైన్‌ లో’ భూమి నుంచి మార్స్ పైకి..వెళదామా..!!

జపాన్ మరో బుల్లెట్ ట్రైన్ రెడీ చేసేందుకు సిద్ధం అవుతోంది. ఇది ఓ నగరం నుంచి మరో నగరానికి కారదు ..ఏకంగా ఒక గ్రహం నుంచి మరొక గ్రహానికి.. భూమి నుంచి మార్స్‌కు.. అక్కడి నుంచి చందమామ మీదకు ఓ బుల్లెట్ ట్రైన్ పంపేందుకు.. జపాన్ ప్రణాళికలు రచిస్తోంది. ఇది ఇప్పుడు వాల్డ్‌వైడ్‌గా హాట్‌టాపిక్‌ గా మారింది.

Japan interplanetary travel : ‘బుల్లెట్‌ ట్రైన్‌ లో’ భూమి నుంచి మార్స్ పైకి..వెళదామా..!!

Japan Palning Interplanetary Travel..bullet Train To The Moon And Mars (1)

Bullet train to the moon and Mars : జపాన్ అంటే.. టక్కున గుర్తొచ్చేది బుల్లెట్ ట్రైన్. దీనికి శ్రీకారం పడిందే అక్కడి నుంచి. ఐతే ఇప్పుడు మరో బుల్లెట్ ట్రైన్ రెడీ చేసేందుకు ఆ దేశం సిద్ధం అవుతోంది. ఐతే అది మాత్రం ఒక ఊరి నుంచి మరొక ఊరికి కాదు.. ఒక గ్రహం నుంచి మరొక గ్రహానికి ! భూమి నుంచి మార్స్‌కు.. అక్కడి నుంచి చందమామ మీదకు ఓ బుల్లెట్ ట్రైన్ పంపేందుకు.. జపాన్ ప్రణాళికలు రచిస్తోంది. ఇది ఇప్పుడు వాల్డ్‌వైడ్‌గా హాట్‌టాపిక్‌ అవుతోంది.

ఆదిత్య 369 సినిమా గుర్తుందా ! టైమ్ మిషన్‌లో వెళ్తూ పక్క గ్రహాలను చూస్తూ మాట్లాడుకునే సీన్‌ కోట్లమందిని ఫిదా చేసింది. అలాంటి సీన్‌ నిజం చేసేందుకు ఇప్పుడు జపాన్ సైంటిస్టులు సిద్ధం అయ్యారు. ఓ బుల్లెట్‌ ట్రైన్‌ను తయారు చేయాలని అనుకుంటున్నారు. అంతరిక్షంలో భూమికి బయట ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు. మార్స్‌ మీదకు మకాం మార్చాలని కలలు కంటున్నారు. చందమామ అంతు తేల్చేందుకు సిద్ధం అవుతున్నారు. ఇలాంటి సమయంలో మార్స్‌ను, చందమామను ఒకేసారి చూసి వచ్చేలా.. జపాన్ ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా బుల్లెట్‌ ట్రైన్ డిజైన్ చేస్తోంది.

Also read : Bullet Train To Moon And Mars : బుల్లెట్ ట్రైన్‌తో పాటు చంద్రుడిపై కృత్రిమ నివాసం ఏర్పాటుకు జపాన్ ప్లాన్..!!

జపాన్ రూపొందించబోయే బుల్లెట్ ట్రైన్ అలాంటిది ఇలాంటిది కాదు. ఎర్త్‌ టు మార్స్ వయా చందమామ.. ఓ రౌండ్ వేసి రావొచ్చన్నమాట. ఆ బుల్లెట్‌ ట్రైన్‌లోకి ఎక్కితే.. చంద్రుడు, అంగారకుడిపైకి వెళ్లి రావచ్చట ! జపాన్‌ ప్రయత్నం ఇప్పుడు వాల్డ్‌వైడ్‌గా హాట్‌టాపిక్ అవుతోంది. ఏం చేస్తారు.. ఎలా చేస్తారు.. భూమ్మీద నుంచి స్పేస్‌లోకి ట్రైన్‌ ఎలా అని సోషల్‌ మీడియాలో భారీ చర్చ మొదలైంది. జపాన్ ఆలోచన ఇప్పుడు వాల్డ్‌వైడ్‌గా ట్రెండ్‌ అవుతోంది. ఆచరణలో సాధ్యం అవుతుందా లేదా అన్నది అనుమానంగానే ఉన్నా.. ఐడియా మాత్రం అదిరిపోయిందంటూ డిబేట్ నడుస్తోంది.

జపాన్‌లోని క్యోటో యూనివర్సిటీ, కాజిమా కన్‌స్ట్రక్షన్స్‌ సంయుక్తంగా.. ఈ బుల్లెట్ ట్రైన్‌ను డెవలప్‌ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇతర గ్రహాలపైకి టూర్ వెళ్లేందుకు ఉపయోగపడే ఈ బుల్లెట్ ట్రైన్‌కు హెక్సా ట్రాక్‌ అనే పేరు పెట్టారు. అంతరిక్ష వాతావరణంలోకి వెళ్లే వస్తువులు… అక్కడి ఉపరితలానికి భూమి తరహాలో గురుత్వాకర్షణ బలం లేకపోవడంతో గాల్లో తేలియాడుతుంటాయ్. సాంకేతిక పరిభాషలో దీన్నే జీరో గ్రావిటీ అంటారు. ఈ పరిమితిని అధిగమించేలా హెక్సా ట్రాక్ బుల్లెట్ ట్రైన్‌ను అభివృద్ధి చేస్తున్నారు. చంద్రుడిపై, అంగారకుడిపై ప్రయాణించే సమయంలో.. ఈ రైలు జీరో గ్రావిటీ ప్రభావానికి గురవకుండా.. 1 జీ గ్రావిటీ స్థాయిని ఉండేలా టెక్నాలజీని సిద్ధం చేస్తున్నారు.

Also Read :  CHINA Solar station in space : అంతరిక్షంలో సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటు కు చైనా ప్లాన్..2028కల్లా పక్కా అంటోన్న డ్రాగన్ దేశం

ఈ రైలు బోగీలు హెక్సా క్యాప్యూల్ అంటే.. షడ్భుజి ఆకారంలో ఉంటాయ్. తొలి విడతలో భాగంగా.. ఒకే ఒక బోగీతో ఉన్న బుల్లెట్ ట్రైన్‌ను చంద్రుడు, అంగారకుడిపైకి పంపాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ మినీ బుల్లెట్ ట్రైన్ బోగీ సైజు 15 మీటర్ల నుంచి 30 మీటర్ల రేడియస్‌తో ఉంటుంది. భూమి నుంచి చంద్రుడి పైకి వెళ్లేందుకు 15మీటర్ల రేడియస్ కలిగిన బుల్లెట్ ట్రైన్ బోగీ వాడుతారు. ఇక చంద్రుడి నుంచి అంగారకుడి పైకి వెళ్లే బుల్లెట్ ట్రైన్ బోగీ సైజు 30మీటర్ల రేడియస్‌తో ఉంటుంది. జర్మనీ, చైనా దేశాల్లో.. మాగ్లెవ్ బుల్లెట్ ట్రైన్‌లో ఎలక్ట్రో మ్యాగ్నటిక్ టెక్నాలజీ ఉపయోగిస్తారు. హెక్సా ట్రాక్‌ బుల్లెట్ ట్రైన్‌లోనూ దీన్నే వాడబోతున్నారని తెలుస్తోంది.

Also Read : CHINA Solar station in space : అంతరిక్షంలో సోలార్‌ ప్రాజెక్ట్‌ నిర్మించటం వెనుక చైనా లక్ష్యం ఏంటి ?

ఈ బుల్లెట్ రైల్‌లో ఎక్కేందుకు దిగేందుకు ఓ స్టేషన్ ఉండాలి కదా ! భూమి మీద అలాంటిదే ఏర్పాటు చేయబోతున్నారు. దానికి టెర్రా స్టేషన్ అని పేరు పెట్టబోతున్నారు. ఈ రైలులో వెళ్లే స్పేస్ టూరిస్టులకు, వ్యోమగాములకు భూమి తరహా ఫీలింగ్ కలిగించేందుకు.. కృత్రిమ గురుత్వాకర్షణ ఉండే ఏర్పాటు చేస్తారు. అంతరిక్షంలో చంద్రుడు, అంగారకుడి చలనంతో సెంట్రీ ఫ్యూజల్ శక్తి వెలువడుతుంది. దాన్ని సేకరించి కృత్రిమ గురుత్వాకర్షణను పుట్టించేలా హెక్సా ట్రాక్ బుల్లెట్ ట్రైన్‌లో టెక్నాలజీ ఉంటుందని తెలుస్తోంది. ట్రైన్ బోగీ లోపల షాంపెన్ ఫ్లూట్ ఆకారంలో లివింగ్ స్పేస్ ఉంటుంది. ఇందులో గార్డెన్, వాటర్ పూల్ ఉంటాయ్. ఐతే ఈ బుల్లెట్ ట్రైన్ అందుబాటులోకి రావడానికి మరో వందేళ్లు పట్టే అకాశాలు ఉన్నాయ్. ఐతే 2050 నాటికి ఈ ట్రైన్ బోగీల నమూనాలను విడుదల చేసే అవకాశం ఉంది.