Bullet Train To Moon And Mars : బుల్లెట్ ట్రైన్‌తో పాటు చంద్రుడిపై కృత్రిమ నివాసం ఏర్పాటుకు జపాన్ ప్లాన్..!!

భూమి నుంచి మార్స్‌కు, చంమామ మీదకు బుల్లెట్ ట్రైన్ లో వెళ్లే ఏర్పాటులో జపాన్ బిజి బిజీగా ఉంది. బుల్లెట్ ట్రైన్ మాత్రమే కాదు.. జపాన్ అంతకుమించి అంటోంది. చందమామ, అంగారకుడి మీద నివాసం ఏర్పాటు చేయబోతోంది.

Bullet Train To Moon And Mars : బుల్లెట్ ట్రైన్‌తో పాటు చంద్రుడిపై కృత్రిమ నివాసం ఏర్పాటుకు జపాన్ ప్లాన్..!!

japan planing Bullet train to the moon and Mars : భూమి నుంచి మార్స్‌కు, చంమామ మీదకు బుల్లెట్ ట్రైన్ లో వెళ్లే ఏర్పాటులో జపాన్ బిజి బిజీగా ఉంది. బుల్లెట్ ట్రైన్ మాత్రమే కాదు.. జపాన్ అంతకుమించి అంటోంది. చందమామ, అంగారకుడి మీద నివాసం ఏర్పాటు చేయబోతోంది. భూమిని పోలి ఉండే గ్రావిటీని క్రియేట్‌ చేయాలని భావిస్తోంది. దీని కోసం ఎలాంటి ప్రయత్నాలు చేయబోతోంది. అసలు జపాన్ ప్రయత్నాలు సక్సెస్ అయ్యే అవకాశం ఉందా..

చంద్రుడి మీదకు వెళ్లేందుకు అమెరికా ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇక అటు అంగారకుడిపై నీటి అన్వేషణలో చైనా ఫుల్‌ బిజీగా ఉంది. ఇలాంటి సమయంలో చంద్రునిపైకి బుల్లెట్ రైలును నడపడానికి జపాన్ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇది ఒక కృత్రిమ అంతరిక్ష నివాసంలా కూడా ఉండబోతోంది. జపాన్ ఆలోచన సక్సెస్ అయితే.. మరొక గ్రహానికి వెళ్లాలనే మనిషి కల సాకారం అవుతుంది. బుల్లెట్ ట్రైన్‌తో పాటు.. అంతరిక్షంలో ఒక అంతరిక్ష కేంద్రం, నివాసం నిర్మించేందుకు జపాన్‌ ప్లాన్ చేస్తోంది. చంద్రునిపై క్యాప్సూల్ నివాసం కూడా నిర్మించాలని ఫిక్స్ అయింది. గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉన్న చోట మనిషి ఎముకలు, కండరాలు వీక్ అవుతాయ్. ఐతే ఈ విషయాలన్నింటిని దృష్టిలో పెట్టుకొని జపాన్ ఆలోచనలు ఉండబోతున్నాయ్.

Also Read : Japan interplanetary travel : ‘బుల్లెట్‌ ట్రైన్‌ లో’ భూమి నుంచి మార్స్ పైకి..వెళదామా..!!

హాలీవుడ్‌ సినిమాల్లో మాత్రమే కనిపించే అద్భుతాలు.. జపాన్ ప్రయత్నాలతో రియల్‌గా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయ్. లూనార్ గ్లాస్‌ అని పిలిచే స్థలాన్ని చందమామ మీద నిర్మించాలని జపాన్‌ భావిస్తోంది. భూమి గురుత్వాకరణ శక్తిని.. అక్కడ కృత్రిమంగా క్రియేట్ చేస్తారు. లునార్ గ్లాస్‌.. ఒక పెద్ద కాలనీని పోలి ఉంటుంది. ఇందులో మనుషులు నివసించే అవకాశం ఉంటుంది. అందులో ఉన్నప్పుడు ఎవరూ ఎలాంటి స్పేస్ షూట్‌ ధరించాల్సిన అవసరం లేదు. అలాంటి పరిస్థితులను క్రియేట్‌ చేస్తారు. ఏ దేశం కూడా ఇలాంటి ప్రాజెక్ట్ ప్లాన్ చేయడం లేదని.. అంతరిక్ష చరిత్రలో కొత్త చరిత్ర సృష్టిస్తామని జపాన్ అంటోంది.

21వ శతాబ్దం నాటికి చంద్రుడు, అంగారకుడిపై మానవులు జీవించడం ప్రారంభిస్తారని జపాన్ సైంటిస్టులు భావిస్తున్నారు. అందులో భాగంగానే బుల్లెట్ ట్రైన్‌, లివింగ్‌ స్పేస్‌ ఆలోచన చేస్తున్నారు జపాన్ సైంటిస్టులు. చంద్రుడు, అంగారకుడిపై నిర్మించబోయే లూనార్ గ్లాస్‌ ఆకారం చూడ్డానికి శంఖువులా ఉంటుంది. ఇందులోనే మనుషులు నివసిస్తారు. ఈ భవనం దాదాపు 13వందల అడుగుల పొడవు ఉంటుంది. దీనికి కృత్రిమ గురుత్వాకర్షణ ఉంటుంది. మనుషులకు అవసరమైన వస్తువులన్నీ ఇందులో ఉంటాయ్. ఆహారపదార్థాల నుంచి మొక్కలు, నీరు, నదులు, పార్క్‌లు, నీటి వనరులు ఇక్కడే ఉంటాయి.

Also Read :  CHINA Solar station in space : అంతరిక్షంలో సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటు కు చైనా ప్లాన్..2028కల్లా పక్కా అంటోన్న డ్రాగన్ దేశం

లూనార్ గ్లాస్‌ నిర్మాణం చంద్రుడి మీద అయితే.. మార్స్‌ గ్లాస్ పేరుతో అంగారకుడి మీద అలాంటి నిర్మాణమే చేయబోతున్నారు. జపాన్‌ ప్రపంచవ్యాప్తంగా ఉత్సాహాన్ని నింపుతున్నా.. దీన్ని పూర్తి చేయడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. దీని కోసం చాలా కాలం వేచి చూడాల్సిందే ! ఇప్పటి నుండి పనులు ప్రారంభం అయితే.. అది పూర్తి కావడానికి శతాబ్దం పట్టే అవకాశం ఉంటుంది. అంటే ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యేనాటికి మనలో చాలా మంది బతికి ఉండే అవకాశాలు లేవని.. ఐతే 2050 నాటికి లూనా గ్లాస్‌, మార్స్‌ గ్లాస్‌ నమూనాలు తయారయ్యే చాన్స్ ఉందని జపాన్ సైంటిస్టులు అంటున్నారు. తమ అడుగు అంతరిక్ష రవాణాలో సరికొత్త చరిత్రకు నాంది పలుకుతుందని చెప్తున్నారు.

అంతరిక్షం అంతు తేల్చేందుకు.. వాల్డ్‌వైడ్‌గా సైంటిస్టుల పరిశోధనలు ఊపందుకున్నాయ్. నాసా పంపిన పర్సెవరెన్స్ వ్యోమనౌక.. ఇప్పుడికే మార్స్ మీద పని మొదలుపెట్టింది. శాంపిల్స్ పంపుతుతోంది. అంగారకుడి మీద ఒకటి.. చుట్టూ తిరుగుతూ ఒకటి.. చైనా, యూఏఈకి చెందిన వ్యోమనౌకలు కూడా పనులు మొదలుపెట్టేశాయ్. అన్నీ అనుకూలిస్తే.. భూమి మీద నుంచి మకాం మార్చే రోజులు కూడా దగ్గర్లోనే ఉన్నాయ్. ఇలాంటి సమయంలో జపాన్ మొదలుపెట్టిన ప్రయత్నం సక్సెస్ అయితే.. అంతరిక్ష ప్రయోగాల దశ దిశ మారిపోతాయనడంలో ఏ మాత్రం సందేహం లేదు.

Also Read : CHINA Solar station in space : అంతరిక్షంలో సోలార్‌ ప్రాజెక్ట్‌ నిర్మించటం వెనుక చైనా లక్ష్యం ఏంటి ?