Covishield Vaccine: కేంద్రానికి సీరం విన్నపం..4 దేశాలకు 50 లక్షల కొవిషీల్డ్‌ డోసులు ఎగుమతి..

నాలుగు దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్ అందించడానికి సీరం సంస్థ కేంద్రాన్ని అనుమతి కోరింది. దీనికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో.. 4 దేశాలకు 50 లక్షల కొవిషీల్డ్‌ డోసుల ఎగుమతి చేయనుంది

Covishield Vaccine: కేంద్రానికి సీరం విన్నపం..4 దేశాలకు 50 లక్షల కొవిషీల్డ్‌ డోసులు ఎగుమతి..

Govt Allows Serum To Export 50 Lakh Covishield Doses To Four Countrys

govt allows serum to export 50 lakh covishield doses to four countrys: కరోనాను కట్టడి చేయాలంటే వ్యాక్సిన్ ఒక్కటే ప్రధాన ఆయుధం. దీంతో కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తున్న వేళ ప్రపంచవ్యాప్తంగా పరిశోధకులు వ్యాక్సిన్ కనుగొనటంలో విశేష కృషి చేశారు. ఎట్టకేలకు వ్యాక్సిన్ వచ్చింది. కరోనా మహమ్మారిని కట్టడి చేయగలిగాం. ఎన్నో ప్రాణాల్ని కోల్పోయినా మహమ్మారిని కట్టడి చేయగలిగారు పరిశోధకుల కృషితో..కానీ వ్యాక్సిన్ ధనిక దేశాలతో పాటు పేద దేశాలకు కూడా అందాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పదే పదే ధనిక దేశాలకు సూచనలు చేసిన విషయం తెలిసిందే.

ఈక్రమంలో ఐక్యరాజ్యసమితి..వ్యాక్సిన్ అందని దేశాలకు సహాయం చేసేందుకు కోవాక్స్ గ్లోబల్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. వ్యాక్సిన్ అందని దేశాలకు బాసటగా నిలవాలనుకుంది. దీంట్లో భాగంగా వ్యాక్సిన్లను సేకరించి పేద దేశాలకు సహాయం చేయాలని ఈ కార్యక్రమాన్ని ఐక్య రాజ్యసమితి ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో భారత ఫార్మ దిగ్గజం సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. కోవిషీల్డ్ డోసుల్ని భారీగా స్టాక్ పెట్టుకుంది.వాటిని యూఎన్ కోవాక్స్ కార్యక్రమంలో భాగంగా పలు దేశాలకు డోసులను సాయం చేసేందుకు ముందుకొచ్చింది.

Read more : Indian Vaccine : ప్రపంచ దేశాలకు మరోసారి భారత వ్యాక్సిన్

 

ఈ మేరకు కోవాక్స్ గ్లోబల్ వ్యాక్సిన్ ప్రోగ్రామ్ కింద 50 లక్షల డోసుల కోవిడ్-19 వ్యాక్సిన్ కోవిషీల్డ్‌ను 4 దేశాలకు ఎగుమతి చేయడానికి సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వానికి విన్నవించింది. దీనికి కేంద్రం కూడా సానుకూలంగా స్పందించింది. ఎగుమతికి అనుమతినిచ్చింది. దీనిలో భాగంగా సీరం ఇనిస్టిట్యూట్ నేపాల్, తజికిస్తాన్, మొజాంబిక్‌, బంగ్లాదేశ్ కు వ్యాక్సిన్లను ఎగుమతి చేయనుంది.

ఈక్రమంలో పుణెకు చెందిన సీరం సంస్థ 24,89,15,000 డోస్‌ల స్టాక్‌ను తయారు చేసిందని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఐఐ)లోని ప్రభుత్వ నియంత్రణ వ్యవహారాల డైరెక్టర్ ప్రకాష్ కుమార్ సింగ్, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు ఇటీవల తెలిపారు. వాటిని వేగంగా పంపిణీ చేయాలని లేకపోతే..మా కంపెనీకి కోల్డ్ స్టోరేజ్..మానవ వనరుల పరమైన అవాంతరాలు (Human resource disruptions)ఎదురవుతాయని..కాబట్టి ఐక్యరాజ్యసమితి నేతృత్వంలోని ‘కోవ్యాక్స్‌’ కార్యక్రమంలో భాగంగా బంగ్లాదేశ్‌, నేపాల్‌, తజికిస్తాన్‌, మొజాంబిక్‌ దేశాలకు 50 లక్షల టీకా డోసుల ఎగుమతికి అనుమతి మంజూరు చేయాలని కోరింది. దీనికి కేంద్రం సానుకూలంగా స్పందించి ఎగుమతులకు అనుమతిచ్చిందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

Read more : Gifts Taj Mahal to wife : మరో షాజహాన్..భార్యకు తాజ్‌మహల్‌ కట్టి గిఫ్టు

కాగా.. భారత ప్రభుత్వం ‘వ్యాక్సిన్ మైత్రి’ కార్యక్రమం కింద నేపాల్, మయన్మార్, బంగ్లాదేశ్‌లకు 10 లక్షల చొప్పున కోవిషీల్డ్ డోస్‌లను ఎగుమతి చేయడానికి సీరం ఇనిస్టిట్యూట్ కు అనుమతిచ్చిన విషయం తెలిసిందే. ఇలా సీరం సంస్థ తమ వ్యాక్సిన్లను పంపిణీ చేయటంలో తనదైన శైలిలో కొనసాగుతోంది. తద్వారా కరోనా కట్టడిలో తనవంతు కృషి చేస్తోంది.