China: మా దేశంపై దాడి చేసేందుకు చైనా ఆర్మీకి 2025లోపు పూర్తి సామర్థ్యం: తైవాన్
చైనా తీరుపై తైవాన్ రక్షణ శాఖ మంత్రి చియు కువో-చాంగ్ ఆందోళన వ్యక్తం చేశారు. తైవాన్‌పై దాడి చేయగలిగే పూర్తి సామర్థ్యాన్ని చైనా ఆర్మీ 2025లోగా సంపాదించుకోగులుతుందని ఆయన చెప్పారు. తాజాగా, లాభాపేక్ష లేని సంస్థ ది డెమొక్రటిక్ ఫోరం (టీడీఎఫ్) నిర్వహించిన ఓ వర్చువల్ సెమినార్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు.. 40 ఏళ్ళలో ఎన్నడూ లేనంత ప్రమాదకరంగా మారాయని ఆయన తెలిపారు.
China: చైనా తీరుపై తైవాన్ రక్షణ శాఖ మంత్రి చియు కువో-చాంగ్ ఆందోళన వ్యక్తం చేశారు. తైవాన్‌పై దాడి చేయగలిగే పూర్తి సామర్థ్యాన్ని చైనా ఆర్మీ 2025లోగా సంపాదించుకోగులుతుందని ఆయన చెప్పారు. తాజాగా, లాభాపేక్ష లేని సంస్థ ది డెమొక్రటిక్ ఫోరం (టీడీఎఫ్) నిర్వహించిన ఓ వర్చువల్ సెమినార్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు 40 ఏళ్ళలో ఎన్నడూ లేనంత ప్రమాదకరంగా మారాయని ఆయన తెలిపారు. టీడీఎఫ్ అధ్యక్షుడు లార్డ్ బ్రూస్ కూడా చైనా తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. తైవాన్ తమ భూభాగమేనని చైనా వాదిస్తోన్న విషయం తెలిసిందే.
ఇటీవల పదేపదే కవ్వింపు చర్యలకు దిగుతోంది. తైవాన్ గగనతల రక్షణ వ్యవస్థలోకి యుద్ధ విమానాలను పంపి ఇటీవల చైనా మరోసారి దుందుడుకు చర్యలకు పాల్పడిన నేపథ్యంలో తైవాన్ రక్షణ శాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. చైనా చర్యలను వెంటనే గుర్తించి తిప్పికొట్టడానికి తైవాన్ వైమానిక దళం అనుక్షణం అప్రమత్తంగా ఉంటోంది. చైనా దాడి చేస్తే వెంటనే ప్రతి దాడి చేయాలని తైవాన్ భావిస్తోంది. ఇటీవల చైనా చర్యలను ఖండిస్తూ అమెరికా కూడా ఓ ప్రకటన చేసింది.