America VS China : తైవాన్ విషయంలో తలదూర్చొదంటూ..అన్‌ట్రేసబుల్ మిస్సైల్‌ తో అమెరికాకు చైనా వార్నింగ్..

అమెరికా చాలా కాలం తర్వాత.. అమెరికా-చైనా మధ్య తైవాన్ అంశం అగ్గి రాజేసింది. తైవాన్ విషయంలో.. అగ్రరాజ్యం, డ్రాగన్ మధ్య వివాదం ముదురుతోంది. ఇప్పటివరకు.. యూఎస్‌కు డైరెక్ట్ వార్నింగ్ ఇస్తూ వచ్చిన డ్రాగన్ కంట్రీ.. తాజాగా చేసిన మిస్సైల్ టెస్ట్‌తో.. ఇన్‌డైరెక్ట్‌గా మరో హెచ్చరిక పంపింది. అదెలాంటి క్షిపణో తెలిస్తే..షాక్ అవ్వాల్సిందే..

America VS China : తైవాన్ విషయంలో తలదూర్చొదంటూ..అన్‌ట్రేసబుల్ మిస్సైల్‌ తో అమెరికాకు చైనా వార్నింగ్..
ad

Taiwan dispute between America and China : అమెరికా చాలా కాలం తర్వాత.. అమెరికా-చైనా మధ్య తైవాన్ అంశం అగ్గి రాజేసింది. తైవాన్ విషయంలో.. అగ్రరాజ్యం, డ్రాగన్ మధ్య వివాదం మరింత ముదురుతోంది. ఇప్పటివరకు.. యూఎస్‌కు డైరెక్ట్ వార్నింగ్ ఇస్తూ వచ్చిన డ్రాగన్ కంట్రీ.. తాజాగా చేసిన మిస్సైల్ టెస్ట్‌తో.. ఇన్‌డైరెక్ట్‌గా మరో హెచ్చరిక పంపింది. అదెలాంటి క్షిపణో తెలిస్తే.. కచ్చితంగా అవాక్కవుతారు.

రష్యా-యుక్రెయిన్ యుద్ధంతో.. ప్రపంచం మొత్తం అతలాకుతలమవుతున్న తరుణంలో.. చైనా-అమెరికా మధ్య తలెత్తిన తైవాన్ వివాదం.. మరింత ఆందోళన రేపుతోంది. తైవాన్ విషయంలో.. అగ్రరాజ్యం జోక్యం తగదంటూ ఎప్పటికప్పుడు చైనా హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది. ఇంతలోనే.. చైనా తన 95వ ఆర్మీ డే వేడుకలకు ఒక్కరోజు ముందు చేసిన మిస్సైల్ టెస్ట్.. ఇప్పుడు వరల్డ్ వైడ్ హాట్ టాపిక్‌గా మారింది.

డ్రాగన్ కంట్రీ.. తొలిసారి అత్యంత ఘోరమైన మిస్సైల్ టెస్ట్ ఫుటేజీని రిలీజ్ చేసింది. చైనా నిపుణులు చెబుతున్న దాని ప్రకారం.. డీఎఫ్-17 బాలిస్టిక్ మిస్సైల్‌ని.. ఈ హైపర్ సోనిక్ మిస్సైల్ పోలి ఉంటుంది. పైగా.. ఇది అన్ ట్రేసబుల్. అంటే.. దీన్ని ప్రయోగించిన విషయం గానీ.. అది వెళుతున్న మార్గం గానీ.. దాని టార్గెట్ గానీ.. ఎవరికీ తెలియదు. బ్లాస్ట్ జరిగాక గానీ నష్టమేంటో అర్థం కాదు. అంతేకాదు.. దానిని అడ్డుకోవడం కూడా దాదాపు అసాధ్యమనే చెప్పాలి. ఇప్పుడీ.. అన్ ట్రేసబుల్ హైపర్ సోనిక్ మిస్సైల్ టెస్ట్‌కి సంబంధించిన ఫుటేజ్ మీదే.. ప్రపంచ దేశాల్లో చర్చ జరుగుతోంది. అయితే.. ఈ హైపర్‌సోనిక్ వెపన్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ కిల్లర్ ఫీచర్లను చైనా ఇంకా పూర్తిగా బయటకు చెప్పలేదు. కానీ.. దీనిని ఎప్పుడైనా, ఎక్కడైనా.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రయోగించే అవకాశముంది.

ఈ అన్‌ట్రేసబుల్ మిస్సైల్‌ని ఒక్కసారి లాంచ్ చేస్తే.. అది అటు నుంచి దూసుకొస్తుందో కూడా పసిగట్టడం చాలా కష్టం. ఒక్కసారి టార్గెట్ ఫిక్స్ చేసి.. బటన్ నొక్కితే.. ఏ వైపు నుంచి వస్తుందో.. ఎంత సేపట్లో టార్గెట్ ఫినిష్ చేస్తుందో.. అస్సలు కనిపెట్టలేం. మిస్సైల్ వచ్చి మీద పడే దాకా గుర్తించడం అసాధ్యమని చెబుతున్నారు. అయితే.. తైవాన్ విషయంలో.. అమెరికా, చైనా మధ్య మాటల యుద్ధం నడుస్తున్న సమయంలో.. డ్రాగన్ కంట్రీ ఈ మిస్సైల్ ప్రయోగం చేయడం.. హాట్ టాపిక్‌గా మారింది. ఒక రకంగా చెప్పాలంటే.. ఇది యూఎస్‌కు.. చైనా ఇచ్చిన వార్నింగ్ అనే చెప్పాలి.

తాజాగా.. తైవాన్‌లో అమెరికా సెనేట్ స్పీకర్ నాన్సీ పెలోసీ పర్యటిస్తారనే వార్తల పైనా చైనా తీవ్రంగా స్పందించింది. పెలోసీ గనక తైవాన్‌లో అడుగుపెడితే.. తమ మిలటరీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించింది. తైవాన్.. తమ అంతర్గతమని చైనా విదేశాంగ మంత్రి స్పష్టం చేశారు. అయితే.. నాన్సీ పెలోసీ ఆసియా టూర్‌కు సంబంధించి.. కీలక విషయం బయటపడింది. తన పర్యటనలో.. ఆసియాలోని సింగపూర్, మలేషియా, సౌత్ కొరియా, జపాన్‌లో.. ఆమె పర్యటించనున్నారు. సింగపూర్‌ నుంచి ఆవిడ తన ఆసియా టూర్ ప్రారంభించారు. తైవాన్‌లో పర్యటనకు సంబంధించి.. చైనా నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న తరుణంలో.. ఆమె టూర్‌లో తైవాన్‌కు సంబంధించిన ప్రస్తావన కనిపించలేదు. దీంతో.. పెలోసీ.. అక్కడికి వెళతారా? లేక.. ఈ నాలుగు దేశాల్లోనే పర్యటించి.. తిరిగి అమెరికాకు వెళ్లిపోతారా? అన్నది ఆసక్తిగా మారింది.

ఇప్పటికే.. తైవాన్‌ విషయంలో జోక్యం చేసుకుంటే.. అది నిప్పుతో చెలగాటమే అవుతుందని బైడెన్‌ను.. హెచ్చరించారు చైనా ప్రెసిడెంట్ జిన్‌పింగ్‌. అయితే, బైడెన్‌ మాత్రం తగ్గేదేలే అంటూ.. తమ విధానం ఇంతేనని తెగేసి చెప్పేశారు. దీంతో.. తైవాన్ ఇష్యూ అమెరికా-చైనా సంబంధాలపై మరింత ప్రభావం చూపింది. బైడెన్- జిన్ పింగ్ మధ్య రెండున్నర గంటల పాటు సాగిన టెలిఫోన్ కాన్ఫరెన్స్‌లో .. ఇద్దరు అగ్ర నేతలు.. పరస్పరం హెచ్చరికలు జారీ చేసుకున్నారు. దీంతో.. మున్ముందు పరిస్థితులు ఎలా ఉంటాయోనని ఆసియా దేశాల్లో ఆందోళనైతే నెలకొంది.