పెళ్లిలో పుట్టుమచ్చ షాక్ : కూతురే కోడలు కాబోతుందని తెలిసింది..కానీ పెళ్లి ఆగలేదు..!!

పెళ్లిలో పుట్టుమచ్చ షాక్  : కూతురే కోడలు కాబోతుందని తెలిసింది..కానీ పెళ్లి ఆగలేదు..!!

Twist at the wedding : చైనాలో జరుగుతున్న ఓ పెళ్లిలో ఎవ్వరూ ఊహించని ట్విస్టు చోటుచేసుకుంది. ఆ పెళ్లిలో వధూ వరులు గతంలోనే ప్రేమించినవారు వచ్చి ‘ఆపండీ’ అని అరవలేదు. కానీ పెళ్లి తంతులో మాత్రం ఊహించిన ట్విస్టు చోటుచేసుకుంది. వధూ వరులిద్దరూ ఉంగరాలు మార్చుకోబోతున్న క్రమంలో పెళ్లి కూతురు చేతిమీద ఉన్న పుట్టుమచ్చను చూసిన వరుడి తల్లి షాక్ అయ్యింది.

ఎంతో సంబరంగా కొడుకు పెళ్లి జరుగుతుంటే అప్పటి వరకూ సంతోషంతో పొంగిపోతున్న ఆ తల్లి వధువు చేతిమీద పుట్టుమచ్చని చూసి ఆమె గుండెల్లో గుబులు మొదలైంది. నోట మాట రాలేదు. తాను చూసేది కలా నిజమా? అనే సందిగ్థంలో పడిపోయింది. అందరూ సంతోషంగా ఉన్న సమయంలో ఆమెకు వచ్చిన పెద్ద అనుమానమే నిజమైంది..! అదేమంటే..తనకు కాబోయే కోడలు తనకు కూతురే అనే విషయం తెలిసిన ఆ తల్లి ఏంచేస్తుంది?…నోట మాట రాలేదు..వధువు వరుడికి చెల్లి అవుతుందని తెలిసింది..!!

తాము అన్నాచెళ్లెళ్లమన్న విషయం అప్పటివరకూ ఆ వధూవరులకు తెలియదు. ఉంగరాలు మార్చుకోబుతుండగా తెలిసిన ఆ దిగ్ర్భాంతికర ఘటనతో ఏం చేయాలో పాలు పోలేదు. కానీ ఇంత జరినా..అంత పచ్చి నిజం తెలిసినా పెళ్లి మాత్రం ఆగలేదు. అదే ట్విస్టు..టీవీ సిరియళ్లను మించిపోయే ట్విస్టులున్న ఈ వైరల్ వివాహం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

చైనాలో జియాంగ్జూ ప్రావిన్సులో సుజో ప్రాంతంలో మార్చి 31,2021న ఓ వివాహం జరిగింది. వివాహ వేడుకకు పెద్ద ఎత్తున బంధువులు, స్నేహితులు హాజరయ్యారు. వివాహం జరుగుతున్న సమయంలో వరుడి తల్లి కాబోయే కోడలి చేయిపై ఓ పుట్టుమచ్చను గమనించింది. అంతే, ఆమె గుండె పట్టు తప్పింది. ఓ వైపు..సంతోషం, మరో వైపు అనుమానం..విచారం..! అసలు తను చూస్తున్నది నిజమేనా..? చిన్నప్పుడు ఎప్పుడో తప్పిపోయిన కూతరినే తన కొడుకు వివాహం చేసుకోబోతున్నాడా..విధి అంటే ఇదేనా?వరుడి తల్లి మనసులో ఏన్నెన్నో ప్రశ్నలు. మరోవైపు.. ఉంగరాలు మార్చుకునే సమయం దగ్గరపడుతోంది. దీంతో..వరుడి తల్లి కాస్త ధైర్యం చేసి వధువు తల్లిదండ్రులను ప్రశ్నింది..

‘ఈమె మీ సొంతకూతురా లేక పెంచుకున్న కూతురా..?’ అని..దానికి వధువు తల్లిదండ్రులు అంతకంటే ఎక్కువే షాక్ అయ్యారు. ఏం చెప్పాలో తెలియలేదు. ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. కానీ వరుడి తల్లి పదే పదే గుచ్చి గుచ్చి అడుగుతుంటే ఇంతకాలంలో ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్న రహస్యాన్ని బైటపెట్టకతప్పలేదు. కూతురికి కూడా చెప్పని విషయాన్ని వియ్యపురాలికి చెప్పారు. తాము పెంచుకున్న అమ్మాయి అని..!!

వారీ పరిస్థితి ఇలా ఉంటే..మరోవైపు.. తమ జీవితాలకు సంబంధించి తమకే తెలియని రహస్యాలు బయటపడుతుండడంతో పెళ్లికొడుకు, పెళ్లి కూతురికి నోట మాట రాలేదు. ఎట్టకేలకు..వధువు తల్లి అసలు విషయాన్ని చెప్పేసింది. ఆమె తమ కడుపున పుట్టిన కూతరు కాదని..ఎక్కడో దొరికితే ఇంటికి తెచ్చుకుని తమ కూతురిలా పెంచుకుంటున్నామని. దీంతో పెళ్లికొచ్చినవారంతా ఆశ్చర్యపోయారు. సినిమాల్లోలాంటి ఈ షాకింగ్ న్యూసులేంటీ అంటూ..

ఈ విషయం విన్న వెంటనే పెళ్లి కూతురు తన కన్నతల్లి ఇన్నాళ్లకు దొరికినందుకు తీవ్ర భావోద్వేగంతో కన్నీటి పర్యంతమైంది. చిన్నప్పుడే దూరమైన తల్లి మళ్లీ తనకు కనిపించినందుకు ఆమెలో సంతోషం ఉవ్వెత్తున ఎగసిపడింది. మరోవైపు.. పెళ్లి ఆగిపోయే పరిస్థితి. ఆమె మనసులో సంశయాన్ని వరుడి తల్లి (వధువుకు కూడా తల్లే) పసిగట్టింది. తప్పిపోయిన కూతురి కోసం ఎంత వెతికినా దొరకలేదు. దీంతో తాము ఓ మగపిల్లాడిని పెంచుకున్నామని చెప్పింది. వధూవరులు తోడబుట్టిన వారు కాకపోవడంతో ఈ పెళ్లికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదని అసలు విషయాన్ని విడమర్చి అందరికీ అర్థమయ్యేలా చేసింది.

అలా ట్విస్టుల మీద ట్విస్టులతో జరిగిన ఈ తతంగం ఆఖరికి శుభం కార్డు పడింది. వధువు కన్నకూతురే అయినా..వరుడు మాత్రం తమకు పుట్టినవాడు కాదనీ..పెంచుకున్నవాడే కాబట్టి వారిద్దరూ అన్నచెల్లెళ్లు కాదు కాబట్టి అందరూ దగ్గరుండి అనుకున్న సమయానికే వివాహం జరిపించారు. దీంతో..వధూవరులిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అలా ఆ ట్విస్టుల పెళ్లికి శుభం కార్డు పడింది..