China’s Area 51 : నిఘా కళ్లకు కనబడని చైనా రహస్య మిలటరీ స్థావరం!

చైనా తన సొంత ఏరియా-51ని నిర్మిస్తోంది.

China’s Area 51 : నిఘా కళ్లకు కనబడని చైనా రహస్య మిలటరీ స్థావరం!

China (1)

China’s Area 51 చైనా తన సొంత ఏరియా-51ని నిర్మిస్తోంది. తన శత్రువుల రహస్య కళ్లకి కనిపించకుండా అధునాత మిలటరీ ఎయిర్ క్రాఫ్ట్ లను టెస్ట్ చేసేందుకు రహస్య స్థారవం(ఏరియా-51)ని చైనా నిర్మిస్తోన్నట్లు NPR(ఇండిపెండెంట్, నాన్ ఫ్రాఫిట్ మీడియా ఆర్గనైజేషన్)తెలిపింది. NPR తెలిపిన వివరాల ప్రకారం..పశ్చిమ చైనాలోని ఓ మారుమూల ప్రాంతంలో.. 2020లో చైనా అంతరిక్ష నౌక ల్యాండ్ అయినట్లుగా చెప్పబడుతున్న ప్రదేశంలో రన్ వేకి దగ్గర్లో పెద్ద సంఖ్యలో బిల్డింగ్ లను చైనా నిర్మిస్తున్నట్లు తాజా శాటిలైట్ ఫొటోలు తెలియజేస్తున్నాయి. చైనా తన రహస్య అంతరిక్ష ప్రయోగాలకు కూడా ఈ ప్రాంతానే ఉపయోగిస్తున్నట్లు సమాచారం.

అసలు ఈ ఏరియా-51 అంటే ఏంటి?
ఏరియా-51 అనేది అమెరికాలోని లాస్ ఏంజెల్స్ కి 135 కిలోమీటర్ల దూరంలోని నెవెడా ఎడారిలో ఉన్న ప్రదేశం. దశాబ్దాలుగా అమెరికా..తన అధునాతన ఎయిర్ క్రాష్ట్ లను అభివృద్ధి చేయడానికి మరియు పరీక్షించడానికి ఈ రహస్య ప్రాంతాన్ని ఉపయోగిస్తోంది. ఏరియా-51…రెండు ఇతర మిలటరీ ఏరియాలు(నెవెడా టెస్ట్ సైట్,నెవెడా టెస్ట్స్ మరియు ట్రైనింగ్ రేంజ్)లకి చాలా దగ్గర్లో ఉంది. ఈ ప్రాంతం మీదుగా పౌర విమానాలు ఎగురడం నిషిద్ధం. ఇటీవల విడుదలైన శాటిలైజ్ ఫొటోలు..ఈ రహస్య స్థావరంలో 3.7 కిలోమీటర్ల పొడవైన రన్ వేలు ఉన్నట్లు తెలియజేస్తున్నాయి.

1953-1961 వరకు అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన ఐసెన్హోవర్.. కోల్డ్ వార్ సమయంలో ప్రాజెక్ట్ ఆక్వాటోన్ పేరుతో అధిక ఎత్తులో నిఘా కళ్లకు కనిపించకుండా ప్రయాణించగల శక్తిసామర్థాలుండే ఓ ఎయిర్ క్రాఫ్ట్ ని అభివృద్ధి చేసేందుకు అనుమతిచ్చారు. ఏరియా-51లో ఏళ్లుగా.. U-2,SR-71 బ్లాక్ బర్డ్ వంటి నిఘా విమానాలను అమెరికా అభివృద్ధి చేసింది. అసలు ఏరియా-51 అనేది ఒకటి ఉనికిలో ఉందని ఒప్పుకోవడానికి అమెరికా సెంట్రల్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీ(CIA)కి దశాబ్దాల కాలం పట్టింది. 1947లో న్యూ మెక్సికోలోని రోజ్ వెల్ వద్ద కూలిపోయిన ఓ ఏలియన్ అంతరిక్షనౌక మరియు అందులోని పైలట్లను ఏరియా-51లో దాచి ఉంచడ్డారనే పుకార్లు కూడా ఉన్నాయి.