Henan Mine : ఒక్కో ఉద్యోగికి బోనస్‌‌గా రూ.6 కోట్లు..! కరెన్సీ కట్టల్ని మోసుకెళ్లటానికి ఉద్యోగుల పాట్లు..!!

ప్రపంచ వ్యాప్తంగా పలు దిగ్గజ కంపెనీలు ఆర్థిక మాంద్యం తెచ్చిన కష్టాలతో ఆర్థిక భారం తగ్గించుకోవటానికి వేలాదిమంది ఉద్యోగుల్ని తీసేస్తున్నాయి. కానీ కరోనాను ప్రపంచానికి పరిచయం చేసిన చైనాలోని ఓ కంపెనీ మాత్రం ఒక్క ఉద్యోగిని అంటే ఒక్క ఉద్యోగిని కూడా తీసేయలేదు. పైగా 30మంది ఉద్యోగులకు ఊహించనంత బోనస్ ఇచ్చింది. ఒక్కో ఉద్యోగికి ఐదు మిలియన్‌ యువాన్లు అంటే భారత కరెన్సీలో రూ.6 కోట్లు బోనస్ గా ఇచ్చింది. ఆ బోనస్ ను ఏకంగా కరెన్సీ రూపంలో ఇచ్చేసరికి కరెన్సీ కట్టల్ని మోసుకెళ్లటానికి సదరు ఉద్యోగులు పడిన పాట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Henan Mine : ఒక్కో ఉద్యోగికి బోనస్‌‌గా రూ.6 కోట్లు..! కరెన్సీ కట్టల్ని మోసుకెళ్లటానికి ఉద్యోగుల పాట్లు..!!

chinese firm ‘Henan mine’ Company gives employees hefty bonuses

Henan Mine : ప్రపంచ వ్యాప్తంగా పలు దిగ్గజ కంపెనీలు ఆర్థిక మాంద్యం తెచ్చిన కష్టాలతో ఆర్థిక భారం తగ్గించుకోవటానికి వేలాదిమంది ఉద్యోగుల్ని తీసేస్తున్నాయి. కానీ కరోనాను ప్రపంచానికి పరిచయం చేసిన చైనాలోని ఓ కంపెనీ మాత్రం ఒక్క ఉద్యోగిని అంటే ఒక్క ఉద్యోగిని కూడా తీసేయలేదు. పైగా 30మంది ఉద్యోగులకు ఊహించనంత బోనస్ ఇచ్చింది. ఒక్కో ఉద్యోగికి ఐదు మిలియన్‌ యువాన్లు అంటే భారత కరెన్సీలో రూ.6 కోట్లు బోనస్ గా ఇచ్చింది. ఆ బోనస్ ను ఏకంగా కరెన్సీ రూపంలో ఇచ్చేసరికి కరెన్సీ కట్టల్ని మోసుకెళ్లటానికి సదరు ఉద్యోగులు పడిన పాట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను చూసిన ఉద్యోగులు ఏమా కంపెనీ మామూలుగా లేదుగా బోనస్ ల బొనాంజా అంటున్నారు.

క్రేన్లను ఉత్పత్తి చేసే చైనాకు చెందిన హెనాన్‌ మైన్‌ (Henan Mine) అనే కంపెనీ తమ ఉద్యోగులకు భారీగా బోనస్సులు ప్రకటించింది. అంతేకాదు ఆ బోనస్ ను కరెన్సీ కట్టల రూపంలో ఇచ్చింది. ఆ భారీగా కట్టల రూపంలో పేర్చింది. ప్రకటించిన బోనస్ ను ఉద్యోగుల వారి బ్యాంక్ ఎకౌంట్స్ లో జమ చేయకుండా ప్రత్యేకంగా కరెన్సీ కట్టల రూపంలో ఇచ్చింది. ఈ ప్రక్రియను పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించి నగదును కట్టకట్టలుగా వేదికపై పేర్చి మరీ అందించింది. దీంతో కంపెనీ అందించే బోనస్‌ మొత్తాన్ని చేతులతో తీసుకెళ్లలేక సదరు ఉద్యోగులు బ్యాగులు తెచ్చుకోవడం స్టేజీపైకి ఉద్యోగుల్ని పిలిచి కట్టలుగా ఇవ్వటంతో ఆ కరెన్సీ కట్టల్ని పట్టుకెళ్లటానికి ఉద్యోగులు నానా పాట్లు పడ్డారు. ఓ పక్క ఆనందం..మరోపక్క ఉద్వేగంతో కట్టల్ని మోసుకుంటూ స్టేజీ దిగిన ఫోటోలు సోషల్ మీడియాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. కరెన్సీ కట్టల్ని పట్టుకెళ్లటానికి ఉద్యోగులు బ్యాగులు తెచ్చుకున్నారు.

Huge Bonus to Employees: లక్కంటే వీళ్లదే..! ఉద్యోగులకు 50నెలల బోనస్ ప్రకటించిన తైవాన్ సంస్థ ..

కరోనా కారణంగా పలు కంపెనీలు భారీ నష్టాల్లో కూరుకుపోయినా హెనాన్‌ మైన్‌ (Henan Mine) కంపెనీ మాత్రం భారీ లాభాలు ఆర్జించింది. దీంతో ఈ లాభాలకు కారణమైన ఉద్యోగులకు బోనస్ ఇవ్వాలని నిర్ణయించి ఇలా వినూత్నంగా కరెన్సీ కట్టల రూపంలో అందజేసింది. కంపెనీ సేల్స్‌ విభాగంలో మంచి పనితీరు కనబరిచిన 30 మందికి పైగా ఉద్యోగులకు 61 మిలియన్‌ యువాన్లు భారత కరెన్సీలో సుమారు రూ. 73 కోట్లు బోనస్‌గా ప్రకటించింది.

ఉద్యోగులకు ఇచ్చే బోనస్ ను అందజేయటానికి వినూత్నంగా కరెన్సీ రూపంలోనే అందజేయాలనుకుంది. రూ. 73 కోట్ల మొత్తాన్ని నోట్ల కట్టల రూపంలో స్టేజ్‌పై పేర్చింది. అంత భారీగా కరెన్సీ కట్టలు కనిపించేసరికి ఎవ్వరికైనా ఆనందం కలుగుతుంది. అలా ఉద్యోగులు కూడా తెగ ఆనందపడిపోయారు. ఉద్వేగానికి గురి అయ్యారు. ఆ ఉద్వేగంలోనే కంపెనీ ప్రతినిథులు ఒక్కో పేరు పిలుస్తుంటే ఆనందంగా స్టేజీపైకి వెళ్లి తమకు వచ్చిన బోనస్ కరెన్సీ కట్టల్ని తీసుకుని వచ్చారు. ఆ కట్టల బరువును ఆనందంగా మోసుకుంటూ వెలిగిపోతున్న ముఖాలతో స్టేజీ దిగారు. మోయటానికి వారు ఆనం తర్వాత ఉద్యోగుల్లో అత్యుత్తమైన పనితీరు కనబరిచిన ముగ్గురు ఉద్యోగులకు ఒక్కో ఉద్యోగికి ఐదు మిలియన్‌ యువాన్లు (సుమారు రూ.6 కోట్లు) చొప్పున అందించింది. మిగిలిన వారికి ఒక్కోక్కరికి ఒక్కో మిలియన్‌ యువాన్లు అంటే సుమారు రూ.1.20 కోట్లు బోనస్‌గా అందజేసింది. దీంతో కంపెనీ అందించిన నోట్ల కట్టలను ఉద్యోగులు చేతులతో తీసుకెళుతున్న వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

Bonus for Fit People: ఫిట్‌‌గా ఉండే ఉద్యోగులకు నెల జీతం బోనస్‌