Huge Bonus to Employees: లక్కంటే వీళ్లదే..! ఉద్యోగులకు 50నెలల బోనస్ ప్రకటించిన తైవాన్ సంస్థ ..

తైవాన్‌కు చెందిన ట్రాన్స్‌పోర్టేషన్, షిప్పింగ్ కంపెనీ ఎవర్‌గ్రీన్ మెరైన్ కార్పొరేషన్ ఉద్యోగులకు భారీ బోనస్ ప్రకటించింది. జీతంతో సమానంగా 50 నెలల బోనస్ ప్రకటించింది. ఎవర్‌గ్రీన్ మెరైన్ కార్పొరేషన్ ప్రపంచ వ్యాప్తంగా సుపరిచితమైన సంస్థ. 2021 సంవత్సరం ప్రారంభంలో సరుకు రవాణా సమయంలో ఈజిప్టులోని సూయిజ్ కాలువలో ఇరుక్కుపోయింది ఈ సంస్థకు చెందిన నౌకనే.

Huge Bonus to Employees: లక్కంటే వీళ్లదే..! ఉద్యోగులకు 50నెలల బోనస్ ప్రకటించిన తైవాన్ సంస్థ ..

Evergreen Employees

Huge Bonus to Employees: ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాద్యంతో పలు రంగాలకు చెందిన బడా కంపెనీలు తమ సంస్థలోని ఉద్యోగులను తొలగిస్తున్నాయి. అన్ని రంగాల్లో ఉద్యోగుల్లోనూ ఉద్యోగ భద్రత కరువైంది. ఇలాంటి పరిస్థితుల్లో తైవాన్‌కు చెందిన ఓ సంస్థ తమ ఉద్యోగులకు బోనస్ ప్రకటించింది. బోనస్ అంటే రెండు, మూడు నెలలకు కాదు.. ఏకంగా 50 నెలలకు బోనస్ ప్రకటించింది. ప్రస్తుతం ఆ సంస్థలోని ఉద్యోగులు అందుకుంటున్న జీతంతో సమానంగా 50 నెలల బోనస్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని బ్లూమ్‌బర్గ్ నివేదికలో పేర్కొంది. అయితే కేవలం తైవాన్ ఆధారిత కాంట్రాక్టులు కలిగిన సిబ్బందికి మాత్రమే ఈ బోనస్ వర్తిస్తుందని ఆ సంస్థ తెలిపింది.

Employees: లీవులో ఉన్నప్పుడు ఉద్యోగికి ఫోన్ చేస్తే లక్ష రూపాయల ఫైన్.. ఈ రూల్ ఎక్కడంటే

ఉద్యోగులకు బంపర్ బోనాంజ ప్రకటించిన సంస్థ పేరు అందరికి సుపరిచితమే. తైవాన్‌కు చెందిన ట్రాన్స్‌పోర్టేషన్, షిప్పింగ్ కంపెనీ ఎవర్‌గ్రీన్ మెరైన్ కార్పొరేషన్. 2021 సంవత్సరం ప్రారంభంలో సరుకు రవాణా సమయంలో ఈజిప్టులోని సూయిజ్ కాలువలో ఇరుక్కుపోయింది ఈ సంస్థకు చెందిన నౌకనే. ఆరు రోజుల పాటు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలకు సరుకు రవాణా నిలిచిపోయింది. అయితే, 2022 సంవత్సరంలో ఆ సంస్థ ఆదాయం భారీగా పెరిగింది. దాదాపు 20.7 బిలియన్ డాలర్లకు చేరింది. 2020తో పోల్చితే ఇది మూడు రెట్లు ఎక్కువ. దీంతో 50 నెలలు అంటే సుమారు నాలుగేళ్ల జీతాన్ని ఆ సంస్థ ఉద్యోగులకు బోనస్ ప్రకటించింది.

 

ఉద్యోగి వ్యక్తిగత, కంపెనీ పనితీరు ఆధారంగా బోనస్ మంజూరు చేసినట్లు తెలుస్తుంది. కంపెనీ మాత్రం తమ సంస్థలోని ఉద్యోగులకు బోనస్ ఇస్తున్నట్లు అధికారికంగా ధృవీకరించలేదు. కానీ బ్లూమ్‌బెర్గ్, ఫార్చ్యూన్‌తో సహా అనేక అంతర్జాతీయ వార్తా సంస్థలు కంపెనీలోని ఉద్యోగులకు నిజంగానే నాలుగేళ్ల బోనస్ ప్రకటించినట్లు నివేదించాయి.