Employees: లీవులో ఉన్నప్పుడు ఉద్యోగికి ఫోన్ చేస్తే లక్ష రూపాయల ఫైన్.. ఈ రూల్ ఎక్కడంటే

లీవ్ తీసుకుని, ఏదైనా పని మీద బయటకు వెళ్లినా, లేదా విశ్రాంతి తీసుకుంటున్నా సరే కాల్స్, మెసేజెస్, ఈ మెయిల్స్ ద్వారా కాంటాక్ట్ అవుతున్నారు. లీవులో ఉన్నా ఏదో ఒక రకంగా పని చేయించుకుంటున్నారు. దీనివల్ల ఎక్కడికెళ్లినా పని చేయడం తప్పడం లేదు. ఉద్యోగులు కూడా దీన్నుంచి తప్పించుకోలేని పరిస్థితి.

Employees: లీవులో ఉన్నప్పుడు ఉద్యోగికి ఫోన్ చేస్తే లక్ష రూపాయల ఫైన్.. ఈ రూల్ ఎక్కడంటే

Employees: ఈ రోజుల్లో ఉద్యోగులకు ప్రైవసీ లేకుండా పోతోంది. లీవ్ తీసుకుని, ఏదైనా పని మీద బయటకు వెళ్లినా, లేదా విశ్రాంతి తీసుకుంటున్నా సరే కాల్స్, మెసేజెస్, ఈ మెయిల్స్ ద్వారా కాంటాక్ట్ అవుతున్నారు. లీవులో ఉన్నా ఏదో ఒక రకంగా పని చేయించుకుంటున్నారు.

China Ends Quarantine: చైనాలో విదేశీ ప్రయాణికులకు క్వారంటైన్ ఎత్తివేత.. మూడేళ్ల తర్వాత ఇదే తొలిసారి

దీనివల్ల ఎక్కడికెళ్లినా పని చేయడం తప్పడం లేదు. ఉద్యోగులు కూడా దీన్నుంచి తప్పించుకోలేని పరిస్థితి. ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం చట్టం తీసుకొద్దామని ఆలోచిస్తున్నా ఇంకా కార్యరూపం దాల్చలేదు. అయితే, ఈ విషయంలో ఒక ప్రైవేటు సంస్థ ముందడుగు వేసింది. ‘డ్రీమ్ 11’ సంస్థ ‘డ్రీమ్ అన్‌ప్లగ్’ అనే పేరుతో ఒక కొత్త పాలసీ తీసుకొచ్చింది. దీని ప్రకారం ‘డ్రీమ్ 11’ సంస్థకు చెందిన ఉద్యోగులు ఎవరికీ కాల్స్, మెసేజేసె, గ్రూప్ చాటింగ్, మెయిల్స్ వంటివి చేయకూడదు. సంస్థ నుంచిగానీ, సంస్థకు చెందిన సహోద్యోగుల నుంచి కానీ, పనికి సంబంధించి ఎలాంటి కాల్స్ వంటివి చేయకూడదు. లీవులో ఉన్న ఉద్యోగిని ఎట్టి పరిస్థితుల్లోనూ సంప్రదించకూడదు. ఒకవేళ సంస్థ నుంచి ఎవరైనా ఉద్యోగి, లీవులో ఉన్న మరో ఉద్యోగికి కాల్ చేసినా, మెసేజ్ చేసినా, మెయిల్ చేసినా ఆ ఉద్యోగి లక్ష రూపాయల ఫైన్ కట్టాల్సి ఉంటుంది.

CM Manik Saha: బీజేపీ గంగా నది లాంటిది.. ప్రతిపక్ష నేతలు బీజేపీలో చేరి, పాపాల్ని పోగొట్టుకోవాలి: త్రిపుర సీఎం

ఎవరు కాల్ లేదా మెసేజ్ చేస్తే వాళ్ల లక్ష రూపాయల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ నిబంధన ఏడాదిలో ఒక్కసారే.. అది కూడా వారం రోజులపాటే అమలులో ఉంటుంది. ఈ నిబంధన కిందికి రావాలంటే ఉద్యోగులు సంస్థలో కనీసం ఏడాదిపాటు పని చేసి ఉండాలి. అలాగే ఒక ఐపీఎల్‌లో పాలు పంచుకుని ఉండాలి. నిజానికి ఉద్యోగులకు ఇలాంటి సౌకర్యం కల్పించాలని ఎప్పటినుంచో డిమాండ్ ఉంది. ఎందుకంటే ఎవరైనా లీవ్ తీసుకున్నా లేదా ఆఫీస్ ముగిసిపోయినా సరే తర్వాత ఆఫీస్ నుంచి ఫోన్ చేసి ఏదో ఒక పని పేరుతో డిస్టబ్ చేస్తున్నారు. దీనివల్ల ఉద్యోగులకు ప్రైవసీ లేకుండా పోతోంది. ఇంటికెళ్లినా, ఎక్కడికెళ్లినా పని చేయాల్సి వస్తోంది.