Rakesh Jhunjhunwala: ఝున్‌ఝున్‌వాలాను అనేకసార్లు చుట్టుముట్టిన వివాదాలు.. లక్ష్యంగా చేసుకున్న సెబీ..

భారత్‌కు చెందిన పేరుమోసిన షేర్‌మార్కెట్ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా కన్నుమూశారు. ఆయనకు 62 సంవత్సరాలు. ఝున్ ఝున్ వాలాది రాజస్థాన్ లోని ఝున్ ఝును ప్రాంతం.

Rakesh Jhunjhunwala: ఝున్‌ఝున్‌వాలాను అనేకసార్లు చుట్టుముట్టిన వివాదాలు..  లక్ష్యంగా చేసుకున్న సెబీ..

Rakesh Jhunjhunwala

Rakesh Jhunjhunwala: భారత్‌కు చెందిన పేరుమోసిన షేర్‌మార్కెట్ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా కన్నుమూశారు. ఆయనకు 62 సంవత్సరాలు. ఝున్ ఝున్ వాలాది రాజస్థాన్ లోని ఝున్ ఝును ప్రాంతం. అక్కడి నుంచి ముంబయికి వలస వచ్చిన మార్వాడీ కుటుంబం వారింది. రాకేష్ ఝున్ ఝున్ వాలా తండ్రి పేరు రాధేశ్యామ్. ఆదాయపు పన్నుల శాఖలో ఉద్యోగి. ఆయన ఉద్యోగరిత్యా హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఝున్ ఝున్ వాలా జన్మించాడు. ఆ తరువాత రాధే శ్యామ్ కు ముంబై బదిలీ కావడం.. వారంతా అక్కడి వెళ్లారు.

Rakesh Jhunjhunwala: వివాదాస్పదమైన మోదీ, రాకేష్ ఝున్‌ఝున్‌వాలా భేటీ.. కారణమేంటో తెలుసా!

చిన్నతనం నుంచి స్టాక్ మార్కెట్ పై రాజేష్ కు ఆసక్తి ఉండేది. 12ఏళ్ల వయస్సు నుంచే స్టాక్ మార్కెట్ కు సంబంధించిన వార్తలను, షేర్లనీ గమనించడం మొదలు పెట్టాడు. 17ఏళ్లకు మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించాడు. 1984లో ఐదువేలతో స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ కు సిద్ధమయ్యాడు. అయితే తండ్రిని డబ్బులు కావాలని అడిగితే ఇవ్వలేదు. నాన్న కాదనడంతో చార్టెర్డ్ అకౌంటెంట్ గా ప్రాక్టీస్ చేస్తున్న అన్నయ్య వద్ద నుంచి రూ. 5వేలు అప్పు తీసుకొని ట్రేడింగ్ మొదలు పెట్టాడు. అక్కడి నుంచి ఝున్ ఝున్ వాలాకు వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. 1986లో ఝున్‌ఝున్‌వాలా ఒక కంపెనీకి సంబంధించిన 5 వేల షేర్లు కొనుగోలు చేశారు. ఆయన వాటిని ఒక్కో షేర్ రూ.43 చొప్పున కొన్నారు. కానీ మూడు నెలల్లోనే ఆ షేర్ ధర ఒక్కక్కటి రూ.143 రూపాయలకు పెరిగింది. షేర్ మార్కెట్‌లో ఆయన విజయాలలో మొదటిది.

Rakesh Jhunjhunwala: ఇండియన్ వారెన్ బఫెట్.. రాకేష్ ఝున్‌ఝున్‌వాలా పట్టిందల్లా బంగారమే

షేర్ మార్కెట్ రంగంలో ఆయన పట్టిందల్లా బంగారమే. దీంతో ఆయన్ను ఇండియన్‌ వారెన్‌ బఫెట్‌, దేశీయ స్టాక్‌ మార్కెట్‌ మాంత్రికుడు అని అంటారు. ఝున్ ఝున్ వాలాకు ఎంత పేరు ఉందో అదే స్థాయిలో ఆయన వివాదాలతో సహవాసం చేసేవాడన్న పేరుంది. షేర్ మార్కెట్ లకు సంబంధించి కొన్ని వివాదాల్లో కూడా ఆయన్ను వెంటాడాయి. ఆప్టెక్ లిమిటెడ్ షేర్లలో ఇన్ సైడర్ ట్రేడింగ్ కు సంబంధించిన కేసులో రాకేష్, ఆయన భార్య రేఖా ఝున్ ఝున్ వాలా, మరో ఎనిమిది మంది రూ. 37కోట్లకు పైగా చెల్లించారు. ఈ మొత్తంలో సెటిల్ మెంట్ రుసుము, తప్పుడు సంపాదనలో లాభాల చెల్లింపులు, వడ్డీ ఛార్జీలు కూడా ఉన్నాయి. ఝున్ ఝున్ వాలా సెబీకి అనేకసార్లు లక్ష్యంగా మారాడు. 2018లో మరో కంపెనీలో అనుమానిత ఇన్ సైడర్ ట్రేడింగ్ కేసులో సెబీ ఆయనను విచారించింది. వాలా ఆ తరువాత రూ. 2.48లక్షలు చెల్లించి సెటిల్మెంట్ చేసుకొని ఆ కేసు నుంచి బయటపడ్డారు. ఇలా ఆయన ఆది నుంచి అనేక సార్లు వివాదాలతో సహవాసం చేస్తూ‌నే అంచెలంచెలుగా ఎదిగారు.