Covid Patient Board Flight : మహిళ వేషంలో కరోనా రోగి విమాన ప్రయాణం

కరోనా సోకినట్లు తెలిసి కూడా ఓ వ్యక్తి తమ ప్రాంతం నుంచి వేరే చోటుకు విమాన ప్రయాణం చేశాడు.

Covid Patient Board Flight : మహిళ వేషంలో కరోనా రోగి విమాన ప్రయాణం

Indonesian

Covid Patient Board Flight  కరోనా సోకినట్లు తెలిసి కూడా ఓ వ్యక్తి తమ ప్రాంతం నుంచి వేరే చోటుకు విమాన ప్రయాణం చేశాడు. అయితే అందుకు తన వేషాన్ని పూర్తిగా మార్చుకున్నాడు. కానీ, చివరికి అధికారులకి దొరికిపోయాడు.

గత వారం చివర్లో ఇండోనేసియాకు చెందిన ఓ వ్యక్తి కరోనా సోకినప్పటికీ వేరే ప్రాంతానికి వెళ్లాలనుకున్నాడు. అందుకు తన భార్యలా వేషాన్ని మార్చుకున్నాడు. బురఖా వేసుకుని, భార్య గుర్తింపు కార్డును, ఆమెకు కరోనా పరీక్ష చేయించగా వచ్చిన నెగెటివ్​ రిపోర్టును పెట్టుకుని, జకార్తాలోని పెర్డానావ్ సుమా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి మలుకు దీవుల్లోని టెర్నేట్​కు విమాన ప్రయాణం చేశాడు. అయితే జకర్తా నుంచి విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటి తర్వాత అతడు బాత్​రూంలో బట్టలు మార్చుకుని బయటకు రావడాన్ని గుర్తించిన విమానంలోని సిబ్బంది ఒకరు అధికారులకు సమాచారమందిచారు. దీంతో టెర్నేట్ ఎయిర్ పోర్ట్ లో దిగగానే అతడిని ఎయిర్ పోర్ట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అధికారులు అతడికి కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్​గా నిర్ధరణ అయింది. ప్రస్తుతం అతడు క్వారంటైన్​లో ఉన్నాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ ఘటనపై టెర్నేట్​ పోలీస్​ అధికారి ఒకరు మాట్లాడుతూ..తన భార్య పేరు మీద అతడు విమాన టికెట్​ కొనుక్కున్నాడు. ఆమె గుర్తింపు కార్డే తెచ్చుకున్నాడు. తన భార్య పేరు మీదనే కోవిడ్ టెస్ట్ రిపోర్ట్ సహా వ్యాక్సిన్ తీసుకున్నట్లు సర్టిఫికెట్ తెచ్చుకున్నాడని తెలిపారు. కాగా, ఇండోనేసియాలో కరోనా బీభత్సం కొనసాగుతుంది. ప్రతి రోజూ భారీగా కేసులు,మరణాలు నమోదవుతున్నాయి