Covid Antibodies : వ్యాక్సిన్ తీసుకున్నాక కరోనా యాంటీబాడీలు ఎవరిలో ఎక్కువగా డెవలప్ అవుతున్నాయి..?

వ్యాక్సిన్ వేయించుకున్న తరువాత యాంటీబాడీలు ఎవరెవరిలో ఎక్కువగా ఉంటున్నాయి? ఇన్‌ఫెక్షన్‌ బారినపడే వారు వ్యాక్సిన్‌ తీసుకున్నవారిలో ఎలా ఉన్నాయి? అనే అంశంపై ఆసక్తికర విషయాలు..

Covid Antibodies : వ్యాక్సిన్ తీసుకున్నాక కరోనా యాంటీబాడీలు ఎవరిలో ఎక్కువగా డెవలప్ అవుతున్నాయి..?

Covid More Antibodies

Covid Antibodies : కోవిడ్ నియంత్రణకు వ్యాక్సిన్ ఎంత అవసరమో టీకా అందుబాటులోకి వచ్చాక తగ్గిన కరోనా పాజిటివ్ కేసులే నిదర్శనంగా కనిపిస్తున్నాయి. ఈక్రమంలో భారత్ దేశవ్యాప్తంగానే వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతునే ఉంది. ఇప్పటికే కోటి వ్యాక్సిన్ రికార్డును దాటేసింది భారత్. ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లోను కొనసాగుతోంది.

ఈక్రమంలో వ్యాక్సిన్ వేయించుకున్న తరువాత యాంటీబాడీలు ఎవరెవరిలో ఎక్కువగా ఉంటున్నాయి? ఎవరిలో యాంటీబాడీలు డెవలప్ అయ్యాయి? ముఖ్యంగా ఇన్‌ఫెక్షన్‌ బారినపడే వారిలో, వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో ఇవి ఏ స్థాయిలో వృద్ధి చెందుతున్నాయనే అంశంపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత కరోనా వైరస్‌ను ఎదుర్కొనే యాంటీబాడీలు ఎంతకాలం రక్షణ కల్పిస్తున్నాయనే విషయంపై ప్రపంచ వ్యాప్తంగా అధ్యయనాలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఇన్‌ఫెక్షన్‌ బారినపడే వారిలో, వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో ఇవి ఏ స్థాయిలో వృద్ధి చెందుతున్నాయనే అంశంపై పరిశోధనలు కొనసాగిస్తున్నారు శాస్త్రవేత్తలు. దీంట్లో భాగంగా..క

రోనా బారినపడి కోలుకున్న తర్వాత రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకునే వారిలో అత్యధిక యాంటీబాడీలు ఉంటున్నట్లు తాజా అధ్యయనంలో మరోసారి వెల్లడైంది. శాస్త్రవేత్తలు ఈ విషయంపై జరిపిన అధ్యయనం గురించి జర్నల్‌ ఆఫ్‌ అమెరికన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (JAMA)లో ప్రచురితమైంది.

Read more : Covid-19’s Global Death Toll : 50 లక్షలు దాటిన కోవిడ్ మరణాలు

కరోనాను ఎదుర్కొవటానికి తీసుకున్న వ్యాక్సిన్‌ తర్వాత వారి వారి శరీరాల్లో డెవలప్ అయ్యే యాంటీబాడీలు ఎంతకాలం శక్తివంతంగా పనిచేస్తున్నాయో తెలుసుకునేందుకు అమెరికా శాస్త్రవేత్తలు అధ్యయనం చేపట్టారు. ఈ పరిశోధనల్లో భాగంగా శాస్త్రవేత్తలు ఫైజర్‌, మోడెర్నా టీకాలు తీసుకున్న 1960 మంది ఆరోగ్య సంరక్షణ సిబ్బందిని పరీక్షించారు. వీరిలో ఫస్టు డోసు తీసుకోకముందే 73 మందికి కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వీరిని రెండు వర్గాలుగా విభజించారు. వారి యాంటీబాడీల స్థాయిలను ఇంతకుముందెన్నడూ వైరస్‌కు గురికాని వారితో పోల్చి చూశారు. ఇలా మూడు నెలలు, ఆరు నెలల వ్యవధిలో పలుసార్లు యాంటీబాడీల స్థాయిలను పరీక్షించి వాటిని కంపేర్ చేసి చూశారు. అలాగే రెండోడోసు తీసుకున్న తర్వాత యాంటాబాడీలు మొదటి నెల ఎలా ఉన్నాయి? తరువాత మూడవ నెలలో ఎలా ఉన్నాయి? అని పరీక్షించారు.

Read more : Pfizer Vaccine: ‘5 ఏళ్లు దాటిన వారికి ఫైజర్ వ్యాక్సిన్ ఇవ్వొచ్చు’

రెండు డోసుల్లో వ్యాక్సిన్‌ తీసుకున్న వారితో పోలిస్తే.. ఇన్‌ఫెక్షన్‌ సోకిన తర్వాత రెండుడోసుల్లో వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలోనే యాంటీబాడీలు ఎక్కువగా డెవలప్ అయ్యాయని ఈ పరిశోధనల లీడర్ జాన్స్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీకి (JHU) చెందిన డయానా ఝాంగ్‌ వెల్లడించారు. రెండోడోసు తీసుకున్న నెల తర్వాత వీరిలో యాండీబాడీల తేడాలు 14శాతం ఉండగా.. మూడు నెలల తర్వాత 19శాతం ఉన్నాయని గుర్తించారు.

అదే ఆరు నెలల తర్వాత ఈ యాంటీబాడీల్లో తేడా 56శాతం కనిపించిందని తెలిపారు. ముఖ్యంగా ఇన్‌ఫెక్షన్‌కు తొలిడోసు..తరువాత రెండవ డోసు తీసుకున్న మధ్య ఎక్కువ సమయం ఉన్నట్లయితే యాంటీబాడీలు డెవలప్ అవ్వటం ఎక్కువగా ఉందని జేహెచ్‌యూ ప్రొఫెసర్‌ ఆరొన్‌ మిల్‌స్టోన్‌ తెలిపారు. అయితే, ఇన్‌ఫెక్షన్‌ సోకిన వారికి కాస్త ఎక్కువ టైమ్ తర్వాత వ్యాక్సిన్‌ అందించాలా? అనే విషయం చెప్పాలంటే మాత్రం మరిన్ని పరిశోధనలు జరగాలని తెలిపారు.