Covid Vaccine : ఆస్ట్రాజెనెకా, ఫైజర్‌ టీకా సింగిల్ డోసుతోనే 80% తగ్గుతున్న కరోనా మరణాల ముప్పు

ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన కరోనా వ్యాక్సిన్లు మహమ్మారిని ఎదుర్కోవడంలో సత్ఫలితాలిస్తున్నట్లు వాస్తవ నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా వైరస్‌బారిన పడి ప్రాణాలు కోల్పోయే ముప్పు నుంచి పూర్తి రక్షణ కల్పిస్తున్నాయనే వార్తలు మరింత రిలీఫ్ ఇస్తున్నాయి.

Covid Vaccine : ఆస్ట్రాజెనెకా, ఫైజర్‌ టీకా సింగిల్ డోసుతోనే 80% తగ్గుతున్న కరోనా మరణాల ముప్పు

Covid Vaccine

Covid Vaccine : ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన కరోనా వ్యాక్సిన్లు మహమ్మారిని ఎదుర్కోవడంలో సత్ఫలితాలిస్తున్నట్లు వాస్తవ నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా వైరస్‌బారిన పడి ప్రాణాలు కోల్పోయే ముప్పు నుంచి పూర్తి రక్షణ కల్పిస్తున్నాయనే వార్తలు మరింత రిలీఫ్ ఇస్తున్నాయి. ఆక్స్ ఫర్డ్ ఆస్ట్రాజెనెకా (మన దగ్గర కొవిషీల్డ్) వ్యాక్సిన్ చాలా బాగా పనిచేస్తోందని, మరణాలను తగ్గిస్తోందని ఇంగ్లండ్ ప్రజారోగ్య శాఖ (పీహెచ్ఈ) వెల్లడించింది. టీకా ఒక్క డోసు వేసుకున్నా కరోనా మరణాల ముప్పు 80 శాతం తగ్గుతోందని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఆస్ట్రాజెనికా వినియోగం, దాని వల్ల కలుగుతున్న ప్రభావాలను అంచనా వేసి ఈ నిర్ధారణకు వచ్చామంది.

ఇటు ఫైజర్, బయోఎన్ టెక్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ వేసుకుంటే మరణాల ముప్పు 80 శాతం తగ్గుతోందని, రెండు డోసులూ వేసుకుంటే కనుక 97 శాతం తగ్గిస్తోందని తెలిపింది. డిసెంబర్ నుంచి ఏప్రిల్ మధ్య నమోదైన లక్షణాలున్న కేసులు, పాజిటివ్ అని తేలిన 28 రోజులకు చనిపోయిన వారి వివరాలను అధ్యయనం చేసినట్టు పీహెచ్ఈ వెల్లడించింది.

అప్పట్లో వ్యాక్సిన్ వేసుకోని వారితో పోలిస్తే ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ఒక్క డోసు తీసుకున్న వారిలో కరోనా మరణాల ముప్పు 55 శాతం తగ్గిందని, ఫైజర్ విషయంలో అది 44 శాతంగా ఉందని తెలిపింది. మొత్తంగా రెండు వ్యాక్సిన్లలో ఏదైనా ఒక వ్యాక్సిన్ సింగిల్ డోస్ వేసినా 80 శాతం వరకు మరణాల ముప్పును తగ్గిస్తున్నాయని చెప్పింది.

కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత వాటి వాస్తవ ఫలితాలు ఎలా ఉన్నాయనే అంశంపై ప్రపంచవ్యాప్తంగా అధ్యయనాలు, సమాచార విశ్లేషణలు జరుగుతూనే ఉన్నాయి. ఇందులో కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోయే ముప్పు నుంచి ఆస్ట్రాజెనెకా, ఫైజర్‌ టీకాలు ఏమేరకు రక్షణ కల్పిస్తున్నాయనే తెలుసుకునేందుకు ఇంగ్లాండ్‌ ప్రజారోగ్య విభాగం(PHE) అధ్యయనాలు చేస్తోంది. ఇందులో భాగంగా గతేడాది డిసెంబర్‌ నుంచి ఏప్రిల్‌ మధ్య కాలంలో వ్యాక్సిన్‌ తీసుకున్న వారి వివరాలను పరిగణనలోకి తీసుకుంది.

రెండు డోసులు తీసుకున్న తర్వాత కరోనా పాజిటివ్‌గా నిర్ధారణై చివరకు ప్రాణాలు కోల్పోయిన వారి సమాచారాన్ని విశ్లేషించింది. వీటిని వ్యాక్సిన్ తీసుకోని వారి వివరాలతో పోల్చి చూసింది. తద్వారా ఏదైనా వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో కొవిడ్‌ మరణం ముప్పు నుంచి 80శాతం రక్షణ పొందుతున్నట్లు తేల్చింది. వీటిలో ఆస్ట్రాజెనెకా ఒకడోసు తీసుకున్న వారిలో కొవిడ్‌ మరణం ప్రమాదం 80శాతం తగ్గినట్లు పేర్కొంది. కొవిడ్‌ మరణాలపై అస్ట్రాజెనెకా వాస్తవ ఫలితాలు సమాచార విశ్లేషణ జరగడం ఇది తొలిసారి అని పీహెచ్‌ఈ తెలిపింది. ఇక ఫైజర్‌ టీకా తొలిడోసుతోనే 80శాతం రక్షణ కల్పిస్తుండగా.. రెండు డోసులు తీసుకున్న వారిలో 97శాతం రక్షణ కల్పిస్తుందని పీహెచ్‌సీ అధ్యయనం వెల్లడించింది.

ఇక ఫైజర్‌ తీసుకున్న 80ఏళ్లకు పైబడిన వృద్ధులు కొవిడ్‌తో ఆసుపత్రుల్లో చేరే ప్రమాదం దాదాపు 93శాతం తగ్గినట్లు పీఎచ్‌సీ జరిపిన పరిశోధన ఇంతకుముందే అంచనా వేసింది.