నాన్న ప్రపంచాన్నే మార్చేశాడు : జార్జ్ కూతురు వీడియో..కన్నీళ్లు ఆగవు

  • Published By: madhu ,Published On : June 5, 2020 / 02:24 AM IST
నాన్న ప్రపంచాన్నే మార్చేశాడు : జార్జ్ కూతురు వీడియో..కన్నీళ్లు ఆగవు

నాన్న ప్రపంచాన్నే మార్చేశాడు..పోలీసు హత్యకు గురైన..జార్జ్ ఫ్లాయిడ్ (46) కూతురు చెబుతున్న మాటలు..అందర్నీ కంటతడిపెట్టిస్తున్నాయి. చిన్నారి చెబుతున్న మాటలకు నెటిజన్లు శోక సంద్రంలో మునిగిపోయారు. నల్లజాతి వ్యక్తి జార్జ్ మెడపై కాలుపెట్టి నొక్కి చంపేసిన ఘాతుక చర్యకు నిరసనగా..అమెరికాలో గత కొన్ని రోజులుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి.

ఎన్నడూ లేని విధంగా జరుగుతున్న ఆందోళనలకు అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మరింత ఆజ్యం పోశాయి. విషాదకరమైన..హింసాత్మంకమైన వాతావరణంలో కన్న తండ్రిని పొగొట్టుకున్న ఆ చిన్నారి చెప్పిన మాటలు ఎందరినో కదిలించి వేస్తున్నాయి. మిన్నోపోలిస్ పట్టణంలో తన తండ్రి ఫ్రెండ్ స్టీఫెన్ జాక్సన్ భుజాలపై కూర్చొని ఈ వ్యాఖ్యలు చేసింది.

నాన్న ఏం చేశాడు ? అనే ప్రశ్నకు నాన్న ప్రపంచాన్నే మార్చేశాడు అంటూ చిన్నారి చెప్పింది. స్టీఫెన్ దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దట్స్ రైట్ గిగి (గియానా ఫ్లాయిడ్) నాన్న ప్రపంచాన్నే మార్చేశాడు..జార్జ్ ప్లాయిడ్..ది నేమ్ ఆఫ్ ఛేంజ్ అంటూ రాసుకొచ్చారు. ఈ సందేశం నెటిజన్ల హృదయాలను పిండేశాయి. వీడియోను వైరల్ చేస్తున్నారు. నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆ చిన్నారి తండ్రి జ్ఞాపకార్థం ఒక కన్నీటి బొట్టును విడవండి, కదిలించి వేసింది అంటూ స్పందిస్తున్నారు. 

మిన్నే పోలిస్ పట్టణంలో జార్జ్ ప్రాయిడ్ మెడపై కాలు వేసి తొక్కి చంపేసిన ఘటన ప్రపంచాన్నే షాక్ కు గురి చేసింది. తనకు ఊపిరి ఆడడం లేదని మొత్తుకుంటున్నా..ఆ పోలీసు కనికరించకపోవడం అందర్నీ కంటతడిపెట్టింది. ఆ పోలీసు అధికారి ఏడు నిమిషాల పాటు జార్జ్ గొంతును మోకాలితో నొక్కడంతో..కన్నుమూశాడు.  ప్రస్తుతం జస్టిస్ ఫర్ జార్జ్ ప్లాయిడ్ అనే డిమాండ్ తో ఉద్యమం నడుస్తోంది. ఎక్కడికక్కడ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. హ్యాండ్స్ అప్, డోంట్ షూట్, నో జస్టిస్, నో పీస్ అంటూ నినదిస్తూ..హ్యూస్టన్ వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. 

 

Read: ఈ 5 లక్షణాలు ఉన్నాయా? మీ ఎమోషనల్ హెల్త్ ప్రమాదంలో ఉన్నట్టే!