Dalai Lama: నేను చైనా నుంచి స్వాతంత్ర్యాన్ని అడ‌గ‌ట్లేదు: ద‌లైలామా

చైనాలోని కొంద‌రు త‌న‌ను వేర్పాటువాదిగా ప‌రిగణిస్తున్నార‌ని బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు దలైలామా అన్నారు. అయితే, తాను చైనా నుంచి స్వాతంత్ర్యాన్ని అడ‌గ‌ట్లేద‌ని, టిబెట్‌కు అర్థ‌వంత‌మైన స్వ‌యం ప్ర‌తిప‌త్తి, అక్క‌డ‌ బౌద్ధ‌మ‌త సంస్కృతిని సంర‌క్షించాల‌ని అడుగుతున్నాన‌ని, ఇప్పుడు ఈ విషయాన్ని చైనాలోని మెజారిటీ ప్ర‌జ‌లు గ్ర‌హిస్తున్నార‌ని చెప్పారు.

Dalai Lama: నేను చైనా నుంచి స్వాతంత్ర్యాన్ని అడ‌గ‌ట్లేదు: ద‌లైలామా

Dalai Lama

Dalai Lama: చైనాలోని కొంద‌రు త‌న‌ను వేర్పాటువాదిగా ప‌రిగణిస్తున్నార‌ని బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు దలైలామా అన్నారు. అయితే, తాను చైనా నుంచి స్వాతంత్ర్యాన్ని అడ‌గ‌ట్లేద‌ని, టిబెట్‌కు అర్థ‌వంత‌మైన స్వ‌యం ప్ర‌తిప‌త్తి, అక్క‌డ‌ బౌద్ధ‌మ‌త సంస్కృతిని సంర‌క్షించాల‌ని అడుగుతున్నాన‌ని, ఇప్పుడు ఈ విషయాన్ని చైనాలోని మెజారిటీ ప్ర‌జ‌లు గ్ర‌హిస్తున్నార‌ని చెప్పారు. ఇవాళ ద‌లైలామా ధ‌ర్మ‌శాల నుంచి జ‌మ్మూ చేరుకున్నారు. రేపు ద‌లైలామా ల‌ద్దాఖ్‌లో ప‌ర్య‌టించాల్సి ఉంది.

Maharashtra: పెట్రోల్‌పై లీట‌రుకు రూ.5 వ్యాట్ త‌గ్గించిన మ‌హారాష్ట్ర కొత్త సీఎం షిండే

అయితే, ఈ ప‌ర్య‌ట‌న‌పై చైనా అభ్యంత‌రాలు తెలుపుతున్న విష‌యంపై ద‌లైలామా స్పందించారు. టిబెటన్ బౌద్ధ‌మ‌తంపై చైనాలోని చాలా మంది ప్ర‌జ‌లు ఆస‌క్తి క‌న‌బ‌ర్చుతున్నార‌ని ఆయ‌న అన్నారు. టిబెట‌న్ బౌద్ధ‌మ‌తం నిజ‌మైన జ్ఞానం, సంప్ర‌దాయం, శాస్త్రీయ మత‌మ‌ని చైనా స్కాల‌ర్లూ గ్ర‌హించార‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. కాగా, ఈ నెల 16 నుంచి చైనా-భార‌త్ మ‌ధ్య క‌మాండ‌ర్ స్థాయి స‌మావేశాలు జ‌ర‌గాల్సి ఉంది. ఈ స‌మ‌యంలో ద‌లైలామా జ‌మ్మూక‌శ్మీర్‌, ల‌ద్దాఖ్‌లో ప‌ర్య‌టిస్తుండ‌డం గ‌మ‌నార్హం.