Delmicron: ఒమిక్రాన్ తర్వాత డెల్‌మిక్రాన్.. కరోనా కొత్త వేరియంట్..

కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ UK , అమెరికా సహా ప్రపంచంలోని అనేక దేశాల్లో కంగారు పెట్టేస్తోండగానే ఇప్పుడు మరో కొత్త వేరియంట్ రావడం అందరినీ ఆందోళనకు గురిచేస్తుంది.

Delmicron: ఒమిక్రాన్ తర్వాత డెల్‌మిక్రాన్.. కరోనా కొత్త వేరియంట్..

Delmicron

Delmicron: కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ UK , అమెరికా సహా ప్రపంచంలోని అనేక దేశాల్లో కంగారు పెట్టేస్తోండగానే ఇప్పుడు మరో కొత్త వేరియంట్ రావడం అందరినీ ఆందోళనకు గురిచేస్తుంది. డెల్‌మిక్రాన్(Delmicron) అనే కొత్త వేరియంట్ కారణంగానే కొన్ని దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నట్లుగా చెబుతున్నారు. డెల్టా, ఓమీక్రాన్ వేరియంట్స్ కలయికతో డెల్‌మిక్రాన్ ఎంట్రీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది.

డెల్‌మిక్రాన్.. డెల్టా అనేది ఓమీక్రాన్ కంటే ముందు ప్రజలను తీవ్ర ఇబ్బందులు పెట్టిన వేరియంట్. భారత్‌లో కూడా సెకండ్ వేవ్‌కి కారణమైన ఈ వేరియంట్ ప్రజలకు విపరీతంగా సోకింది. ఎంతోమంది మరణానికి కారణమైంది. ఇప్పుడు భారత్‌లో మొత్తం కేసుల సంఖ్య 358కి చేరిన తర్వాత.. ఇప్పుడు కరోనాకు సంబంధించిన మరో డెల్‌మిక్రాన్ దడ పుట్టిస్తోంది.

డెల్‌మిక్రాన్‌లో రెండు స్పైక్ ప్రొటీన్లు ఉండగా.. అందులో ఒకటి ఒమిక్రాన్‌ది, మరొకటి డెల్టాది. ఈ రెండు కలయిక కారణంగా యూకే, అమెరికా సహా పలు ఐరోపా దేశాల్లో కేసుల పెరుగుదల ఎక్కువగా ఉందని అంచనా వేస్తున్నారు.

డెల్‌మిక్రాన్‌ లక్షణాల విషయానికి వస్తే, ఆగని దగ్గు.. తీవ్రమైన జ్వరం.. వాసన కోల్పోవడం.. గొంతు మంట.. తలనొప్పి.. ముక్కు కారుతూనే ఉండడం అని చెబుతున్నారు నిపుణులు. మాస్క్‌లు వేసుకుని, వ్యాక్సిన్ వేయించుకుని, పరిశుభ్రంగా ఉండడమే కరోనా రాకుండా ఉండడానికి ఏకైక మార్గంగా చెబుతున్నారు డాక్టర్లు.