Elon Musk: 2015లోనే మస్క్ ట్విటర్ కొనుగోలుపై గురిపెట్టాడా? మస్క్ షేర్‌చేసిన కార్టూన్ అర్థం ఏమిటో తెలుసా?

ట్విటర్ ను టేకోవర్ చేసుకున్న తరువాత నుంచి మస్క్ తన సంచలన నిర్ణయాలతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. సంస్థలోని 50శాతం మంది ఉద్యోగులను తొలగించడంతో పాటు ట్విటర్ లో కీలక మార్పులు మస్క్ చేస్తున్నారు. హార్డ్ కోర్ పని సంస్కృతిని అలవర్చుకోవాలని, లేకుంటే ఇబ్బందులు తప్పవని మస్క్ ఇప్పటికే ఉద్యోగులకు సూచించారు.

Elon Musk: 2015లోనే మస్క్ ట్విటర్ కొనుగోలుపై గురిపెట్టాడా? మస్క్ షేర్‌చేసిన కార్టూన్ అర్థం ఏమిటో తెలుసా?

Elon Musk

Elon Musk: ఎలాన్ మస్క్.. ప్రస్తుతం.. ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతున్న పేరు. ట్విటర్ గురించి తెలిసిన వారు ఎవరైనా మస్క్ గురించి ఇట్టే చెప్పేస్తారు. ట్విటర్‌ను టేకోవర్ చేసుకున్న తరువాత సంచలన నిర్ణయాలకు కేంద్రంగా మస్క్ నిలుస్తున్నాడు. అయితే, మస్క్ ట్విటర్ కొనుగోలు ప్రక్రియను 2015నుంచే ప్రారంభించాడా? అనేఅంశం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే తాజాగా మస్క్ తన ట్విటర్ ఖాతాలో ఆసక్తికర పోస్టు చేశాడు.

Elon Musk : ఆపిల్, గూగుల్ ఒకవేళ ట్విట్టర్‌ను బ్యాన్ చేస్తే.. ఏం చేస్తాడో చెప్పేసిన ఎలన్ మస్క్.. అదేంటో తెలిస్తే షాకవుతారు..!

ఎలాన్ మస్క్ తన ట్విటర్ ఖాతాలో ఓ కార్టూన్‌ను పోస్టు చేశాడు. ఈ కార్టూన్‌లో ఓ ఎత్తైన దిమ్మెపై ఇంటిని నిర్మించినట్లు ఉంది. దానికి హోం ట్వీట్ హోం అని రాసి ఉంది. ఆ ఇంటిపై పలు రకాల పక్షులు ఉన్నాయి. ఓ నెచ్చెన వేసుకొని ఓ వ్యక్తి వాటికి ఆహారాన్ని అందిస్తున్నట్లుగా ఉంది. 2015యానిమేటెడ్ సిట్‌కామ్ ఎపిసోడ్‌లోని ఫొటోను మస్క్ షేర్ చేశాడు. తన ట్విటర్ కొనుగోలును సూచించినట్లు అనిపించింది.”నేను Twitter S26E12ని కొనుగోలు చేస్తానని సింప్సన్ ఊహించాడు.” అని మస్క్ రాశాడు. మస్క్ ట్వీట్ కు నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు.