Bangkok Original Name:బ్యాంకాక్‌ అసలు పేరు ఎంత పెద్దదో..!పేరులో పరమార్థం ఏంటంటే. | Bangkok Original Name

Bangkok Original Name:బ్యాంకాక్‌ అసలు పేరు ఎంత పెద్దదో..!పేరులో పరమార్థం ఏంటంటే.

మ‌నం బ్యాంకాక్ అని పిలిచే ఆ నగరం అస‌లు పేరు ఏంటో తెలుసా? అత్యంత భారీ పేరున్న నగరంగా గిన్నీస్ బుక్ లోకి ఎక్కిన బ్యాంకాక్ అసలు పేరు..దాని అర్థం ఏంటంటే..

Bangkok Original Name:బ్యాంకాక్‌ అసలు పేరు ఎంత పెద్దదో..!పేరులో పరమార్థం ఏంటంటే.

Bangkok Original Name : బ్యాంకాక్‌.భూతల స్వర్గం. విలాసాల స్వర్గం.మజా చేయాలనుకునే చాలామంది ముఖ్యంగా మగవారు వెళ్లాలనుకునే టూరిస్ట్ ప్లేస్. సాధారణంగా బ్యాంకాక్ అంటే యువ‌కుల్లో జోష్ వచ్చేస్తుంది. బీచ్‌లు, అందమైన అమ్మాయిలు, థాయ్‌ మసాజ్‌లు క‌ళ్ల‌ముందు కనిపించి కైపెక్కిస్తాయి. కానీ బ్యాంకాక్ కు ఇప్పుడున్న ఈ పేరు అసలైనది కాదు. దానికి ముందు మరోపేరు ఉండేది. సింపుల్‌గా మ‌నం బ్యాంకాక్ అంటున్నాం. కానీ దాని అస‌లు పేరు చెప్పాలంటే మ‌న నోరు తిర‌గ‌దు.. పైగా ఆ పేరు మనం అంటుంటామే కొల్లేరు చాంతాడు అని అంత ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఓ పద్యంలా ఉంటుంది.ఓరి నాయనో అంత పెద్ద పేరా !అనిపిస్తుంది. నిజానికి బ్యాంకాకు కు అసలు పేరు ఒకటి ఉందనే విషయమనే చాలామందికి తెలియదు. మరి ఆ పేరు ఏంటో అంత పెద్దపేరు వెనుక ఉన్న అర్థం ఏంటో పేరులో ఉండే పరమార్థం ఏంటో తెలుసుకుందాం.

Bangkok - What you need to know before you go - Go Guides

ముందుగా బ్యాంకాక్ అసలు పేరు ఏంటంటే.. “క్రుంగ్‌థెప్‌మహానాఖోన్ అమోన్‌ర‌త్త‌న‌కొసిన్‌ మ‌హింథ‌ర‌యుత్త‌య‌ మ‌హాదిలోక్‌ఫోప్ నొప్ప‌రాట్ర‌చ‌తానిబురిరోమ్ ఉదోమ్‌ర‌చ‌నివెట్‌మ‌హాస‌తాన్ అమోన్‌పిమాన్‌అవ‌త‌న్‌సాత్హిత్‌ స‌ఖ‌ట‌తియావిట్స‌న‌కుమ్‌ప్ర‌సిట్‌..”అట.ఏంటీ..ఈ పేరును టకటకా చదివేశారా? నోరు తిరిగిందా? రెండు పదాలు పూర్తి కాకుండానే ఆపేసి ఉంటారే..ఓరి నాయనో ఏంటీ మన భగవద్గీతలో ఉండే శ్లోకంలా ఉందే అనిపిస్తోంది కదూ. ఇది చదవటం అవ్వదు గానీ..ఈ పేరు వెనుకు ఉన్న ఆ విశేషాలేంటో..అర్థం ఏంటో తెలిసేసుకుందాం..

THE PENINSULA BANGKOK - Hotel Reviews, Photos, Rate Comparison - Tripadvisor

అత్యద్బుతం ఈ పేరు గల అర్థాలు..
ఇదేదో సంస్కృత శ్లోకంలా ఉంద‌ని అనిపిస్తుందీ పేరు కదూ..నిజమే. పాలి, సంస్కృత భాష‌ల్లోని ప‌దాల‌తో దీనికి ఈ పేరు పెట్టారట. ఇంత పొడవైన పేరుకు మరి అర్థం లేకుండా ఎలా ఉంటుంది. ఉండనే ఉంది అలాటింటా అర్థం కాదు..పేరు తగిటనట్లుగానే ఉంది. ఈ అసలు పేరుకు గల అర్థం ఏంటంటే..‘‘దేవ‌దూత‌ల న‌గ‌రం, అమ‌ర‌త్వం పొందిన న‌గ‌రం, తొమ్మిది ర‌త్నాల అద్భుత‌మైన న‌గ‌రం, చ‌క్ర‌వ‌ర్తి సింహాస‌నం, రాజ‌భ‌వంతుల న‌గ‌రం, మాన‌వ‌రూపంలో అవ‌త‌రించిన దేవ‌తల ఇల్లు, ఇంద్రుడి ఆదేశాల‌తో విశ్వ‌క‌ర్మ నిర్మించిన న‌గ‌రం. అని అర్థాలున్నాయి. ఇంతకీ ఈ పేరు ఎవరు పెట్టారంటే ‘కింగ్ మాంగ్‌కుట్ మ‌హారాజు’ బ్యాంకాక్‌కు ఈ పేరు పెట్టారట.

Bangkok | Visa

ఒక‌ప్ప‌టి సియా రాజ్యం అయిన థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్. ఇది ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందిన నగరం. కానీ.. పూర్వం అది ఒక చిన్న ప‌ల్లెటూరులా ఉండేదట. 15వ శ‌తాబ్దంలోనే ఆయుత్త‌య రాజులు దీన్ని న‌గ‌రంగా అభివృద్ధి చేసేందుకు శ్రీకారం చుట్టారు. 1782లో ఫుత్తయోత్ఫా చౌల‌లోక్ ( కింగ్ రామా I) ) బ్యాంకాక్‌ను రాజ‌ధానిగా మార్చుకున్నాడు. ఆయ‌న హయాంలో ఈ రాజ‌ధానిని క్రుంగ్‌థెప్ త‌వ‌ర‌వాడి సి ఆయుత్త‌య‌, క్రుంగ్‌థెప్ మ‌హానిఖోన్ సి ఆయుత్త‌య అని పిలిచేవారు. అయితే 1833లో బ్యాంకాక్ పేరును సియా- యుతియాగా పిల‌వ‌డం ప్రారంభించారు. అంత‌ర్జాతీయ ఒప్పందాల్లోనూ అదే పేరుతో ఈ న‌గ‌రాన్ని పిలిచేవారు. ఇక 1850ల్లో కింగ్ మాంగ్‌కుట్‌ పైన చెప్పుకున్న పొడ‌వైన పేరును పెట్టారు.

Thailand's plans to fully re-open in doubt as virus cases spike - BBC News

మరి ఇంత పే…ద్ద పేరున్న ఈ పేరు రికార్డు లేకుండా ఎలా ఉంటుంది. అదికూడా ఉండనే ఉంది.
అత్యంత పొడ‌వైన పేరు క‌లిగిన న‌గ‌రంగా గిన్నిస్ బుక్‌లోనూ ఈ న‌గ‌రం చోటు సంపాదించుకుంది. ప్ర‌స్తుతం ఈ న‌గ‌రాన్ని అంద‌రూ బ్యాంకాక్ అని పిలుస్తున్నారు. కానీ స్థానికులు మాత్రం అదే పాత పేరుతోనే పిలుస్తుంటారట. అయితే మొత్తం పేరుని చెప్పేసరికి ఓ హాఫ్ డే పడుతుంది.దాన్ని విన్నవారు అర్థం చేసుకోవటం అస్సలే అవ్వదు. దీంతో దాన్ని కుదించి క్రుంగ్‌థెప్ మ‌హానిఖోన్, క్రుంగ్‌థెప్ అని పిలుస్తుంటారు.తెలిసింది కదూ..భూతల స్వర్గంగా పేరొందిన బ్యాంకాక్ అసలు పేరు చరిత్ర. పేరులో పరమార్థం. మీరు కనుక బ్యాంకాక్ వెళితే దాని పాత పేరుతో పిలవండే..

28 Dishes of Bangkok Street Food That You Must Try in 2021

ఈ బ్యాంకాక్ కు మరో చరిత్ర కూడా ఉంది. అదే అయోధ్య..

అయోధ్య అంటే మన ఉత్తరప్రదేశ్ లో ఉన్న అయోధ్య అనే చాలామందికి తెలుసు. కానీ థాయ్ లాండ్ లో కూడా ఓ అయోధ్య ఉంది. రామ భక్తులకు కూడా తెలియని రామ రాజ్యం అది. అదే యూపీకి 3 వేల 500 కిలో మీటర్ల దూరంలో ఉన్న థాయ్ లాండ్ రాజధాని బ్యాంక్ కాక్ లో ఉంది ఈ రెండో అయోధ్య. బ్యాంకాక్ కు కేవలం ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ రెండో అయోధ్య. బ్యాంకాక్ లో ఉన్న ఈ అయోధ్య గురించి ప్రధాని నరేంద్రమోడీ బ్యాంకాక్ వెళ్లినప్పుడు ఓ సమావేశంలో మాట్లాడారు.

 

థాయ్ లాండ్ లోని ఈ అయోధ్యలో ఉన్న ఓ బోర్డుపై ఇది శ్రీరామ జన్మ స్థలం అని రాసి ఉంటుంది. థాయ్ లాండ్ లో ఉన్న ఈ అయోధ్యను ‘అయుథ్తయ’ అని అంటారు.థాయ్ లాండ్ ప్రాచీన రాజధాని పేరు ‘అయుథ్తయ’. భారత్ లో మొఘలాయిల పాలన ప్రారంభం కాక ముందే థాయ్ లాండ్ లో రాముడ్ని స్మరించేవారు. పూజించేవారు. ఆరాధించేవారు. అనాటే ఈ అయెధ్య వెలసింది.

 భారత్ లోని అయోధ్యకు ఈ అయోధ్యకు సంబంధాలున్నాయి. భారత్ కు 3వేల 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న థాయ్ లాండ్ లో రామనామం మారుమ్రోగుతోంది. ఇప్పటికీ థాయ్ లాండ్ ప్రజల గుండెల్లో రాముడున్నాడు. భారతదేశపు ప్రాచీనత్వానికి థాయ్ లాండ్ లోని అయోధ్య నిలువెత్తు నిదర్శనంగా ఉంది.

×