India at UN: ప్రజాస్వామ్యాన్ని ఎలా కాపాడాలో మాకు పాఠాలు చెప్పొద్దు.. ఐక్యరాజ్య సమితిలో భారత్

భారతదేశం ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన నాగరికత అని మీ అందరికీ తెలుసు. భారతదేశంలో ప్రజాస్వామ్యానికి 2,500 సంవత్సరాల నాటి మూలాలు ఉన్నాయి. మాది అప్పటి నుంచి ప్రజాస్వామ్య దేశమే. ఇటీవలి కాలంలో ఏర్పడ్డ ప్రజాస్వామ్యాలన్నింటికీ మూలస్తంభాలు మా దగ్గర ఉన్నాయి. లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, న్యాయవ్యవస్థ, ఫోర్త్ ఎస్టేట్, ప్రెస్, చాలా శక్తివంతమైన సోషల్ మీడియా.. ఇలాంటివి చెక్కె చెదరకుండా ఉన్నాయి

India at UN: ప్రజాస్వామ్యాన్ని ఎలా కాపాడాలో మాకు పాఠాలు చెప్పొద్దు.. ఐక్యరాజ్య సమితిలో భారత్

Don't need to be told what to do on democracy: India at UN

India at UN: ప్రజాస్వామ్యంపై ఏం చేయాలో, ప్రజాస్వామ్యాన్ని ఎలా కాపాడాలో భారత్‌కు చెప్పనవసరం లేదని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అధ్యక్షురాలు రుచిరా కాంబోజ్ అన్నారు. ఐక్యరాజ్యసమితిలోని 15 దేశాల భద్రతా మండలి అధ్యక్ష పదవిని భారత్ గురువారం చేపట్టింది. భారత్ ప్రతినిధిగా రాయబారి రుచిరా వ్యవహరిస్తున్నారు. ఈ పదవి రెండేళ్ల పాటు కొనసాగుతుంది.

ఈ సందర్భంగా ఏర్పాటైన ప్రత్యేక సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం, సంస్కరణలు తీసుకురావడం వంటి అంశాలపై సంతకాలు తీసుకునే కార్యక్రమాల్ని ఈ సమయంలో నిర్వహించాలని అన్నారు. ఆమె మాట్లాడుతుండగా పాత్రికేయులు కలుగ జేసుకుని భారతదేశంలో ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛపై ప్రశ్నించారు. దానికి ఆమె సమాధానమిస్తూ “ప్రజాస్వామ్యంపై ఏం చేయాలో, ప్రజాస్వామ్యాన్ని ఎలా కాపాడాలో భారత్‌కు చెప్పనవసరం లేదు’’ అని అన్నారు.

Anti-Brahmin: జేఎన్‭యూలో బ్రాహ్మణ వ్యతిరేక నినాదాలు.. విచారణకు ఆదేశించిన యూనివర్సిటీ వీసీ

ఇదే విషయమై ఆమె మాట్లాడుతూ “భారతదేశం ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన నాగరికత అని మీ అందరికీ తెలుసు. భారతదేశంలో ప్రజాస్వామ్యానికి 2,500 సంవత్సరాల నాటి మూలాలు ఉన్నాయి. మాది అప్పటి నుంచి ప్రజాస్వామ్య దేశమే. ఇటీవలి కాలంలో ఏర్పడ్డ ప్రజాస్వామ్యాలన్నింటికీ మూలస్తంభాలు మా దగ్గర ఉన్నాయి. లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, న్యాయవ్యవస్థ, ఫోర్త్ ఎస్టేట్, ప్రెస్, చాలా శక్తివంతమైన సోషల్ మీడియా.. ఇలాంటివి చెక్కె చెదరకుండా ఉన్నాయి. మా దేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం’’ అని అన్నారు.

“ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య ఎన్నికను నిర్వహిస్తాము. ప్రతి ఒక్కరూ తమ ఇష్టానుసారంగా, స్వేచ్ఛగా ఓటేస్తారు. భిన్న అభిప్రాయాలు, భిన్న వాదనలు తరుచూ చర్చలోకి వస్తుంటాయి. అన్నింటికీ ప్రాధాన్యం ఉంటుంది” అని కాంబోజ్ అన్నారు.

Mallikarjun Kharge: అటువంటి వ్యాఖ్యలు చేయొద్దు: ఖర్గే చేసిన ‘రావణ్’ వ్యాఖ్యలపై సొంత పార్టీ నాయకురాలి నుంచి విమర్శ