Cash On Road : రోడ్డుపై నోట్ల కట్టలు.. జేబుల్లో నింపుకొని పారిపోయిన వాహనదారులు

ఓ కంటైనర్ నోట్లకట్టలతో వెళ్తుంది.. మార్గమధ్యంలో కంటైనర్ డోర్ తెరుచుకోవడం నోట్ల సంచులు కిందపడ్డాయి. వాటిలోని డబ్బులు రోడ్లపై చల్లా చెదురుగా పడిపోయాయి.

Cash On Road : రోడ్డుపై నోట్ల కట్టలు.. జేబుల్లో నింపుకొని పారిపోయిన వాహనదారులు

Cash On Road

Cash On Road : ఓ కంటైనర్ నోట్లకట్టలతో వెళ్తుంది.. మార్గమధ్యంలో కంటైనర్ డోర్ తెరుచుకోవడం నోట్ల సంచులు కిందపడ్డాయి. వాటిలోని డబ్బులు రోడ్లపై చల్లా చెదురుగా పడిపోయాయి. ఆ రోడ్డుపై వచ్చినవారు.. ఆ నోట్లను తీసుకోని తమ జేబుల్లో వేసుకున్నారు. ఈ ఘటన అమెరికాలో దక్షిణ కాలిఫోర్నియాలోని ఫ్రీవే రహదారిపై జరిగింది. శాన్‌డిగో నుంచి కాలిఫోర్నియాలోని ఫెడరల్‌ డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ కార్యాలయానికి డబ్బు సంచులతో బయలుదేరిన వాహనం తలుపు మార్గమధ్యంలో అకస్మాత్తుగా తెరుచుకుంది.

చదవండి : WhatsApp Cashback: వాట్సాప్‌ పేమెంట్స్‌తో క్యాష్‌బ్యాక్‌.. ఇలా ట్రై చేయండి!

దాంట్లోని డబ్బుల కట్టలు నిదపడి అవి రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. అటుగా వచ్చినవారు తన జేబుల్లో వేసుకొని మెల్లిగా జారుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆ మార్గంపై వాహనాలను నిలివేశారు.. వాహనదారులను అడ్డుకున్నారు. డబ్బులు తిరిగి ఇవ్వాలని ఆదేశించడంతో కొందరు ఇచ్చేశారు. కానీ మరికొందరు పోలీసుల కళ్లుకప్పి పారిపోయారు. డెమీ బాగ్బీ అనే బాడీ బిల్డర్‌ ఈ దృశ్యాలన్నీ ఫోన్‌లో చిత్రీకరించి, సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీంతో ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. డబ్బు తీసుకున్నవారు వారు ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే సమీపంలోని సీసీటీవీ లను పరిశీలిస్తున్నారు పోలీసులు.

చదవండి : Man Looted Cash : స్నేహితుడని ఇంట్లో ఉండమంటే… దోచుకెళ్లాడు