Plastic IN Human Blood : మ‌నుషుల ర‌క్తంలో మైక్రోప్లాస్టిక్స్‌..మనకు తెలియకుండానే శరీరంలోకి వెళ్లిపోతున్నాయి..!!

మ‌నుషుల ర‌క్తంలో మైక్రోప్లాస్టిక్స్‌ ను పరిశోధకులు గుర్తించారు. ఈ ప్లాస్టిక్ కణాలు మనకు తెలియకుండానే శరీరంలోకి వెళ్లిపోతున్నాయని తెలిపారు.

Plastic IN Human Blood : మ‌నుషుల ర‌క్తంలో మైక్రోప్లాస్టిక్స్‌..మనకు తెలియకుండానే శరీరంలోకి వెళ్లిపోతున్నాయి..!!

Plastic Found In Human Blood (2)

plastic found in human blood : మ‌నుషుల ర‌క్తంలో కొలస్ట్రాల్ ఉంటుంది. కానీ ప్లాస్టిక్ ఉంటుందా?అంటే ఉందని చెబుతున్నారు పరిశోధకులు. మనిషి రక్తంలో ప్లాస్టిక్ ఉందని కనుగొన్నారు శాస్త్రవేత్తలు.
మ‌నుషుల ర‌క్తంలో మొద‌టిసారి ప్లాస్టిక్‌ను గుర్తించామని తెలిపారు. మనుషుల రక్తంలో ప్లాస్టిక్ కనుగొనే విషయంలో శాస్త్రవేత్తలు 10మందికి పరీక్షలు చేయగా వారిలో ఎనిమిదిమంది రక్తంలో మైక్రోప్లాస్టిక్స్ ఉన్నాయని డ‌చ్  Vrije University, Amsterdam and the Amsterdam University, Medical Centre ప‌రిశోధ‌కులు  గుర్తించారు.ప్రతి మిల్లీలీటర్ రక్తంలో సగటున 1.6 మైక్రోగ్రాములు (గ్రామ్‌లో 1.6 మిలియన్ల వంతు) స్థాయిలు ఉన్నాయని గుర్తించారు.

Also read :  Dinosaur : చిలీలో కొత్త డైనోసార్ జాతి గుర్తించిన పరిశోధకులు..

చాలామంది ర‌క్తంలో పాలిథిలీన్‌ టెరాఫ్త‌లేట్ (Polyethylene terephthalate) ఉందని తెలిపారు. గృహోప‌క‌ర‌ణాల‌కు వాడే పాలిస్టిరీన్ కణాలు ఉన్న‌ాయని..77 శాతం మంది ర‌క్త‌ప్ర‌వాహంలో ప్లాస్టిక్ క‌ణాలు ఉన్న‌ాట్లు వెల్ల‌డించారు. వాట‌ర్ ప్యాకెట్లు, కూల్ డ్రింక్స్‌, ఫుడ్ ప్యాకేజీకి వాడే పాలిథిలీన్‌ టెరాఫ్త‌లేట్ (PET) ఎక్కువ మంది ర‌క్తంలో ఉన్నట్లుగా గుర్తించారు. ఆ ప్లాస్టిక్ క‌ణాలు గాలి, ఆహారం, నీరు, డ్రింక్స్ ద్వారా మాన‌వ శ‌రీరంలోకి ప్ర‌వేశించిన‌ట్లు నిర్ధారించారు.

మనకు తెలియకుండానే శరీరంలోకి చేరిపోతున్న ప్లాస్టిక్..
ప‌రిశోధ‌నా ఫ‌లితాలు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయ‌ని అమెస్ట‌ర్‌డామ్‌లోని ఎకోటాక్సికాలజీ అండ్ వాటర్ క్వాలిటీ అండ్ హెల్త్ ప్రొఫెసర్ డిక్ వెథాక్ అన్నారు. చాలామంది త‌మ‌కు తెలియ‌కుండానే ప్లాస్టిక్ క‌ణాల‌ను తమ శరీరంలోకి పంపిస్తున్నారు (పీల్చుకుంటున్నార‌ు) అని..అవి ర‌క్తంలో మనకు తెలియకుండానే చేరిపోతున్నాయ‌ని తెలిపారు. ఈ ప్లాస్టిక్ వల్ల దీర్ఘ‌కాల ఇన్ఫ్ల‌మేష‌న్ ఏర్ప‌డే ప్ర‌మాద‌ముంద‌ని ఆందోళన వ్యక్తంచేశారు.

Also read : Sea Dragon Dolphin: ఇది.. 180 మిలియన్ ఏళ్లనాటి భారీ ‘సీ డ్రాగన్ డాల్ఫిన్’ అస్థిపంజరం

మాన‌వ శ‌రీరంలో ఐదు ర‌కాల ప్లాస్టిక్‌ కణాలను గుర్తింపు..!
డచ్ ప‌రిశోధ‌కులు 22 మంది ర‌క్తం సేక‌రించి..పలు ప‌రీక్షలు నిర్వహించారు. ఈ 22 మందిలో 17 మంది ర‌క్తంలో గుర్తించ‌ద‌గిన మోతాదులో ప్లాస్టిక్ క‌ణాలున్న‌ాయని గుర్తించారు. వీరి ర‌క్తంలో మొత్తం ఐదు ర‌కాల ప్లాస్టిక్ క‌ణాల‌ను క‌నుగొన్నారు. పాలీప్రొఫిలీన్‌, పాలిస్టిరీన్‌, పాలీమిథైల్ మెథాక్రిలేట్‌, పాలిథిలీన్‌, పాలిథిలీన్ టెరాఫ్త‌లేట్ (పీఈటీ)లాంటి ఐదు ర‌కాల ప్లాస్టిక్‌ల‌ను గుర్తించారు. పాలిథిలీన్ టెరాఫ్త‌లేట్ త‌ర్వాత పాలిస్టిరీన్ ఎక్కువ మోతాదులో ఉన్న‌ట్లు తేల్చారు. ఈ రెండింటి త‌ర్వాత క్యారీ బ్యాగ్స్ త‌యారీకి వాడే పాలిథిలీన్ ఎక్కువ‌గా ఉన్న‌ట్లు క‌నుగొన్నారు. ర‌క్త‌పరీక్ష‌లు చేసిన 50శాతం మందిలో పాలిథిలీన్ టెరాఫ్త‌లేట్ ఉన్న‌ట్లు గుర్తించారు. 36 శాతం మందిలో పాలిస్టిరీన్ ఉన్న‌ాయని పరిశోధకులు తేల్చారు.

1,306 Legged Millipede : కళ్లు లేని..1,306 కాళ్లున్న అరుదైన జీవిని గుర్తించిన పరిశోధకులు