Elephant : అడవి దున్నని ఎత్తిపడేసిన ఏనుగు..

సుమారు 500 కేజీల బరువైన అడవి దున్నను ఓ ఏనుగు తన పళ్లతో అమాంతం పైకి లేపి కిందపడేసింది. ఈ ఘటన కెన్యా అభయారణ్యంలో చోటుచేసుకుంది.

Elephant : అడవి దున్నని ఎత్తిపడేసిన ఏనుగు..

Elephant

Elephant : ఈ మధ్యకాలంలో నెట్టింట వైరల్ అయ్యే ఫొటోస్, వీడియోస్ లో చాలా వరకు జంతువులవే ఉంటున్నాయి. జంతువులు చేసే వింత ప్రవర్తనలను తమ కెమెరాల్లో బందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు కొందరు. ఇవి అనుకోకుండా వైరల్ అవుతుంటాయి. తాజాగా జంతువులకు సంబందించిన అనేక వీడియోలు వైరల్ అయ్యాయి. వాటిలో ఓ ఫోటో కూడా ఉంది ఈ ఫొటోలో ఓ భారీ ఏనుగు అడవి దున్నను తన పళ్లతో పైకిపింది.

Kenya 3

సుమారు 500 కిలోల బరువుండే అడవి దున్నను ఒక్క ఉదిటిన పైకి లేపడం అంటే ఆషామాషీ విషయం కాదు. ఈ పీట్ అడవిలోని ఏ జంతువుకు సాధ్యం కాదు ఒక్క ఏనుగుకు తప్ప.. అడవిలో ఎప్పుడు ప్రశాంతంగా ఉండే ఏనుగులు కోపం వచ్చిన సమయంలో ఎలా ప్రవర్తిస్తాయో కూడా ఉహించలేను. భారీ వృక్షాలను నేలమట్టం చేస్తాయి. ఒక్కోసారి అడవుల్లోంచి వెళ్లే వాహనదారులపై దాడులు చేస్తుంటారు. తొండంతో భారీ వాహనాలను కూడా కిందపడేస్తాయి.

 

Kenya

ఇక తాజాగా కెన్యా అభయారణ్యంలో పర్యటిస్తున్న వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ల కెమెరాలకు ఓ అరుదైన దృశ్యం చిక్కింది. కెన్యా అడవుల్లో విరివిగా కనిపించే అడవి గేదెలు దున్నలు.. కొన్ని సార్లు ఇతర జంతువులకు విసుగు తెప్పిస్తాయి. వాటికంటే తక్కువ పరిమాణంలో ఉండే జంతువులకు విసుగు తెప్పించినా అవి ఏమి చెయ్యలేవు.. అయితే ఏనుగు లాంటి జంతువు దారికి అడ్డుబడి విసుగు తెప్పిస్తే.. ఇంకేముంది ఏనుగు లేపి ఎత్తేస్తుంది. అయితే ఇక్కడ అదే జరిగింది. ఏనుగు తన తొండం సాయంతో 500 కిలోలకు పైగా బరువున్న ఓ అడవి దున్నను లేపి కిందపడేసింది. ఈ దృశ్యాలను తమ కెమెరాల్లో బంధించిన వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో వైరల్ గా మారింది.

Kenya 4

ఇక ఈ చిత్రం చూసేందుకు సినిమా యానిమేషన్ ను తలపించేందిగా ఉన్నా.. ఇది వస్తవ చిత్రమని వైల్డ్ లైఫ్ ఫోటో గ్రాఫర్స్ చెబుతున్నారు. ఇక ఇదే అంశంపై జంతు ప్రవర్తనపై అధ్యయనం చేసే పరిశోధకులు స్పందించారు. ఏనుగుకు కోపం రానంతవరకే అది సాదు జంతువులా ఉంటుంది.. కోపం వస్తే ఏ క్రూర జంతువుకు కూడా దానికి పోటీ రాలేదు. కొన్ని సార్లు ఏనుగులను చూస్తే అడవికి రాజు అవే అనిపిస్తుంది. తమతోపాటు ఉండే జంతువులను కాపాడటంలో కూడా ఏనుగులు ముందుటాయని చెబుతున్నారు.