Elon Musk : మాటంటే.. మాటే.. ఎలాన్ మస్క్ మాటిచ్చాడు.. నిలబెట్టుకున్నాడు..!

Elon Musk : ఆయన మాటే శాసనం.. ఒకసారి మాట ఇచ్చాడంటే మడమతిప్పడంతే.. ఆయనే ప్రపంచ కుబేరుడు టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్..

Elon Musk : మాటంటే.. మాటే.. ఎలాన్ మస్క్ మాటిచ్చాడు.. నిలబెట్టుకున్నాడు..!

Elon Musk Ukraine Thanks Elon Musk For Starlink Amid Russian Invasion, His Reply

Elon Musk : ఆయన మాటే శాసనం.. ఒకసారి మాట ఇచ్చాడంటే మడమతిప్పడంతే.. ఆయనే ప్రపంచ కుబేరుడు టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్.. అత్యవసర పరిస్థితుల్లో సాయం కోరిన వెంటనే తన స్టార్ లింక్ సర్వీసులను అందించి మస్క్ అందరి మన్ననలను అందుకుంటున్నాడు. యుక్రెయిన్, రష్యా మధ్య భీకర యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో రష్యా దాడితో యుక్రెయిన్‌లో ఒక్కసారిగా ఇంటర్నెట్ సర్వీసులు నిలిచిపోయాయి. ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలగడంతో యుక్రెయిన్ ఉపాధ్యక్షుడు Mykhailo Fedorov.. తమకు స్టార్ లింక్ సర్వీసులను అందించాలని ఎలాన్ మస్క్‌ను కోరారు.

ఈ క్రమంలోనే యుక్రెయిన్‌లో SpaceX నుంచి స్టార్ లింక్ సర్వీసులను అందిస్తానని మస్క్ మాటిచ్చారు. ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకున్నారు మస్క్.. రష్యా దాడులతో స్తంభించిపోయిన ఉక్రెయిన్‌లో ఇంటర్నెట్ సేవలను తిరిగి పునరుద్దరించేందుకు స్టార్ లింక్ టర్మినల్స్‌ను పంపిస్తున్నట్లు మస్క్ వెల్లడించారు. ఇప్పటికే కొన్ని టర్మినల్స్ స్పేస్ ఎక్స్ సంస్థ యుక్రెయిన్‌కు చేరవేసింది.

Elon Musk Ukraine Thanks Elon Musk For Starlink Amid Russian Invasion, His Reply (1)

Elon Musk Ukraine Thanks Elon Musk For Starlink Amid Russian Invasion, His Reply

Elon Musk  : స్టార్ లింక్ వచ్చేసింది.. మస్క్ మీకు ధన్యవాదాలు :
స్టార్ లింక్ టెర్మినల్స్ యుక్రెయిన్‌కు చేరిన విషయాన్ని ఆ దేశ ఉపాధ్యక్షుడు Mykhailo Fedorov ధృవీకరించారు. టర్మినల్స్‌తో ఉన్న ట్రక్కు ఫొటోను ట్విటర్‌లో షేర్ చేశారు. ‘స్టార్ లింక్ వచ్చేసింది. మస్క్ మీకు ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు. ఈ ఏడాదిలో సునామీ కారణంగా టెలికమ్యూనికేషన్స్ నెట్‌వర్క్ తీవ్రంగా దెబ్బతిన్న టోంగా ద్వీపంలోనూ ఇంటర్నెట్‌ను పునరుద్ధరించడానికి ఈ బిలియనీర్ 50 శాటిలైట్ టెర్మినళ్లను విరాళంగా ఇచ్చారు.


స్పేస్‌ ఎక్స్‌ స్టార్‌లింక్‌ ప్రాజెక్టులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్‌ సర్వీసులను అందించడానికి ఎలన్‌ మస్క్‌ కంపెనీ స్టార్‌లింక్‌ ప్రయత్నిస్తోంది. ఇప్పటివరకూ 11కు పైగా దేశాలలో స్టార్‌లింక్‌ సర్వీసులు అందుబాటులోకి వచ్చేశాయి. స్టార్‌లింక్‌ శాటిలైట్స్ ఆధారంగా ఇంటర్నెట్’ను రిమోట్ ప్రాంతాలకు కూడా అందించడమే లక్ష్యంగా SpaceX కంపెనీ భావిస్తోంది.

స్పేస్‌ ఎక్స్‌ స్టార్‌లింక్‌ ప్రాజెక్టు కోసం 18 వందలకు పైగా శాటిలైట్లను విజయవంతంగా నిర్ణీత కక్ష్యలోకి పంపించింది. మరోవైపు.. రష్యా యుక్రెయిన్‌ను ఆక్రమించేందుకు ప్రయత్నిస్తోంది. రష్యా చర్యలను దీటుగా ప్రతిఘటిస్తూ యుక్రెయిస్ సైన్యం విరోచితంగా పోరాడుతోంది.

Read Also : Russia Ukraine War : రష్యా వైమానిక దాడుల్లో కీవ్ టీవీ టవర్ ధ్వంసం.. ఐదుగురు దుర్మరణం!