Russia Ukraine War : రష్యా వైమానిక దాడుల్లో కీవ్ టీవీ టవర్ ధ్వంసం.. ఐదుగురు దుర్మరణం!

Russia Ukraine War : యుక్రెయిన్, రష్యా మధ్య భీకర పోరు కొనసాగుతోంది. యుక్రెయిన్ రాజధాని కీవ్ నగరం సరిహద్దులోకి దూసుకొచ్చిన రష్యా బలగాలు వైమానపిక దాడులకు పాల్పడుతున్నాయి.

Russia Ukraine War : రష్యా వైమానిక దాడుల్లో కీవ్ టీవీ టవర్ ధ్వంసం.. ఐదుగురు దుర్మరణం!

Russia Ukraine War 5 Dead As Russia Attacks Tv Tower In Ukraine Capital Kyiv, Signal Disrupted (1)

Russia Ukraine War : యుక్రెయిన్, రష్యా మధ్య భీకర పోరు కొనసాగుతోంది. యుక్రెయిన్ రాజధాని కీవ్ నగరం సరిహద్దులోకి దూసుకొచ్చిన రష్యా బలగాలు వైమానపిక దాడులకు పాల్పడుతున్నాయి. రష్యా బలగాను దీటుగా యుక్రెయిన్ సైన్యం కూడా వీరోచితంగా పోరాడుతోంది. రష్యా వైమానిక దాడులతో కీవ్ నగరంలో విధ్వంసం సృష్టిస్తోంది. తాజాగా రష్యా జరిపిన వైమానిక దాడుల్లో కీవ్ నగరంలోని ప్రధాన టీవీ టవర్ ధ్వంసమైంది.

ఈ దాడిలో అక్కడే ఉన్న ఐదుగురు మృతిచెందినట్టు యుక్రెయిన్ అధికారులు ప్రకటించారు. యుక్రెయిన్ రాజధాని కైవ్ నడిబొడ్డున ఉన్న ప్రధాన టెలివిజన్ టవర్‌పై రష్యా దళాలు దాడి చేసినట్టు రష్యా రక్షణ శాఖ ధ్రువీకరించింది. ఈ దాడి వల్ల టవర్ సిగ్నల్‌కు అంతరాయం కలిగిందని యుక్రెయిన్ అంతర్గత మంత్రిత్వ శాఖ సలహాదారు ఆంటోన్ హెరాష్చెంకో (Anton Herashchenko) తెలిపారు.

రష్యా వైమానిక దాడి కారణంగా కైవ్ చుట్టూ భారీ శబ్దంతో కంపించిపోయింది. వైమానిక దాడి జరిగిన ప్రాంతమైన బాబియార్ జిల్లాలో దట్టమైన పొగలు వ్యాపించాయి. రష్యా వైమానిక దాడిలో టీవీ టవర్‌లోని అనేక పరికరాలు దెబ్బతిన్నాయని, టెలివిజన్ ఛానెల్‌లు కొంత సమయం వరకు పని చేయవు’ అని అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. స్థానిక మీడియా నివేదికల ప్రకారం.. వరుస పేలుళ్లు సంభవించినట్టు వెల్లడించాయి. ఆ తర్వాత యుక్రేనియన్ టీవీ ఛానెల్‌లు ప్రసారాలను నిలిపివేసినట్టు పేర్కొన్నాయి.

Russia Ukraine War 5 Dead As Russia Attacks Tv Tower In Ukraine Capital Kyiv, Signal Disrupted (2)

Russia Ukraine War 5 Dead As Russia Attacks Tv Tower In Ukraine Capital Kyiv, Signal Disrupted

Read Also : Olena Zelenska : నాకు భయం, కన్నీళ్లు రావు.. నా భార్త జెలెన్ స్కీతో ఇక్కడే ఉన్నాం.. ఎక్కడికి పోలేదు..!

రష్యా వైమానిక దాడుల్లో యుక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ మరణాలను ట్విట్టర్‌లో ధృవీకరించారు. రష్యా దురాక్రమణ చర్యకు అమాయికులు బలైపోతున్నారని, కనీసం 5 మంది చనిపోయారని, చరిత్ర పునరావృతమవుతుందని జెలెన్స్కీ అన్నారు. కైవ్‌లోని తూర్పు నగరమైన ఖార్కివ్, ఉత్తర నగరమైన చెర్నిహివ్ చుట్టూ రష్యన్ దళాలు ఫిరంగులను ప్రయోగిస్తున్నట్టు నివేదించింది. గత 48 గంటల్లో రష్యా సైనికులు మునుపటి కంటే భారీ ఆయుధాలను ప్రయోగించినట్టు నివేదికలు వెల్లడించాయి.

మంగళవారం తెల్లవారుజామున యుక్రెయిన్‌లోని రెండవ అతిపెద్ద నగరమైన ఖార్కివ్ ప్రధాన కూడలిపై రష్యా క్షిపణి బాంబు దాడి చేసింది. మీడియా నివేదికల ప్రకారం.. ఈ దాడిలో రష్యా సైనికులు అనేక నివాస ప్రాంతాలను కూడా లక్ష్యంగా చేసుకుని దాడి చేసినట్టుగా చెబుతున్నారు. వైమానిక దాడిలో కనీసం ఎనిమిది మంది మరణించినట్లు భావిస్తున్నారు.

Read Also : Russia Ukraine War : యుక్రెయిన్‌ను కాపాడుతాం.. పుతిన్ అంతు చూస్తాం.. రష్యా విమానాలపై బైడెన్ ఆంక్షలు!