Elon Musk: ఎలన్ మస్క్‌కు ఎదురుదెబ్బ.. న్యూరాలింక్ సంస్థపై అమెరికా విచారణ.. కారణమేంటి?

ఎలన్ మస్క్ స్థాపించిన సంస్థల్లో ఒకటి ‘న్యూరాలింక్’. మనిషి మెదడులో చిప్ అమర్చి, దాని ద్వారా కంప్యూటర్‌ను కంట్రోల్ చేయగలగడమే ఈ కంపెనీ చేసే పని. అయితే, ఈ కంపెనీకి ప్రస్తుతం ఎదురుదెబ్బ తగిలింది.

Elon Musk: ఎలన్ మస్క్‌కు ఎదురుదెబ్బ.. న్యూరాలింక్ సంస్థపై అమెరికా విచారణ.. కారణమేంటి?

Elon Musk: టెస్లా అధినేత ఎలన్ మస్క్ సంస్థల్లో ఒకటి ‘న్యూరాలింక్’. ఇది బ్రెయిన్ ఇంప్లాంట్ డివైజ్ కంపెనీ. మనిషి మెదడులో ఒక చిప్ అమర్చి, దాని ద్వారా కంప్యూటర్‌ను కంట్రోల్ చేసేలా ఈ కంపెనీ పరిశోధనలు సాగిస్తోంది. దీనికోసం ఇప్పటికే ఒక చిప్ కూడా తయారు చేసింది. కోతి వంటి జంతువుల్లో ఈ చిప్ ప్రయోగం పూర్తైంది.

Himanta Biswa Sarma: మహిళలు పిల్లల్ని కనే పరిశ్రమలు కాదు.. అజ్మల్‌కు కౌంటర్ ఇచ్చిన అసోం సీఎం

త్వరలో మనిషి మెదడులో ఈ చిప్ ప్రవేశపెట్టాలని మస్క్ చూస్తున్నాడు. అయితే, ఈలోపే ఈ సంస్థ విషయంలో ఎలన్ మస్క్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఈ సంస్థను అమెరికాకు చెందిన దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో విచారణ చేపట్టనుంది. కారణం.. చిప్ ప్రయోగం కోసం అనేక జంతువులను నిబంధనలకు విరుద్ధంగా చంపడమే. మానవ శరీరానికి సంబంధించి జరిగే పరిశోధనల్లో అనేక సంస్థలు ముందుగా జంతువులపై ప్రయోగాలు చేస్తాయి. దీనికి అనుమతులు కూడా తీసుకుంటాయి. వాటి విషయంలో నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాల్సి ఉంటుంది. కొన్నిసార్లు కంపెనీలు నిబంధనలు అతిక్రమిస్తుంటాయి. తాజాగా ‘న్యూరాలింక్’ సంస్థపై కూడా ఇలాంటి అభియోగాలే ఉన్నాయి.

Covid-19: కోవిడ్ మానవ సృష్టే.. చైనా ల్యాబ్‌లోనే తయారీ.. వెల్లడించిన వుహాన్ ల్యాబ్ సైంటిస్ట్

ఈ సంస్థ తన పరిశోధనలకుగాను జంతు సంక్షేమ చట్టాల్ని ఉల్లంఘించిందని ఆరోపణలు వస్తున్నాయి. త్వరగా ఫలితం రాబట్టేందుకు జంతువుల్ని హింసించినట్లు భావిస్తున్నారు. అందుకే దీనిపై ఫెడరల్ బ్యూరో విచారణ జరుపుతోంది. 2018 నుంచి ఇప్పటివరకు ఈ సంస్థ 1,500 వరకు జంతువుల్ని చంపినట్లు ఆరోపణలున్నాయి. వీటిలో ఎలుకలు, పందులు, గొర్రెలు, కోతులు వంటి జంతువులున్నాయి. ఈ అంశంపై విచారణ జరిగితేనే అసలు విషయం తెలుస్తుంది.