Canada : కూతురికి సర్ప్రైజ్ ఇవ్వడానికి కెనడా వెళ్లిన తండ్రి .. హార్ట్ టచింగ్ వీడియో వైరల్

ఓ తండ్రి తన కూతురికి సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాడు. ఇండియా నుంచి కెనడాకు ఆమెకు చెప్పకుండా వెళ్లాడు. కళ్లముందు తండ్రి కనిపించేసరికి ఆ కూతురి ఆనందం మాటల్లో చెప్పలేం. కన్నీరు పెట్టించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

Canada : కూతురికి సర్ప్రైజ్ ఇవ్వడానికి కెనడా వెళ్లిన తండ్రి .. హార్ట్ టచింగ్ వీడియో వైరల్

Canada

Canada : కెనడాలో ఉంటున్న తన కూతురికి సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాడు ఆమె తండ్రి. ఆమెకు తెలియకుండా కెనడా చేరుకున్నాడు. ఒక్కసారిగా కళ్లముందు కనిపించిన తండ్రిని చూసి ఆ కుమార్తె ఎమోషనల్ అయ్యింది. ఈ వీడియో చూసిన వారి కళ్లు చమ్మగిల్లాయి.

Daughter Gift : మొదటి జీతంతో తండ్రికి విలువైన గిఫ్ట్ ఇచ్చిన కూతురు.. వీడియో వైరల్

ఇన్‌స్టాగ్రామ్ యూజర్ శ్రుత్వ దేశాయ్ (shrutva_desai) తన అకౌంట్‌లో షేర్ చేసిన వీడియో అందరి మనసుల్ని హత్తుకుంది. గ్రాడ్యుయేషన్‌కు ముందు తనకు తండ్రి ఇచ్చిన సర్ప్రైజ్‌ను ఆమె వీడియో ద్వారా షేర్ చేసుకున్నారు. తన కోసం ఇండియా నుంచి కెనడాకు ప్రయాణం చేసి వచ్చిన తండ్రిని చూసి ఆమె తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ‘ఇండియా నుంచి కెనడాకు నాన్న వచ్చి నాకు కనిపించినపుడు నా గుండె కొట్టుకుంది. ఇది నాకు చాలా అద్భుతమైన క్షణం. మా నాన్న లోపలికి వస్తుంటే నేను షాకయ్యాను..అంతే కాదు ఎమోషనల్ అయిపోయాను.. నన్ను చూడటం కోసం అంత దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చారని నేను నమ్మలేకపోయాను. ఇలాంటి అద్భుతమైన నాన్నను పొందడం నా అదృష్టంగా భావిస్తున్నాను.. నిన్ను చాలా ప్రేమిస్తున్నాను నాన్నా’ అంటూ శ్రుత్వ దేశాయ్ తను షేర్ చేసిన వీడియో శీర్షికలో రాసుకొచ్చారు. ఇక ఈ వీడియో అందరి మనసుల్ని హత్తుకుంది.

Viral Tweet: హాస్టల్ నుంచి ఇంటికొస్తున్న కూతురు.. తండ్రికి పంపిన మెనూ లిస్ట్ చూస్తే షాకవ్వడం ఖాయం

‘ఈరోజు నేను ఇంటర్నెట్‌లో చూసిన అందమైన వీడియో ఇది’ అని ఒకరు.. ‘అద్భుతమైన వీడియో.. నా కన్నీళ్లను కంట్రోల్ చేసుకోలేకపోయాను’ అంటూ మరొకరు ఇలా కామెంట్లు పెట్టారు. తండ్రీ, కూతుళ్ల ప్రేమకు అద్దం పడుతున్న ఈ వీడియోకు చాలామంది లవ్ ఇమోజీలు జోడించారు.

 

View this post on Instagram

 

A post shared by Shrutva🤍 (@shrutva_desai)