Jarvo Ban : కోహ్లి ప్లేస్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన జార్వోకు భారీ షాక్.. జీవితకాల నిషేధం

ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టెస్ట్‌ మూడో రోజు ఆటలో భారత్ బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో ప్యాడ్లు కట్టుకుని మైదానంలోకి వచ్చి హడావుడి చేసిన ఇంగ్లండ్‌ ప్రాంక్‌ యూట్యూబర్‌, క్రికెట్ అభిమాని

Jarvo Ban : కోహ్లి ప్లేస్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన జార్వోకు భారీ షాక్.. జీవితకాల నిషేధం

Jarvo Ban

Jarvo Ban : ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టెస్ట్‌ మూడో రోజు ఆటలో భారత్ బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో ప్యాడ్లు కట్టుకుని మైదానంలోకి వచ్చి హడావుడి చేసిన ఇంగ్లండ్‌ ప్రాంక్‌ యూట్యూబర్‌, క్రికెట్ అభిమాని జార్విస్‌ అలియాస్‌ జార్వో 69కు హెడింగ్లే స్టేడియం యాజమాన్యం భారీ షాక్ ఇచ్చింది. అతడిపై జీవితకాల నిషేధం విధించింది. ఇకపై అతడు స్టేడియంలోకి ప్రవేశించ లేడు. రెండోసారి అనుమతి లేకుండా గ్రౌండ్ లోకి రావడంతో పాటు భద్రతా కారణాలతో అతనిపై ఈ చర్యలు తీసుకున్నట్లు యార్క్‌షైర్‌ కౌంటీ తెలిపింది. జార్వో.. టీమిండియా అధికారిక జెర్సీ ధరించడం కూడా నేరంగానే పరిగణించామంది.

Jio vs Airtel.. టెలికం రంగంలోకి గూగుల్‌ ఎంట్రీ?

మూడో టెస్ట్‌ మూడో రోజు టీ విరామం తర్వాత 47వ ఓవర్‌లో 59 పరుగులు చేసిన రోహిత్‌ శర్మ.. ఓలీ రాబిన్సన్‌ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. అయితే అంపైర్‌ కాల్‌పై టీమిండియా రివ్యూ కోరింది. ఇదే సమయంలో జార్వో మైదానంలోకి వచ్చి నానా హంగామా చేశాడు. టీమిండియా జెర్సీలో ప్యాడ్స్, బ్యాట్‌ పట్టుకుని కోహ్లి స్థానంలో 4వ నంబర్‌ బ్యాట్స్‌మన్‌లా క్రీజులోకి వచ్చేశాడు. కోహ్లి వచ్చాడనే తొలుత భావించిన సెక్యూరిటీ.. తర్వాత తేరుకుని జార్వోను బలవంతంగా బయటికి తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Bollywood Stars Bodyguards : అమితాబ్ నుంచి షారుక్ ఖాన్ వరకు.. బాడీగార్డులకు కోట్లు చెల్లిస్తున్న స్టార్స్

లార్డ్స్‌ టెస్టులోనూ ఇలానే మైదానంలోకి వచ్చి నవ్వులు పూయించాడు జార్వో. ఆ మ్యాచ్‌లో ప్రేక్షకుల గ్యాలరీలో నుంచి వచ్చిన జార్వో టీమిండియా జెర్సీ వేసుకొని ఆటగాళ్లతో కలిసి గ్రౌండ్‌లోకి వచ్చాడు. మొదట జార్వోని గుర్తుపట్టలేకపోయిన భద్రతా సిబ్బంది.. ఆ తర్వాత అతన్ని బయటికి లాక్కెళ్లారు. ఆ సమయంలో అతను.. ‘భారత్‌కు ఆడిన తొలి ఇంగ్లండ్‌ ఆటగాడిని తానేనంటూ గట్టిగా అరుస్తూ చప్పట్లు కొట్టడం’ అప్పట్లో ట్రెండింగ్‌గా మారింది. అయితే, అప్పుడు మొదటి తప్పుగా పరిగణించిన ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు ఫైన్‌తో సరిపెట్టింది. ఈసారి మాత్రం యాక్షన్ తీసుకుంది. లైఫ్ టైమ్ బ్యాన్ విధించింది.