Jio vs Airtel.. టెలికం రంగంలోకి గూగుల్‌ ఎంట్రీ?

భారతీయ టెలికం రంగంలోకి సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ ఎంట్రీ ఇవ్వబోతుందా? అంటే అవుననే అంటున్నాయి టెలికం వర్గాలు.. గూగుల్ టెలికం రంగంలోకి అడుగుపెడితే పెనుమార్పులు చోటుచేసుకోనున్నాయి.

Jio vs Airtel.. టెలికం రంగంలోకి గూగుల్‌ ఎంట్రీ?

Google Likely To Invest Big In Airtel After Financing Rival Jio

Updated On : August 28, 2021 / 9:29 PM IST

Google to invest big in Airtel after financing rival Jio : భారతీయ టెలికం రంగంలోకి ప్రపంచ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ ఎంట్రీ ఇవ్వబోతుందా? అంటే అవుననే అంటున్నాయి టెలికం ఇండస్ట్రీ వర్గాలు.. గూగుల్ టెలికం రంగంలోకి అడుగుపెడితే పెనుమార్పులు చోటుచేసుకుంటాయనే టాక్ వినిపిస్తోంది. భారత్‌ను వేదికగా చేసుకుని టెక్ దిగ్గజాలు పోటీకి దిగబోతున్నాయట.. గూగుల్ భారత్ టెలికం రంగంపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మార్కెట్ అయిన భారతదేశంలో గూగుల్ పాగా వేసేందుకు రెడీ అయింది. ఇప్పటికే డేటా సంచలనం రియలన్స్ జియోలో రూ.34వేలు పెట్టుబడిగా పెట్టేసింది.

అందులో 7 శాతం వాటాను గూగుల్ కొనుగోలు చేసేసింది కూడా. భారతీ ఎయిర్ టెల్ తో కలిసి భారీ పెట్టుబడులు పెట్టేందుకు గూగుల్ రెడీ అయింది. ఈ డీల్ విషయంలో ఇప్పటికే ఎయిర్‌టెల్‌తో గూగుల్ చర్చలు జరిపింది. జియో తర్వాత దేశంలో టెలికం రంగంలో గట్టిపోటీ ఇస్తున్న నెట్ వర్క్.. ఎయిర్ టెల్.. అందుకే ఈ టెలికం కంపెనీలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు గూగుల్ ఆసక్తి చూపిస్తోంది. ఎయిర్ టెల్, గూగుల్ మధ్య సంవత్సరం నుంచే చర్చలు జరుగుతున్నాయి. అతి త్వరలోనే రెండింటి మధ్య డీల్ కుదిరే అవకాశం ఉందని ఓ నివేదిక వెల్లడించింది. అమెరికా, చైనాకు మధ్య సంబంధాలు దెబ్బతినడంతో ఇండియాపై టెక్‌ దిగ్గజ కంపెనీలు ఫోకస్ పెట్టాయి.
Jio : జియో స్మార్ట్‌ఫోన్ ప్రీ బుకింగ్స్‌.. ఎప్పటి నుంచి అంటే..

ఎయిర్ టెల్, గూగుల్ మధ్య డీల్ కుదిరితే మాత్రం.. భారతీయ టెలికం రంగంలో ప్రైస్ వార్ తప్పదనే టాక్ వినిపిస్తోంది. అదేగానీ, జరిగితే నెట్ వర్క్ యూజర్లకు తక్కువ ధరకే మొబైల్ నెట్ వర్క్ సర్వీసులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే.. గతంలోనే టాటా డొకొమో ఎంట్రీతో కాల్ పల్స్ రేట్లు ఒక్కసారిగా తగ్గిపోయాయి. ఆ తర్వాత రిలయన్స్ జియో ఎంట్రీతో డేటా, కాల్ ఛార్జీలు అమాంతం పడిపోయాయి. చీపెస్ట్ డేటాతో యూజర్లను ఆకట్టుకుంది. అప్పటివరకూ మరో నెట్ వర్క్ లో ఉన్న యూజర్లంతా జియో వైపు వచ్చేశారు. ఆ తర్వాత నుంచి క్రమంగా కాల్, డేటా రేట్లలో మార్పులు వచ్చాయి. మళ్లీ కాల్, డేటా ధరలు పెంచుతూ ముందుకు వెళ్తున్నాయి టెలికం కంపెనీలు. ఈ నేపథ్యంలో ఎయిర్ టెల్, గూగుల్ మధ్య డీల్ కుదిరితే మళ్లీ ప్రైస్ వార్ తప్పదనే చెప్పాలి.
Airtel Jio Deal : భారతీ ఎయిర్‌టెల్‌, జియో మధ్య కుదిరిన ఒప్పందం