Airtel Jio Deal : భారతీ ఎయిర్‌టెల్‌, జియో మధ్య కుదిరిన ఒప్పందం

రెండు దిగ్గజ టెలికామ్ సంస్థల మధ్య కీలక ఒప్పందం ముగిసింది. టెలికమ్యూనికేషన్స్ దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ మూడు సర్కిల్స్‌లో 800 Mhz ఎయిర్‌వేవ్‌ల(స్పెక్ట్రమ్‌)ను రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌కు విక్రయించే ఒప్పందం నేటితో ముగిసింది.

Airtel Jio Deal : భారతీ ఎయిర్‌టెల్‌, జియో మధ్య కుదిరిన ఒప్పందం

Airtel Jio Deal

Airtel Jio Deal : రెండు దిగ్గజ టెలికామ్ సంస్థల మధ్య కీలక ఒప్పందం ముగిసింది. టెలికమ్యూనికేషన్స్ దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ మూడు సర్కిల్స్‌లో 800 Mhz ఎయిర్‌వేవ్‌ల(స్పెక్ట్రమ్‌)ను రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌కు విక్రయించే ఒప్పందం నేటితో ముగిసింది. కాగా ఈ ఏడాది ప్రారంభం నుంచి దీనిపై చర్చ నడుస్తుంది. ఇరు కంపెనీల ప్రతినిధులు అనేక సార్లు భేటీ అయ్యారు.

కీలక భేటీల అనంతరం డీల్ ముగిసింది. కాగా రెండు దిగ్గజ టెలికాం ప్రత్యర్థుల మధ్య డీల్‌ జరగడం ఇదే మొదటిసారి. స్టాక్ ఎక్స్ఛేంజీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఎయిర్‌టెల్ తన మూడు సర్కిల్‌లలోని 800 MHz స్పెక్ట్రంను బదిలీ చేయడానికి రిలయన్స్ జియోతో తన వాణిజ్య ఒప్పందాన్ని ముగిసినట్లు ప్రకటించింది.

ఒప్పందం ప్రకారం జియో ఎయిర్‌టెల్‌కు సుమారు రూ. 1004.8 కోట్లను ముట్టచెప్పింది. స్పెక్ట్రమ్‌ బాధ్యతలు చేపట్టడానికి అదనంగా సుమారు రూ. 469. 3 కోట్లను ఎయిర్‌టెల్‌కు చెల్లించనున్నట్లు తెలుస్తోంది. ఈ డీల్ ముగియడంతో ఆంధ్రప్రదేశ్‌, ఢిల్లీ, ముంబై సర్కిళ్లోని ఎయిర్‌టెల్‌ 800Mhz స్పెక్ట్రమ్‌ను జియో పొందనుంది.