ఆరోజు ఆత్మీయుల సమాధులను తవ్వితీస్తారు… కొత్త బట్టలు తొడుగుతారు… కౌగలించుకొంటారు… దమ్ముకొట్టమంటారు..వింత ఆచారం

  • Published By: madhu ,Published On : August 26, 2020 / 08:10 AM IST
ఆరోజు ఆత్మీయుల సమాధులను తవ్వితీస్తారు… కొత్త బట్టలు తొడుగుతారు… కౌగలించుకొంటారు… దమ్ముకొట్టమంటారు..వింత ఆచారం

ఏడాదికొకసారి..శవాలను వెలికి తీస్తారు. జీవించి ఉన్నప్పుడు ఎలా ఉన్నారో అలా తయారు చేస్తారు. కొన్ని శవాలకు కళ్లద్దాలు, సూట్ వేస్తారు. మరికొంతమంది కాళ్లకు షూస్, నోట్లో సిగరేట్ వెలిగిస్తారు. శవాన్ని ఇంటికి తీసుకొస్తారు.



అక్కడనే బంధువులు, కుటుంబసభ్యులు శవాన్ని పక్కనే పెట్టుకుని విందు చేసుకుంటుంటారు. తిరిగి సాయంత్రం కన్నీటి వీడ్కోలు మధ్య శవాన్ని మరలా పాతి పెడుతారు. ఇలా ప్రతి సంవత్సరం ఆగస్టు నెలలో చేసుకుంటుంటారు.
https://10tv.in/german-halle-university-researchers-stage-crowded-concert-to-study-spread-of-covid-19-at-large-gatherings/
ఇండోనేషియాలో ఈ వింత ఆచారాన్ని పాటిస్తుంటారు.
రిందిగాల్లో గ్రామ ప్రజల నమ్మకాలు, విశ్వాసాలు వేరేగా ఉంటాయి. కుటుంబసభ్యులు ఎవరైనా మరణిస్తే…వారిని బతికి ఉన్న వారిగా భావిస్తారు. శవ పేటికల్లో పెట్టి ప్రత్యేకంగా తయారు చేసిన సమాధుల్లో ఉంచుతారు.



ప్రతి సంవత్సరం ఆగస్టు నెలలో సమాధుల నుంచి మృత దేహాలను బయటకు తీస్తారు. సంప్రదాయం ప్రకారం కార్యక్రమాలు నిర్వహిస్తారు. జాగ్రత్తగా రసాయనాలతో శుభ్రపరుస్తారు. వారు బతికి ఉన్నప్పుడు ఎలా ఉండే వారో అలా తయారు చేస్తారు. దుస్తులు, కళ్లద్దాలు, సిగరేట్లు, తినే పదార్థాలను ఏర్పాటు చేస్తారు.

తర్వత శవాలను ఇంటికి తీసుకొస్తారు. వారికి ఇష్టమైన ప్లేస్ లో పడుకోబెడుతారు. మధ్యాహ్నం విందు చేసుకుంటారు. అక్కడే భోజనం చేస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఓ పండుగలా జరుపుకుంటుంటారు. ఇక చీకటి పడుతున్న సమయంలో అందరిలో విషాధ ఛాయలు కనిపిస్తాయి.



శవాలను తిరిగి సమాధుల్లోకి చేరుస్తున్న క్రమంలో కన్నీళ్లు పెట్టుకుంటుంటారు. రాత్రంతా జాగరణ చేస్తూ గడుపుతారు.